వచ్చే ఏడాది అంబేడ్కర్ భారీ విగ్రహ ఆవిష్కరణ
డిప్యూటీ సీఎం కడియం,
మంత్రి జగదీశ్‌రెడ్డి వెల్లడి
హైదరాబాద్: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 14వ తేదీ నాటికి ఆవిష్కరించేందుకు ప్రణాళిక రూపొందిం చామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి తెలిపారు. అంబేడ్కర్ 125 వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని హైదరాబా ద్‌లోని ఐమాక్స్ నెక్లెస్ రోడ్డు వద్ద 125 అడుగుల అంబేడ్కర్ భారీ కాంస్య విగ్రహా న్ని ఏర్పాటు చేసేందుకు ప్రతిష్టాçపన కమిటీ వేసినట్లు వారు పేర్కొన్నారు.
గురువారం ఇక్కడ మాసబ్ ట్యాంక్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కి టెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (జేఎన్‌ఏఎఫ్‌ఏయూ) ప్రాంగణంలోని నెహ్రూ ఆర్ట్ గ్యాలరీలో ప్రముఖ శిల్పకళాకారులు మలిచిన అంబేడ్కర్ విగ్రహ నమూనాలను కడియం, జగదీశ్‌రెడ్డిలు పరిశీలించారు. శ్రీహరి మాట్లాడుతూ ఈ ఏడాది అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. విగ్రహ ప్రతిష్టాపన చేయబోయే ప్రాంతంలోని మట్టిని పరీక్షించడంతోపాటు విగ్రహ నమూనా రూపకల్పనకు కన్సల్టెంట్‌ను నియమించనున్నట్లు చెప్పారు.
నోడల్ ఏజెన్సీగా ఆర్ అండ్ బి శాఖ వ్యవహరిస్తుం దని, ప్రాజెక్ట్ వర్క్‌ను రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్‌మిశ్రా సమన్వయం చేస్తారని తెలిపారు. విగ్రహ ప్రతిష్ఠాపన పనుల ప్రాజెక్టు డైరెక్టర్‌గా ఆర్ అండ్ బి చీఫ్ ఇంజనీర్ గణపతిని నియమించినట్లు చెప్పారు.