Ghanpur
-
ఎన్నికలు రాగానే ఆగం కావొద్దు: కేసీఆర్
-
భవిష్యత్తుకు భరోసా!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా వెలువడిన తర్వాత కొన్ని నియోజకవర్గాల్లో రాజుకున్న వేడి క్రమంగా చల్లబడుతోంది. పార్టీ నేతల మధ్య సయోధ్యకు జరుగుతున్న ప్రయత్నాలు ఒకటొకటిగా కొలిక్కి వస్తున్నాయి. జనగామ సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని బుజ్జగించిన అధినేత కేసీఆర్.. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి ఆ నియోజకవర్గం టికెట్ ఖరారు చేశారు. మరోవైపు స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో ఇద్దరు మాజీ ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య నడుమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సమక్షంలో రాజీ కుదిరింది. నర్సాపూర్ అభ్యర్థి ప్రకటనలో నెలకొన్న ప్రతిష్టంభనను కూడా రెండు మూడురోజుల్లో తొలగించేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు. కల్వకుర్తి, పటాన్చెరు తదితర నియోజకవర్గాల్లో పార్టీ నేతల మధ్య అంతర్గత విభేదాలను పరిష్కరించడంపై కూడా కేటీఆర్ దృష్టి సారించారు. జనగామ, నర్సాపూర్‌తో పాటు నాంపల్లి, గోషామహల్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థుల పేర్లను మరో వారం రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశముంది. ఆర్టీసీ చైర్మన్ పదవి కావాలన్న ముత్తిరెడ్డి? ఎమ్మెల్యే జీవన్‌రెడ్డితో పాటు ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, వెంకట్రాంరెడ్డి శుక్రవారం జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి నివాసానికి వెళ్లారు. అంతా కలిసి ప్రగతిభవన్‌కు వెళ్లి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ముత్తిరెడ్డికి టికెట్ నిరాకరణకు కారణాలను వివరించిన కేసీఆర్.. పల్లా రాజేశ్వర్‌రెడ్డికి సహకరించి ఆయన గెలుపు కోసం పనిచేయాలని సూచించారు. ప్రస్తుతం ఏదో ఒక ప్రాధాన్యత కలిగిన పదవి ఇవ్వడంతో పాటు, భవిష్యత్తులో ఎమ్మెల్సీగానూ అవకాశం కల్పిస్తానని హామీ ఇ చ్చినట్లు తెలిసింది. అయితే తనకు ఆర్టీసీ చైర్మన్ పదవి కావాలని ముత్తిరెడ్డి కోరగా ప్రస్తుతం ఎమ్మెల్సీ పల్లా నిర్వహిస్తున్న రైతుబంధు సమితి అధ్యక్ష పదవిని కేసీఆర్ ఆఫర్ చేసినట్లు సమాచారం. కాగా ముత్తిరెడ్డి బెట్టు వీడిన నేపథ్యంలో జనగామ బీఆర్ఎస్ అభ్యరి్థగా పల్లా పేరును కేసీఆర్ ఖరారు చేశారు. నర్సాపూర్, కల్వకుర్తిపై త్వరలో స్పష్టత నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి ప్రకటనలో నెలకొన్న ప్రతిష్టంభనపై బీఆర్ఎస్ అధినేత దృష్టి సారించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డితో పాటు మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి కూడా టికెట్ కోసం పట్టుబడుతుండటంతో అభ్యర్థి ప్రకటనను పెండింగులో పెట్టారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీ చేస్తానని మదన్‌రెడ్డి స్పష్టం చేస్తూ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమ లేదా మంగళవారం అందుబాటులో ఉండాల్సిందిగా