
అంబేడ్కర్ విగ్రహంపై దాడి యత్నంపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు
కొవ్వొత్తులతో ప్రదర్శనలు చేసిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు
సాక్షి, నెట్‌వర్క్: విజయవాడ నగరం నడిబొడ్డున అంబేడ్కర్ స్మృతివనంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి జరిగిన ప్రయత్నాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు నిరసించారు. వైఎస్సార్‌సీపీ పిలుపు మేరకు శనివారం రాత్రి కొవ్వొత్తులతో ప్రదర్శనలు చేశారు. రాజ్యాంగ నిర్మాత విగ్రహం జోలికి వస్తే సహించబోమని నినదించారు.
వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద కొవ్వొత్తులతో భారీ నిరసన కార్యక్రమం జరిగింది. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, ప్రజలు కొవ్వొత్తులతో ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మేరుగు నాగార్జున, వైఎస్సార్‌సీపీ విజయవాడ నగర అధ్యక్షుడు మల్లాది విష్ణు పాల్గొన్నారు.
» గుంటూరు నగరంలో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరిఫాతిమా తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి దద్దాల నారాయణ యాదవ్ ఆధ్వర్యంలో రాస్తారోకో, కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. యర్రగొండపాలెంలో జరిగిన నిరసనలో జెడ్పీటీసీ చేదూరి విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరులో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, జెడ్పీటీసీ తెనాలి నిర్మలమ్మ తదితరులు పాల్గొన్నారు.
» అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ఎమ్మార్పీఎస్ నాయకులు రాస్తారోకో చేసి, మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. శ్రీసత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలో వైఎస్సార్‌సీపీ నేత ఈర లక్కప్ప ఆధ్వర్యంలో, హిందూపురంలో పార్టీ నేత దీపిక ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. కర్నూలులో మాజీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ తదితరుల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది. కల్లూరులో జరిగిన నిరసనలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
» విశాఖ నగరంలో వైఎస్సార్‌సీపీ విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె.కె. రాజు ఆధ్వర్యంలో, అనకాపల్లిలో పార్టీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు ఆధ్వర్యంలో, అడ్డరోడ్డు కూడలిలో మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ప్రదర్శన చేశారు.
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, ఇచ్ఛాపురంలో ఎమ్మెల్సీ నర్తు రామారావు, రణస్థలంలో పార్టీ జిల్లా కార్యదర్శి పిన్నింటి సాయికుమార్, పాతపట్నంలో స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకుల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీలు చేశారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో జరిగిన కొవొత్తుల ప్రదర్శనలో పార్టీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి పాల్గొన్నారు.
» చిత్తూరులో నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో వైఎస్సార్‌సీపీ జిల్లా మహిళా విభాగం మాజీ అధ్యక్షురాలు గాయత్రీదేవి, ఇతర నాయకులు పాల్గొన్నారు. వైఎస్సార్ జిల్లాలో కడపలో జరిగిన కొవ్వొత్తుల ర్యాలీలో మాజీ ఉప ముఖ్యమంత్రి ఎస్‌బి అంజద్‌బాషా, కడప మేయర్ కె. సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. కమలాపురంలో వైఎస్సార్‌సీపీ నాయకుడు, నవ్యాంధ్ర మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు శరత్‌బాబు ఆధ్వర్యంలో, అన్నమయ్య జిల్లా రాజంపేటలో డీసీఎంఎస్ మాజీ చైర్మన్ దండుగోపి తదితరుల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శనలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment