సాక్షి, అమరావతి: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో చేరేందుకు విద్యార్థులు పోటీపడుతున్నారు. ఐదవ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం అడ్మిషన్ల కోసం వచ్చిన దరఖాస్తులు ఇందుకు అద్దంపడుతున్నాయి. దరఖాస్తులకు గురువారం ఆఖరి తేదీ కావడంతో తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు ఏప్రిల్ 8 వరకు ఆ గడువు పెంచుతున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడు వెల్లడించారు.
2022–23 విద్యా సంవత్సరానికి ఐదవ తరగతిలో 14,940 సీట్లు ఉండగా.. 53,946 మంది దరఖాస్తు చేశారని చంద్రుడు తెలిపారు. అలాగే, జూనియర్ ఇంటర్‌లో 13,560 సీట్లకు 34 వేల దరఖాస్తులు వచ్చాయన్నారు. ఐదో తరగతికి అత్యధికంగా కర్నూలు, అనంతపూరం, విశాఖపట్నం జిల్లాల నుంచి.. ఇంటర్ ఫస్టియర్ కోసం కర్నూలు, అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి అత్యధికంగా దరఖాస్తులు వచ్చినట్లు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విద్యారంగంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుండడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వీటిపై ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారన్నారు.
అంబేడ్కర్ గురుకులాలకు యమా డిమాండ్
Published Fri, Apr 1 2022 4:28 AM | Last Updated on Fri, Apr 1 2022 10:35 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment