ఘనపురం (మహబూబ్‌నగర్) : అప్పుల బాధ భరించలేక ఓ రైతు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా ఘనపురం మండలం రుక్కన్నపల్లి పంచాయతి పరిధిలోని ముందరితండాలో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన లక్ష్మణ్ నాయక్(38) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పు ఎక్కువైపోయింది. అప్పు తీర్చే దారి కానరాక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.