వరంగల్ : వరంగల్లో కాళోజీ హెల్త్ యూనివర్శిటీపై డిప్యూటీ సీఎం రాజయ్య శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెల్త్ యూనివర్శిటీ రాకతో వరంగల్ దశా-దిశ మారబోతోందన్నారు. హైదరాబాద్కు ధీటుగా వరంగల్ అభివృద్ధి చెందబోతుందని రాజయ్య తెలిపారు. ఈ నిర్ణయం తీసుకున్న కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీకి రుణపడి ఉంటామని ఆయన అన్నారు. కాగా కాళోజీ హెల్త్ యూనివర్శిటీ వైస్ ఛాన్సులర్గా సురేష్ చంద్ర నియమితులయ్యారు. ఆయన శనివారం బాధ్యతలు చేపట్టనున్నారు.
కాగా వరంగల్ జిల్లాలో కాళోజీ పేరుతో ఆరోగ్య వర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్టు తెలంగాణ సీఎం కార్యాలయం గురువారం రాత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. కాకతీయ వర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసే ఈ సంస్థకు ప్రముఖ కవి కాళోజీ నారాయణరావు పేరును సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. 'కాళోజీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సెన్సైస్' ను వరంగల్‌కు మంజూరు చేస్తున్నట్టు సీఎం కార్యాలయం ఈమేరకు ఒక సంక్షిప్త సందేశం ద్వారా వెల్లడించింది.
హైదరాబాద్కు ధీటుగా వరంగల్ అభివృద్ధి
Published Fri, Sep 26 2014 2:11 PM | Last Updated on Tue, Oct 30 2018 7:57 PM
Advertisement