ఇద్దరు నేతలకు ప్రగతిభవన్ నుంచి సమాచారం వెళ్లినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే కల్వకుర్తి టికెట్‌ను ఆశించిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డికి కూడా శుక్రవారం ప్రగతిభవన్ నుంచి పిలుపు వెళ్లినట్లు తెలిసింది. కేసీఆర్ ఆదేశాల మేరకు కసిరెడ్డి ప్రగతిభవన్‌కు చేరుకున్నప్పటికీ సీఎం ఇతర సమావేశాలతో బిజీగా ఉండటంతో భేటీ వాయిదా పడింది. కసిరెడ్డికి ఒకటి రెండురోజుల్లోనే మరోమారు పిలుపు వచ్చే అవకాశమున్నట్లు సమాచారం. తనను కల్వకుర్తి అభ్యరి్థగా ప్రకటించి, సిట్టింగ్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌కు తాను ఖాళీ చేసే ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని కసిరెడ్డి కోరుతున్నారు. వరంగల్ ఎంపీగా పోటీ చేస్తానన్న రాజయ్య! స్టేషన్ ఘన్పూర్ టికెట్ విషయంలో నెలకొన్న పంచాయితీ కూడా ప్రగతిభవన్ వేదికగా కొలిక్కి వ చ్చింది. ఎమ్మెల్సీ పల్లా శుక్రవారం స్టేషన్ ఘన్పూర్ బీఆర్ఎస్ అభ్యరి్థ, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను వెంటబెట్టుకుని కేటీఆర్ వద్దకు వెళ్లారు. సంప్రదింపులు, చర్చల అనంతరం కడియం శ్రీహరి అభ్యరి్థత్వానికి సంపూర్ణ మద్దతు పలుకుతున్నట్లు రాజయ్య ప్రకటించారు. కడియం ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ పదవిని రాజయ్యకు ఇస్తామని కేటీఆర్ హామీ ఇచ్చినట్లు తెలిసింది. అయితే గతంలో శ్రీహరికి వరంగల్ ఎంపీగా అవకాశం ఇ చ్చినందున తనకు వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఇవ్వాలని రాజయ్య కోరినట్లు సమాచారం. వరంగల్ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్‌కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి తనకు లోక్‌సభకు పోటీ చేసే అవకాశమివ్వాలని రాజయ్య పట్టుబట్టినట్లు సమాచారం. అయితే కేటీఆర్ ఏదో ఒక చట్టసభలో క చ్చితంగా పదవి ఇస్తామని భరోసా ఇవ్వడంతో రాజయ్య అంగీకరించినట్లు తెలిసింది. కేటీఆర్‌తో భేటీ అనంతరం కడియం శ్రీహరి గెలుపు కోసం పనిచేస్తానంటూ రాజయ్య ప్రకటించారు. కాగా పార్టీ నిర్ణయం మేరకు తనకు మద్దతు ప్రకటించిన రాజయ్యకు కడియం ధన్యవాదాలు తెలిపారు. -
కేసీఆర్ గీసిన గీత దాటను
స్టేషన్‌ఘన్‌పూర్: బీఆర్ఎస్ పార్టీలో చేరినప్పటినుంచి ఇప్పటివరకు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌కు వీర విధేయుడిగా ఉన్నానని, ఆయన గీసిన గీత దాటేది లేదని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. రాజయ్యకు టికెట్ రాని నేపథ్యంలో జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి ఆయన వర్గీయులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మంగళవారం పెద్ద ఎత్తున తరలివచ్చారు. వారిని చూసిన రాజయ్య భావోద్వేగానికి గురై బోరున విలపించారు. దీంతో ఆయన వర్గీయులు కొందరు కంటతడి పెడుతూ రాజయ్యకు అనుకూలంగా నినాదాలు చేశారు. తర్వాత పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఎమ్మెల్యే కన్నీరుమున్నీరయ్యారు. ఒకదశలో క్యాంపు కార్యాలయంలో కిందపడి, మోకరిల్లి విలపించారు. దీంతో పక్క నే ఉన్న ఆయన భార్య, అభిమానులు, పార్టీ శ్రేణు లు కూడా ఏడుస్తూనే ఆయన్ను సముదాయించారు. ఆయన మాట్లాడుతూ ఘన్పూర్ టికెట్ విషయమై ఇటీవల పరిణామాలు ప్రజలకు తెలుసునని వ్యాఖ్యానించారు. తన స్థాయికి తగ్గకుండా సముచిత స్థానం కల్పిస్తానని సీఎం హామీ ఇచి్చనట్లు తెలి పారు. ప్రజల్లో ఉండటమే తనకు ఇష్టమని, నియో జకవర్గమే దేవాలయమని, అవసరమైతే ప్రాణాలు సైతం ఇస్తానన్నారు. అనంతరం బస్టాండ్ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహం వద్దకు వెళ్లి సాష్టాంగ నమస్కారం చేసి విలపించారు. ఎమ్మెల్యే సతీమణి ఫాతిమా తదితరులు వెంట ఉన్నారు. -
స్టేషన్ ఘన్‌పూర్‌లో ఉద్రిక్తత
స్టేషన్‌ఘన్‌పూర్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వచ్చే ఎన్నికల్లో స్టేషన్ ఘన్పూర్ టికెట్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరికే వస్తుందని విస్తృతంగా ప్రచారం కావడం, ఎమ్మెల్యే రాజయ్యపై కడియం వ్యాఖ్యలు చేయడంపై రాజయ్య అనుచరులు భగ్గుమన్నారు. శనివారం ఇక్కడ కడియం దిష్టిబోమ్మను ఎమ్మెల్యే అనుచరులు దహనం చేయనున్నారని పోలీసులు తెలుసుకొని అప్రమత్తమయ్యారు. జెడ్పీటీసీ మారపాక రవితోపాటు పలువురిని ఉదయం అరెస్టు చేశారు. ఘన్పూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఉన్న ఎమ్మెల్యే అనుచరులను, ప్రజాప్రతినిధులను ఏసీపీ శ్రీనివాస్‌రావు, సీఐ రాఘవేందర్, ఎస్ఐలు నాగరాజు, హరికృష్ణ ఆ«ధ్వర్యంలో పోలీసులు అరెస్టు చేసి స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఎమ్మెల్యే తమ్ముడు, ఘన్పూర్ సర్పంచ్ తాటికొండ సురేశ్‌కుమార్ గ్రామపంచాయతీ కార్యాలయం నుంచి బయటికి వెళ్లకుండా హౌస్అరెస్టు చేశారు. ఘన్‌పూర్‌లో అవినీతి పెరిగిందని, గోకుడు, గీకుడుగాళ్లు, భూకబ్జాదారులంటూ కడియం అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ మండలంలోని మీదికొండ క్రాస్‌రోడ్డు వద్ద జాతీయ రహదారిపై ఎమ్మెల్యే అనుచరులు ఆయన దిష్టిబోమ్మను దహనం చేశా రు. శ్రీహరి డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. -
Dalit Bandhu: ఎమ్మెల్యే తమ్ముడికి దళితబంధు
సాక్షి, స్టేషన్‌ఘన్‌పూర్: పేద దళితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన దళితబంధు పథకంలో లబ్ధిదారుడిగా జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య సోదరుడు, స్టేషన్‌ఘన్‌పూర్ సర్పంచ్ తాటికొండ సురేశ్ కుమార్ ఉండటంతో స్థానికంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈయనతో పాటుగా ఘన్పూర్ ఎంపీపీ భర్త, కొందరు ప్రజాప్రతినిధులున్నారు. మండలంలో పేదవారిని కాదని, ఆర్థికంగా ఉన్న వారికి, ఎమ్మెల్యే అనుచరులనే ఎంపిక చేశారని కాంగ్రెస్, బీజేపీ తదితర ప్రతిపక్షపార్టీల నాయకులు, యువకులు సోమవారం సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. కాగా, ఎమ్మెల్యేపై వస్తున్న విమర్శలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. చదవండి: (Hyderabad: రోడ్లపై వాహనాలను వదిలేస్తున్నారా.. అయితే ఇక కష్టమే..) -
కేశవాపూర్ కుదింపు!
