సాక్షి, ఢిల్లీ: మార్గదర్శి కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఇంటరిమ్ అప్లికేషన్ దాఖలు చేశారు. అప్లికేషన్‌లో పలు అదనపు డాక్యుమెంట్లను జతచేశారు ఉండవల్లి.
అయితే, ఉండవల్లి అరుణ్‌కుమార్ తల్లి ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై హెచ్‌యూఎఫ్ పేరుతో రామోజీరావు సంతకం చేశారు. కాగా, తిరిగి చెల్లింపుల సమయంలో చెక్కుపై ప్రోపైటర్ పేరుతో సంతకం చేశారు. ఈ క్రమంలో కీలక పత్రాలను ఉండవల్లి.. సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇక, ఒక చోట హెచ్‌యూఎఫ్ పేరుతో, మరోచోట ప్రోపైటర్ పేరుతో రామోజీరావు డబుల్ రోల్ పోషించారు. ఇదిలా ఉండగా, హెచ్‌యూఎఫ్ ప్రకారం డిపాజిట్లు స్వీకరిస్తే ఆర్‌బీఐ నిబంధనలు పాటించాలి. ప్రోపైటరీ ప్రకారం డిపాజిట్లు సేకరిస్తే చిట్‌ఫండ్ చట్టాన్ని అనుసరించాలి. చట్టాలను పాటించకుండా ఇష్టానుసారం రామోజీ వ్యవహరించారని ఉండవల్లి పేర్కొన్నారు.
ఇక, తాజాగా ఉండవల్లి అరుణ్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. మార్గదర్శిపై ఎవరితోనైనా చర్చకు సిద్ధం. మార్గదర్శి అక్రమాలపై వచ్చే నెల 10 తర్వాత చర్చకు వస్తాను. రామోజీ సమక్షంలో టీడీపీ ప్రతినిధితో చర్చకు సిద్ధం. మార్గదర్శిని సపోర్ట్ చేస్తున్న టీడీపీతోనూ చర్చకు సిద్ధమన్నారు. మార్గదర్శి చేస్తున్నది తప్పు అని నేను చెప్పాను. చంద్రబాబు.. రామోజీని ఒప్పించి చర్చకు పాల్గొనేలా చేయాలి. టీడీపీ ఆఫీసులో చర్చ పెట్టినా నాకు అభ్యంతరం లేదు. రామోజీ సమక్షంలోనైనా నేను చర్చకు సిద్దమన్నారు. ఛాలెంజ్ చేసిన వాళ్లు చర్చకు వస్తే నేను సిద్ధం అని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment