ఉమ్మడి పశ్చిమ గోదావరిలో పెద్ద ఎత్తున నిరసనలు
అంబేడ్కర్ విగ్రహాలకు క్షీరాభిషేకాలు
ఎమ్మెల్యేపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదులు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం ఏలూరుపాడు గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు అవమానించడంపై దళిత సంఘాలు భగ్గుమన్నాయి. దళితులను దుర్భాషలాడుతూ అంబేడ్కర్ ఫ్లెక్సీని చించివేయడంపై తీవ్రంగా స్పందించాయి.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లావ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన తెలిపాయి. తక్షణమే ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశాయి. ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్ చేశాయి.
పెద్ద ఎత్తున నిరసనలు
» ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల నుంచి పెద్ద ఎత్తున దళిత నాయకులు ఆదివారం ఏలూరుపాడుకు చేరుకుని రా్రïÙ్టయ రహదారిపై ధర్నా నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిõÙకం చేశారు. రఘురామకృష్ణరాజుపై 24 గంటల్లో అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్, దళిత నాయకులు చీకటిపల్లి మంగరాజు, పెండ్ర వీరన్న, సుధామ, నల్లి రాజే‹Ù, గుమ్మాపు వరప్రసాద్, తాళ్లూరి మధు తదితరులు ఏలూరుపాడు గ్రామాన్ని సందర్శించి దళిత నాయకులకు సంఘీభావం తెలిపారు. మాజీ ఎంపీ హర్షకుమార్ ఆదివారం సాయత్రం భీమవరం అంబేడ్కర్ సెంటర్‌లో ధర్నా నిర్వహించారు.
» ఏపీ బహుజన జేఏసీ, జై భీమ్ సేవాదళ్ ఆధ్వర్యాన భీమవరం పట్టణంలోని అంబేడ్కర్ సెంటర్‌లో ధర్నా నిర్వహించారు. జాతులు, కులాల మధ్య గొడవలు సృష్టించే విధంగా ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ప్రవర్తించారని దళిత నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
» తణుకు మున్సిపల్ కార్యాలయం వద్ద అంబేడ్కర్ విగ్రహం ఎదుట సామాజిక న్యాయ పోరాట సమితి, జై భీమ్ యువజన సంఘం, సమత యువజన సంఘం, తణుకు అడ్వొకేట్స్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అంబేడ్కర్‌ను అవమానించి ప్రజల మధ్య చిచ్చుపెడుతున్న ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు, కాకినాడలో దళిత డాక్టర్ ఉమామహేశ్వరరావుపై దాడికి పాల్పడిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీలపై చట్టపరమైన చర్యలు తీసుకుని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయాలని ఆయా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. తణుకు పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా, నరేంద్ర సెంటర్‌లలో రాస్తారోకో, ర్యాలీ నిర్వహించారు.
» చింతలపూడి నియోజకవర్గంలోని కామవరపుకోటలో దళిత సంఘాలు ఆందోళన నిర్వహించాయి. వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త కంభం విజయరాజు మద్దతు తెలిపారు.
» నూజివీడులో మాల యోధుల సంక్షేమ సంఘం ఆధ్వర్యాన నిరసన తెలిపారు. రఘురామకృష్ణరాజుపై నూజివీడు టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
బహిరంగ క్షమాపణ చెప్పాలి
ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు కుల, మత ఘర్షణలు రెచ్చగొట్టేలా ప్రవర్తించడం సరికాదు. ఏలూరుపాడులో ఆయన స్వయంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఫ్లెక్సీని తొలగించడం దారుణం. ఇప్పటికైనా నియోజకవర్గ ప్రజలకు, అంబేడ్కర్ వాదులు అందరికీ ఆయన క్షమాపణ చెప్పాలి. –పెండ్ర వీరన్న, మాజీ ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్
బాబు పాలనలో దళితులపై దాడులు
చంద్రబాబు ప్రభుత్వంలో దళితులపై దాడులు సర్వసాధారణం. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన రఘురామకృష్ణరాజు ఏకంగా రాజ్యాంగ నిర్మాతనే అవమానించడంపై గవర్నర్ జోక్యం చేసుకుని ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించాలి. కాకినాడలో డాక్టర్ ఉమామహేశ్వరరావుపై ఎమ్మెల్యే నానాజీ దాడి చేయడం సిగ్గుచేటు. ఇద్దరు ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు తీసుకోవాలి. – నల్లి రాజే‹Ù, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు
అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి. అంబేడ్కర్ ఫ్లెక్సీని తొలగించిన రఘురామకృష్ణరాజు ఇప్పటికైనా తన తీరు మార్చుకుని అంబేడ్కర్‌కు క్షమాపణ చెప్పాలి. లేకపోతే దళితులంతా ఆయనకు తప్పకుండా తగిన గుణపాఠం చెబుతారు. – కాకిలేటి ఆనందకుమార్ (మధు), వైఎస్సార్‌సీపీ జిల్లా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి
కులాల మధ్య చిచ్చుకే..
ఏలూరుపాడులో ప్రపంచ మేధావి అంబేడ్కర్ ఫ్లెక్సీని ఎమ్మెల్యే ఓ చదువుకోలేని అనామకుడిలా ప్రవర్తించి ఫ్లెక్సీలు చించివేయడం దారుణం. దళితుల పట్ల చంద్రబాబు ప్రభుత్వానికి గౌరవం లేదు. ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు కులాల మధ్య చిచ్చుపెట్టి హీరో అవ్వాలని దురుద్దేశంతో ఫ్లెక్సీని చించి అంబేడ్కర్‌ని అవమానించారు. – గుమ్మాపు సూర్య వరప్రసాద్, రాష్ట్ర అధ్యక్షుడు, పీవీ రావు మాల మహానాడు
కుల, ధన అహంకారంతోనే..
ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు తన కుల, ధన అహంకారంతో రెచి్చపోయి అంబేడ్కర్ ఫొటో ఉన్న ఫ్లెక్సీని చించివేశారు. ఆ ఫ్లెక్సీ తొలగించే క్రమంలో ఆయన వాడిన భాష, బూతులు దారుణం. రఘురామకృష్ణరాజు శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసి ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. – పేరూరి మురళీకుమార్, సామాజిక న్యాయ పోరాట సమితి వ్యవస్థాపకుడు, తణుకు
జాతీయ ఎస్సీ కమిషన్ జోక్యం చేసుకోవాలి
నెహ్రూనగర్/గోపాలపట్నం: టీడీపీ ఎమ్మెల్యే రఘురామపై అనర్హత వేటు వేయాలని కోరుతూ గుంటూరు లాడ్జి సెంటర్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద దళిత నాయకులు నిరసన వ్యక్తంచేశారు. భీమ్ సేన సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లపు నీలాంబరం మాట్లాడుతూ అంబేడ్కర్ ఫ్లెక్సీని ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు చించివేయడం, దళితులను దుర్భాషలాడటం సిగ్గుచేటన్నారు.
ఈ విషయంలో జాతీయ ఎస్సీ కమిషన్ జోక్యం చేసుకుని రఘురామకృష్ణరాజుపై కఠిన చర్యలు తీసుకుని దళితుల మనోభావాలు కాపాడాలని కోరారు. అదేవిధంగా కాకినాడలో దళిత డాక్టర్ ఉమామహేశ్వరరావును దుర్భాషలాడటంతోపాటు, దాడి చేసిన జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
అనంతరం ఎమ్మెల్యేలు రఘురామకృష్ణరాజు, పంతం నానాజీలపై అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దళిత సంఘాల నాయకులు విద్యాసాగర్, చిన్నం డేవిడ్ విలియమ్స్, బత్తుల అనిల్, మనోజ్‌కుమార్, మస్తాన్‌రావు, మనోహర్, విజయరాజు, జోసెఫ్, శంకర్, కాంతారావు, కొండలరావు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలి
కాకినాడలో మెడికల్ కళాశాల ప్రొఫెసర్‌పై ఎమ్మెల్యే పంతం నానాజీ దాడి చేయడం, అంబేడ్కర్ ఫ్లెక్సీని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు చించివేయాన్ని ఖండిస్తూ విశాఖపట్నంలోని ఎన్‌ఏడీ కొత్త రోడ్డులో ఉన్న అంబేడ్కర్ విగ్రహం వద్ద ఎస్సీ వెల్ఫేర్ సంఘం సభ్యులు నిరసన తెలిపారు. పంతం నానాజీ, రఘురామకృష్ణరాజులను ఎమ్మెల్యే పదవులకు అనర్హులుగా ప్రకటించాలని దళిత నాయకులు డిమాండ్ చేశారు. ఎస్సీ వెల్ఫేర్ సంఘం సభ్యులు వెంకటేశ్వరరావు, ప్రసాద్, సోడదిశి సుధాకర్, అప్పారావు, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
వీధిరౌడీలా వ్యవహరించారు
రఘురామకృష్ణరాజు ప్రజాప్రతినిధిగా కాకుండా ఒక వీధిరౌడీలా వ్యవహరించారు. నిజంగా అక్కడ వారికి ఫ్లెక్సీ అడ్డుగా ఉంటే పోలీసు, రెవెన్యూ యంత్రాంగం ద్వారా ఎవరికీ ఇబ్బంది లేకుండా తీయించాలి. ఇందుకు విరుద్ధంగా ఎమ్మెల్యే బూతులు తిడుతూ ఆయనే తొలగించడం దారుణం. – గొల్లపల్లి అంబేడ్కర్ సీనియర్ న్యాయవాది, తణుకు
Comments
Please login to add a commentAdd a comment