సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: రామోజీరావుకి కోర్టుల్లో చాలా పలుకుబడి ఉందని, ఆయన అడ్వకేట్లు ఎలా కావాలనుకుంటే అలా చేయగలరంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘అపురూప కళాఖండాల విదేశాలకు తరలిస్తున్న కళాంజలి అని ఏబీకే ప్రసాద్ 1996లో రాశారు. భారత ప్రభుత్వం పెట్టిన కేసు గురించి రాస్తే ఏబీకేకి శిక్ష పడింది’’ అని ఉండవల్లి పేర్కొన్నారు.
‘‘చిట్‌ఫండ్ చందాదార్లకు నోటీసులు ఇవ్వమని కోర్టు చెప్పింది. ఏ కేసుకు సంబంధించిన అఫిడవిట్ లోనైనా మొదట ఆయన నడుపుతున్న పత్రికల ప్రస్తావన కచ్చితంగా ఉంటుంది. నర్మగర్భంగా రాయడం వారికి వెన్నతో పెట్టిన విద్య. ఏపీ చిట్‌ఫండ్ యాక్ట్ మార్గదర్శికి వర్తిస్తుందో వర్తించదో కచ్చితంగా తేల్చి చెప్పండి. ఉండవల్లిపై వేసిన డిఫర్ మెషన్ కేసులో రామోజీరావు ఎవరో తెలియదని రాజాజీ స్పష్టం చేశారు. మరో కేసులో రామోజీరావు తమ ఛైర్మన్ అని ఇదే రాజాజీ అఫిడవిట్ ఫైల్ చేశారు. మార్గదర్శి రూల్ వయలేషన్ చేసినా సరే తప్పు కాదని తేల్చేయండి. ఆంధ్రప్రదేశ్‌లో మార్గదర్శి ఆస్తులను అటాచ్ చేసినప్పుడు ప్రజల దగ్గర నుంచి తీసుకొన్న డబ్బు పూర్తిగా వాళ్ల దగ్గర ఉండాలి కానీ లేదు. న్యాయవ్యవస్థ తీరు మారాలి. ఎవరికి ఆన్సర్ బుల్‌గా ఉండటం లేదు’’ అంటూ ఉండవల్లి వ్యాఖ్యానించారు.
చదవండి: Fact Check: బురద రాతలే పునరావృతం
‘‘మార్గదర్శి వ్యవహారాల్లో నిజాలు బయటపెట్టాలంటే ప్రభుత్వం నాకు సహకరించాలి. ఎన్నికల దగ్గరికి వచ్చే కొద్ది ఈనాడులో నోటికి వచ్చినవన్ని రాస్తారు. రాజాజీ అనే వ్యక్తి పై కంటెమ్ట్ ఆఫ్ కోర్టు వేయరా.. హైదరాబాద్‌లో ఒక్క చిట్ ఫండ్ కూడా రూల్ ఫాలో కావటం లేదు. రాజు గురువుకు కోపం వస్తే పునాదులు కదులుతాయని చంద్రబాబుకు భయం. అందుకే అదిరెడ్డిని పరామర్శించేందుకు వచ్చి కూడా రామోజీ గురించి ఏమాత్రం ప్రస్తావించలేదు’’ అని ఉండవల్లి అరుణ్‌కుమార్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment