డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయూలని వైఎస్‌ఆర్‌సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి,
ముదిగొండ : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయూలని వైఎస్‌ఆర్‌సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మధిర ఎమ్మెల్యే, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క పిలుపునిచ్చారు. అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో బాణాపురంలో ఏర్పాటు చేసిన బాబాసాహెబ్ విగ్రహాన్ని భట్టి ఆవిష్కరించారు. ఎంపీ పూలదండ వేసి నివాళి అర్పించారు. అనంతరం శీలం శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సభలో ఎంపీ మాట్లాడారు. నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అంబేద్కర్ కలలను నిజం చేశారన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వాలు మాటలకే పరిమితమయ్యూయన్నారు.
అవమానాలు, అసమానతలు లేని సమాజాన్ని నిర్మించడానికి అంబేద్కర్ బాటలో నడవాలని సూచించారు. దళితులు, గిరిజనులకు అంబేద్కర్‌ను పరిమితం చేసి చూడవద్దు అని భట్టి విక్రమార్క కోరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ పోరిక బలరాంనాయక్, జడ్పీటీసీ మందరపు నాగేశ్వరరావు, సర్పంచ్ వేముల రాజకుమారి, ఉపసర్పంచ్ పండ్రకోల రాంబాబు, అంబేద్కర్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లింగాల రవికుమార్, సీపీఎం జిల్లా నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు, వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి షర్మిలా సంపత్, పాలేరు డివిజన్ అధ్యక్షుడు సాధు రమేష్‌రెడ్డి, మండల అధ్యక్షుడు దేవరపల్లి అనంతరెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు మోర్తాల నాగార్జునరెడ్డి, మరికంటి గురుమూర్తి, పోట్ల బాబు, లంకెల బ్రహ్మారెడ్డి,ఆవుల ప్రమీల, మరికంటి సత్యనారాయణ, కృష్ట, ఇస్మాయిల్ పాల్గొన్నారు.