సాక్షి, హైదరాబాద్:మేడ్చల్ జిల్లా శామీర్‌పేట్ సమీపంలో చేపట్టదలిచిన కేశవాపూర్ రిజర్వాయర్ సామర్థ్యాన్ని కుదించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. రిజర్వాయర్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ అంశంలో చిక్కు ముళ్లు కొలిక్కి వచ్చే అవకాశాలు సన్నగిల్లిన నేపథ్యంలో దీని సామర్థ్యాన్ని సగానికి తగ్గించాలని భావిస్తోంది. ప్రస్తుతం 10 టీఎంసీల సామర్థ్యంతో దీనికి ఇప్పటికే పరిపాలనా అనుమతులు ఇవ్వగా, తాజాగా 5.04 టీఎంసీలకే దీన్ని పరిమితం చేసేలా వ్యాప్కోస్ సంస్థతో సర్వే చేయించింది. 5 టీఎంసీలతో రిజర్వాయర్ నిర్మాణం చేపడితే దాని నిర్మాణానికి రూ.3,363 కోట్ల మేర వ్యయం అవుతుందని వ్యాప్కోస్ నీటిపారుదల శాఖకు, మున్సిపల్ శాఖకు నివేదించింది. భూసేకరణ జాప్యంతోనే.. కాళేశ్వరం ఎత్తిపోతలలో భాగంగా ఉన్న కొండపోచమ్మ సాగర్ నుంచి గోదావరి జలాలను గ్రావిటీ ద్వారా తరలించి హైదరాబాద్ తాగునీటి అవసరాలను చేపట్టేలా కేశవాపూర్ రిజర్వాయర్‌ను 10 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టాలని నిర్ణయిం చారు. రిజర్వాయర్ నిర్మాణానికి 13 కి.మీ. కట్ట నిర్మాణం చేయాల్సి ఉంటుందని తేల్చగా, కొండపోచమ్మ సాగర్ మీదుగా కేశవాపూర్ రిజర్వాయర్‌కు మూడు 3,600 ఎంఎం డయా గ్రావిటీ పైప్ లైన్ల ద్వారా నీటిని తరలించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. రిజర్వాయర్ నుంచి వచ్చే రా వాటర్‌ను ఘణపూర్‌లో నీటి శుద్ధి కేంద్రంలో (డబ్ల్యూటీపీ) శుద్ధి చేసి శామీర్‌పేట్, సైనిక్‌పురి మీదుగా ఉన్న గోదావరి రింగ్ మెయిన్ పైప్ లైన్లకు స్వచ్ఛమైన జలాలను పంపింగ్ చేయాల్సి ఉంటుంది. కేశవాపూర్ రిజర్వాయర్ నిర్మాణానికి 3,822 ఎకరాల భూమి అవసరం ఉండగా, మొత్తంగా రూ.4,777.59 కోట్లతో పరిపాలనా అనుమతులు ఇచ్చారు. భూసేకరణ, పరిహారం చెల్లింపునకు రూ.518.7 కోట్ల అంచనా వ్యయం అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఇవి పోనూ రిజర్వాయర్ పనులకు రూ.3,918 కోట్లతో టెండర్ల ప్రక్రియ సైతం పూర్తికాగా, పనులు మాత్రం మొదలు కాలేదు. ఈ పనులు చేపట్టేందుకు బొంరాస్‌పేట, పొన్నాల గ్రామాల్లో భూసేకరణ చేయాల్సి ఉంది. ఇక్కడి రైతులు భూసేకరణకు సహకరించడం లేదు. భూసేకరణ కోసం రెవెన్యూ అధికారులు సమావేశాలు నిర్వహించినా ముంపు గ్రామాల ప్రజల నుంచి అభ్యంతరాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై సమీక్షించిన ప్రభుత్వం 5 టీఎంసీలు కుదించి, దానికనుగుణంగా ప్రాజెక్టు నివేదికతతయారు చేసి ఇవ్వాలని వ్యాప్కోస్ను ఆదేశించింది. దీనిపై కసరత్తు చేసి న వ్యాప్కోస్ ప్రభుత్వ భూమి 918.84 ఎకరాల మేర అటవీ భూమి ప్రాం తంలోనే నిర్మాణం చేసేలా 5.04 టీఎంసీలతో కేశవాపూర్‌ను నిర్మించే అవకాశం ఉందని తేల్చింది. రూ.3,363 కోట్లు అవసరం.. రా వాటర్ తరలించేందుకు ఏర్పాటు చేయనున్న రెండు వరుసల ప్రధాన పైప్ లైన్ పొడవు గతంలో 18.2 కి.మీ. ఉండగా, ప్రస్తుతం దాన్ని ఒకటే వరుసలో 34.85 కి.మీ.లకు ప్రతిపాదించింది. దీనికి మొత్తంగా రూ.3,363 కోట్లు అవుతుందని లెక్కగట్టింది. ఇందులో భూసేకరణ అవసరాలకు రూ.75 కోట్లు అవసరం ఉంటుందని తేల్చింది. దీంతో పాటే కొండపోచమ్మ సాగర్ నుంచి 10 టీఎంసీల నీటిని శుద్ధి చేసేందుకు డబ్ల్యూటీపీ నిర్మాణం చేయాల్సి ఉండగా, దానికి రూ.1,006 కోట్లు అంచనా కట్టింది. ఇందులో పైప్ లైన్ నిర్మాణానికే రూ.385 కోట్లు ఖర్చవుతుందని లెక్కగట్టింది. -
ఘనపూర్ ప్రాజెక్ట్ మారని రూపురేఖలు
మెతుకుసీమ జీవన వాహిని.. జిల్లాలో ఉన్న ఏకైక మధ్య తరహా సాగు నీటి ప్రాజెక్ట్ ఘనపూర్. ఎన్నో ఏళ్లుగా జిల్లాలోని సుమారు 21,625 ఎకరాలను సస్యశ్యామలం చేస్తూ.. రైతుల కల్పతరువుగా మారిన ఈ ఆనకట్ట కీర్తి అంతా ఇంతా కాదు. ప్రస్తుతం చుక్క నీరు లేని ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఆనకట్ట ఎత్తు పనులు భూసేకరణలో అవరోధాలతో నిలిచిపోయాయి. దీని పరిధిలోని రెండు కాల్వలకు సంబంధించి సిమెంట్ లైనింగ్ పనులు 2005లో మొదలు కాగా.. ఇప్పటివరకు పూర్తి కాలేదు. సాక్షి, మెదక్: జిల్లా రైతాంగానికి పెద్దదిక్కుగా నిలుస్తోన్న ఘనపురం ప్రాజెక్ట్ అభివృద్ధి పనులు ఏళ్లకేళ్లుగా కొనసా.. గుతూనే ఉన్నాయి. ప్రస్తు తం చుక్క నీరు లేని పరిస్థితుల్లో మంజీర పరవళ్ల కోసం ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి అభివృద్ధి పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి. సుమారు 14 సంవత్సరాలుగా ఆయకట్టు రైతులను వెక్కిరిస్తూనే ఉన్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్‌పై దృష్టిసారించింది. నిధులు సైతం కేటాయించినప్పటికీ.. ఆశించినంత అభివృద్ధి జరగడం లేదని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయకట్టు విస్తీర్ణం 21,625 ఎకరాలు మంజీరా నదిపై కొల్చారం–పాపన్నపేట మం డలాల మధ్య ఏడుపాయల ప్రాంతంలో 1905 లో ఘనపూర్ మధ్య తరహా ప్రాజెక్టును నిర్మించారు. ఆనకట్ట పొడవు 2,337 అడుగులు కాగా.. నీటి నిల్వ సామర్థ్యం 0.2 టీఎంసీలు. దీని పరిధిలో రెండు కాల్వలు (మహబూబ్‌నహర్, ఫతేనహర్) ఉండగా.. ఆయకట్టు విస్తీర్ణం 21,625 ఎకరాలు. మహబూబ్‌నహర్ (ఎంఎన్) కెనాల్ పొడవు 42.80 కిలోమీటర్లు కాగా.. దీని ద్వారా కొల్చారం, మెదక్, హవేళిఘనపూర్ మండలాల పరిధిలోని 18 గ్రామాల్లో 11,425 ఎకరాలకు సాగు నీరు అందుతోంది. ఫతేనహర్ (ఎఫ్ఎన్) కెనాల్ పొడవు 12.80 కి.మీ కాగా.. పాపన్నపేట మండలంలోని 11 గ్రామా ల్లో 10,200 ఎకరాలకు సాగునీరు అందుతోంది. ‘తెలంగాణ’లో నిధుల వరద ఘనపూర్ కాల్వల ఆధునికీకరణ కోసం 2005లో అప్పటి ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జైకా పథకం కింద రూ.25 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులు వినియోగించకపోవడంతో వెనక్కిమళ్లాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ ఈ ప్రాజెక్ట్ అభివృద్ధిపై దృష్టి సారించారు. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన స్వయంగా 2014 డిసెంబర్ 17న ఘనపూర్ ప్రాజెక్ట్ బాట పట్టారు. సందర్శించిన సమయంలోనే ప్రాజెక్ట్ అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. మెదక్, నర్సాపూర్ ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి కృషి, అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సహకారంతో వెనక్కి మళ్లిన జైకా నిధులు తిరిగివచ్చాయి. సీఎం హామీ మేరకు ఓసారి రూ.21.64 కోట్లు, ఆ తర్వాత రూ.43.64 కోట్లతోపాటు మరో రూ.1.64 కోట్లు మంజూరయ్యాయి. కాల్వల ఆధునికీకరణ, గేట్ల మరమ్మతులు, ఆనకట్ట ఎత్తు పెంపు, భూసేకరణకు ఈ నిధులు మంజూరయ్యాయి. తాజాగా ఇటీవల బడ్జెట్లో ఘనపూర్ ప్రాజెక్ట్‌కు రూ.34 కోట్లు కేటాయించారు. సా..గుతున్న పనులు మహబూబ్‌నహర్, ఫతేనహర్ కెనాల్ ఆధునికీకరణలో భాగంగా సిమెంట్ లైనింగ్ పనులు చివరి వరకు కాలేదు. ఫతేనహర్ కెనాల్ పొడవు 12.80 కిలో మీటర్లు కాగా.. దౌలాపూర్ వరకు.. మహబూబ్‌నహర్ కాల్వ పొడవు 42.80 కిలోమీటర్లు కాగా మత్తాయిపల్లి వరకు (32 కి.మీలు) మాత్రమే సిమెంట్ లైనింగ్ పనులు పూర్తయ్యాయి. మహబూబ్‌నహర్ కెనాల్ కింద శాలిపేట నుంచి జక్కన్నపేట వరకు.. ఫతేనహర్ కెనాల్ కింద 11 కి.మీల మేర పాపన్నపేట వరకు బ్రాంచ్ కాల్వ పనులు, గైడ్ వాల్ నిర్మించాల్సి ఉంది. ఫతేనహర్ కెనాల్ కింద గాంధారిపల్లి, జయపురం, లక్ష్మీనగర్, అబలపూర్, అన్నారం, యూసుఫ్పేట్, కుర్తివాడ, మిన్పూర్, పాపన్నపేట, నాగ్సానిపల్లి, పొడిచంపల్లిలో సీసీ లైనింగ్ పనులు పూర్తి కాలేదు. ఇలా ఏళ్లకేళ్లుగా పనులు కొనసాగుతుండగా.. మొదట చేసినవి శిథిలావస్థకు చేరాయి. దీంతో చివరి ఆయకట్టుకు నీరందని పరిస్థితి నెలకొంది. భూసేకరణలో అవరోధాలు ఆనకట్ట ఎత్తు పెంపునకు సంబంధించి ఒక్క అడుగూ ముందుకు పడలేదు. పలు ప్రాంతాల్లో భూసేకరణలో ఇబ్బందులు తలెత్తడంతో ఈ పరిస్థితి నెలకొన్నట్లు సమాచారం. గత బడ్జెట్లో మంజూరైన వాటిలో సుమారు రూ.13 కోట్లు భూసేకరణకు కేటాయించగా.. అవి అలానే ఉన్నట్లు సమచారం. మొత్తం 290 ఎకరాల భూమి అవసరం కాగా.. ఇప్పటివరకు 230 ఎకరాలను క్లియర్ చేసినట్లు అధికారిక సమాచారం. 60 ఎకరాలకు సంబంధించి ఆర్డీఓ తదితరులు రైతులతో సమావేశం ఏర్పాటు చేసి ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. చిన్న ఘనపూర్, సంగాయిపల్లితోపాటు పలు గ్రామాలకు చెందిన రైతులు భూములు ఇచ్చేందుకు నిరాసక్తత ప్రదర్శిస్తున్నట్లు తెలిసింది. తాజాగా ఈ బడ్జెట్లో భూసేకరణకు నిధులు కేటాయించడంతో ఈ సమస్య పరిష్కారమైనట్లేనని అధికారులు భావిస్తున్నారు. చుక్క నీరు లేదు.. ప్రస్తుతం ఘనపురం ప్రాజెక్ట్‌లో చుక్క నీరు లేదు. మంజీర నది ప్రవాహం లేకపోవడం.. సింగూరు ప్రాజెక్ట్‌లో నీటి నిల్వ ఉంచకపోవడంతో ఈ దుస్థితి దాపురించింది. గత ఏడాది సింగూరు నుంచి 15 టీఎంసీల నీళ్లను ఎస్సారెస్పీ కెనాల్ ద్వారా నిజామాబాద్ జిల్లా అవసరాలకు తరలించడంతో ప్రస్తుతం ఎకరా కూడా సాగు చేయని దుస్థితి నెలకొందని స్థానిక రైతులు వాపోతున్నారు. ఆ నీళ్లు ఉంటే కనీసం ఒక్క పంటయినా వెళ్లేదని గోడు వెళ్లబోసుకుంటున్నారు. భూసేకరణ కొనసాగుతోంది.. ఘనపూర్ ప్రాజెక్ట్ సామర్థ్యం 0.2 టీఎంసీలు. పూడిక పేరుకుపోవడంతో సామర్థ్యం 0.135కి తగ్గింది. మిషన్ కాకతీయలో పలు చోట్ల పూడిక తీశాం. ప్రస్తుతం భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రాజెక్ట్ ఎత్తు పెరిగితే నీటి నిల్వ సామర్థ్యం 0.3 టీఎంసీలకు చేరుకుంటుంది. మరో సుమారు ఆరు వేల ఎకరాల వరకు నీరందుతుంది. ఒక్కసారి నిండితే ఆయకట్టు రైతులు సులువుగా రెండు పంటలు తీయొచ్చు. ప్రభుత్వం తాజాగా బడ్జెట్లో కేయించిన నిధులను భూసేకరణ, గేట్ల బిగింపు, ఇతర ఆధునికీకరణ పనులకు వినియోగిస్తాం. – ఏసయ్య, నీటి పారుదల శాఖ ఈఈ -
చేపల వలలో మొసలి..
కొల్పారం (మెదక్) : చేపల వేటకు వెళ్లిన జాలర్లు చేపల కోసం వల వేస్తే.. అందులో మొసలి ప్రత్యక్షమైన సంఘటన మెదక్ జిల్లా కొల్పారం మండలం ఘన్‌పూర్‌లో మంగళవారం వెలుగుచూసింది. స్థానిక ఆనకట్టలో చేపలు పడుతున్న జాలర్లు వలలో చిక్కిన మొసలిని గుర్తించి అటవీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న అధికారులు మొసలిని మంజీరా అభయారణ్యానికి తరలించారు. -
అన్నదాత ఆత్మహత్య
ఘనపురం (మహబూబ్‌నగర్) : అప్పుల బాధ భరించలేక ఓ రైతు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా ఘనపురం మండలం రుక్కన్నపల్లి పంచాయతి పరిధిలోని ముందరితండాలో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన లక్ష్మణ్ నాయక్(38) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పు ఎక్కువైపోయింది. అప్పు తీర్చే దారి కానరాక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. -
మత్తు మందు చల్లి.. మహిళ కిడ్నాప్
వరంగల్‌లో ఎత్తుకెళ్లి.. ఘన్‌పూర్‌లో వదిలేసిన దుండగులు నాలుగు తులాల బంగారు గొలుసు అపహరణ స్టేషన్‌ఘన్‌పూర్ టౌన్ : మహిళ ముఖంపై మత్తు మందు ఉన్న ఖర్చీఫ్ పెట్టి.. ఆమె మెడలోని నాలుగు తులాల బంగారు గొలుసును గుర్తుతెలియని వ్యక్తు లు అపహరించిన సంఘటన వరంగల్ బస్‌స్టేషన్‌లో శుక్రవారం జరిగింది. బాధిత మహిళ కథనం ప్రకా రం.. కొడకండ్ల మండలం గంట్లకుంటకు చెందిన జూలూరి దివ్య, గణేష్ దంపతులు సొంత పనుల నిమిత్తం శుక్రవారం వరంగల్ వెళ్లారు. తొర్రూరులో ఫంక్షన్‌కు వెళ్లేందుకు వరంగల్ ఎంజీఎం వద్ద ఆర్టీసీ బస్సు ఎక్కారు. బస్సు వరంగల్ బస్టాండ్‌లోకి చేరుకున్న తర్వాత టాయిలెట్‌కు వెళ్లేందుకు దివ్య బస్టాండ్‌లోని మూత్రశాలల వైపు వెళ్లింది. అయితే అక్కడ ముసుగు ధరించి ఉన్న మహిళ తన ముఖంపై మత్తు మందు ఉన్న ఖర్చీఫ్‌ను పెట్టిందని, తర్వాత తనకు స్పృహ లేదని, తీరా కళ్లు తెరిచి చూస్తే ఇక్కడ ఉన్నానని చెప్పింది. ఇక్కడి వారిని ఏఊరని అడిగితే స్టేషన్‌ఘన్‌పూర్‌లో బుడిగజంగాల కాలనీ సమీపాన ఉన్నట్లు తెలిసిందన్నారు. తన మెడలో ఉన్న బంగారు పుస్తెలతాడు, పుస్తెలు, గుండ్లు మొత్తం నాలుగు తులాల బంగారాన్ని అపహరించారని ఆమె రోదిస్తూ తెలిపింది. ఈ సందర్భంగా ఆమె భర్త గణేష్ మాట్లాడుతూ తన భార్య ఎంతకూ రాకపోవడంతో మూత్రశాల వైపు వెళ్లి వెతికానని, జాడ తెలియకపోవడంతో ఆమెకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తలేదన్నారు. గంట తర్వాత ఫోన్ లిఫ్ట్ చేసిందని, అప్పటికే ఆమె ఘన్‌పూర్‌లో ఉన్నట్లు తెలిసిందన్నారు. మత్తు నుంచి ఇంకా పూర్తిగా కోలుకోని ఆమెకు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేయించారు. అనంతరం బాధిత దంపతులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండే వరంగల్ బస్‌స్టేషన్‌లో తనను కిడ్నాప్ చేశారని బాధితురాలు చెప్పడం అనుమానాలకు తావిస్తోంది. ఈ విషయమై పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు.