
బాబూ.. బాధితులను పరామర్శించరా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు పోలవరం ముంపునకు గురై అష్టకష్టాలు అనుభవిస్తున్న తెలుగు ప్రజలను పరామర్శించే తీరిక లేదా? అని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మాజీఎంపీ రాజయ్య ప్రశ్నించారు.
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు పోలవరం ముంపునకు గురై అష్టకష్టాలు అనుభవిస్తున్న తెలుగు ప్రజలను పరామర్శించే తీరిక లేదా? అని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మాజీఎంపీ రాజయ్య ప్రశ్నించారు.అయితే ఛత్తీస్‌గఢ్‌లో పర్యటించే తీరిక ఆయనకు ఎలా లభించిందని నిలదీశారు. గురువారం సచివాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. శుక్రవారం జరిగే హైపవర్ కమిటీ సమావేశంలో పోలవరం డిజైన్ మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ల లబ్ధి కోసమే డిజైన్ మార్చడం లేదన్నారు.