తూర్పుగోదావరి, సాక్షి: మార్గదర్శి కేసుపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి కనీస స్పందన లేదని, కనీసం హైకోర్టు తాజా ఆదేశాల నేపథ్యంలోనైనా స్పందిస్తారో చూడాలని మాజీ ఎంపీ, న్యాయవాది ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. గతంలో జగన్ ఇంప్లీడ్ కావడం బలాన్నిచ్చిందని, ఇప్పుడు చంద్రబాబు ఏం చేస్తారో చూడాలని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారాయన. బుధవారం ఉదయం రాజమహేంద్రవరంలో ఉండవల్లి మీడియాతో మాట్లాడారు.
‘‘సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు తెలంగాణ హైకోర్టు విచారణ ప్రారంభించింది. మార్గదర్శి తరపున సిద్ధార్థ లూద్రా వాదనలు వినిపిస్తూ.. రెండు వారాల సమయం కోరారు. తాము ఎవరెవరికి డబ్బు చెల్లించామో 70 వేల పేజీల్లో సుప్రీంకోర్టుకు వివరాల్ని మార్గదర్శి సబ్మిట్ చేసింది. కట్టిన డబ్బుల ఇచ్చారే తప్ప వడ్డీ ఇవ్వలేదని పలువురు మార్గదర్శి ఫైనాన్స్ ఖాతాదారులు నన్ను అడుగుతున్నారు. ప్రతి ఒక్కరికి వడ్డీతో సహా డబ్బు అందేందో లేదో పరిశీలించమని ఒక జ్యుడీషియరీ అడ్వైజర్ ను హైకోర్టులో నియమించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది..
ఇదీ చదవండి: టీడీపీకి ఇది నల్ల ఖజానా
.. మార్గదర్శి డిపాజిట్ల సేకరణ చట్టవిరుద్ధం. 2006లో అప్పటి ఫైనాన్స్ శాఖా మంత్రి చిదంబరానికి నేను చెప్పిందే.. ఇప్పుడు ఆర్బీఐ కూడా చెప్పింది. ఆర్బీఐ అఫిడవిట్‌తో నేను చెప్పిందే నిజమైంది. మార్గదర్శిపై నా పోరాటాన్ని మరోలా వక్రీకరించారు. ఇదేదో వైఎస్సార్ చెప్పటం వల్లే నేను చేశానని అందరూ అనుకుంటున్నారు... అది నిజం కాదు. ఆంధ్ర, తెలంగాణలో ఉన్న ఏ చిట్‌ఫండ్ కంపెనీ కూడా చిట్‌ఫండ్ చట్టాన్ని అనుసరించడం లేదు. ఇటీవలె కాకినాడలో జయలక్క్క్ష్మి చిట్‌ఫండ్ కంపెనీ ఎత్తేశారు. మార్గదర్శి.. చిట్‌ఫండ్ యాక్ట్‌ను బ్యాడ్ లాగా పేర్కొంది. రామోజీరావు అనుసరించకపోవడం వల్లే తాము అదే ఫాలో అవుతున్నామని చెబుతున్నారు. ఈ విషయంలోనే నాపై మార్గదర్శి కంపెనీ కూడా కేసు కూడా వేసింది. రామోజీరావు కేసులో ప్రెస్మీట్ చెప్పిన అందరిని జైల్లో వేస్తున్నారు. మిగిలిన వారెవరు ప్రశ్నించకుండా ఉండేందుకు మార్గదర్శి నాపై పరువు నష్టం దావా కేసు వేశారు.
సంబంధిత వార్త: మార్గదర్శి దందాకు క్విడ్ ప్రోకో కుట్ర
.. మార్గదర్శి చిట్ ఫండ్స్ నాపై 50 లక్షలు పరువు నష్టం దావా వేశారు.. తెలంగాణ కోర్టులో అది ఇంకా పెండింగ్ లో ఉంది. మార్గదర్శి చిట్‌ఫండ్ వ్యవహారం ఒక కొలిక్కి వస్తే నేను ఆ కేసు నుంచి బయటపడగలను. మార్గదర్శి చిట్స్ నుంచి డబ్బు మార్గదర్శి ఫైనాన్స్ లోకి వెళ్లి.. అక్కడి నుంచి రామోజీరావు జేబులోకి వెళ్ళింది. ఈనాడు పేపర్ ను అడ్డం పెట్టుకుని రామోజీరావు ఈ కార్యకలాపాలకు పాల్పడ్డారు. హెచ్ఎఫ్ ఇంపాక్ట్ కచ్చితంగా ఉంటుంది. వాస్తవం ఏంటో చెప్పాల్సిన బాధ్యత ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై ఉంది.
.. సెప్టెంబర్ 11 కి వాయిదా ఉంది. మార్గదర్శి కేసులో విచారణ ప్రారంభమై రెండు వారాలు గడుస్తున్నా ఇటు రేవంత్, చంద్రబాబు ప్రభుత్వాలు ఇప్పటివరకు స్పందించలేదు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇంప్లీడ్ కావడంతో కేసుకు కాస్త బలం వచ్చింది. ఇప్పుడు సీఎంగా చంద్రబాబు ఉన్నారు. ఆయనకు రామోజీరావుకు సన్నిహిత సంబంధాలు ఉన్నారు. కాబట్టి ఎలా స్పందిస్తారో తెలియదు. రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తేనే గౌరవం నిలబడుతుంది. కోర్టులో ఆలస్యం అవుతుందే తప్ప అన్యాయం జరగదు. రామోజీతో సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ.. సీఎం హోదాలో చంద్రబాబు విచారణకు సహకరించాలి. వెంటనే రెండు ప్రభుత్వాలు హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలి’’ అని ఉండవల్లి కోరారు.
ఏపీ ఎన్నికల ఫలితాలపైనా..
ఏపీ రీ ఆర్గనైజేషన్ యాక్ట్ ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉంది. ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన ఐదు మండలాలు తిరిగి వెనక్కి ఇచ్చేయమని తెలంగాణ కోరుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున వైయస్ జగన్ ఎలా అఫిడవిట్ ఫైల్ చేశారో.. మీరు కూడా అదే చేయమని చంద్రబాబును కోరుతున్నాను. స్పెషల్ కేటగిరి స్టేటస్ ప్రకటించిన 11 రాష్ట్రాల్లో తెలంగాణ ను ఎందుకు చేర్చారో తెలియటం లేదు. మహారాష్ట్రకు చెందిన ఓట్ ఫర్ డెమోక్రసీ సంస్థ ఆంధ్రప్రదేశ్లో పోలైన ఓట్లకి లెక్కించిన ఓట్లకి 12.5% తేడా ఉందన్న ప్రకటించారు.. దీనిపై ఎందుకు చంద్రబాబు స్పందించడం లేదు. పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం పోలింగ్ పూర్తయిన ఫలితాలు వచ్చిన 45 రోజుల వరకు ఓట్ల వివరాలు భద్రంగా ఉంచాలి. ఓట్ ఫర్ డెమోక్రసీ చెప్పిన వివరాలు తప్పయితే తప్పని చంద్రబాబు ప్రకటించాలి. ఓట్ల వివరాలు పది రోజుల్లోనే డిస్ట్రాయ్ చేయమని ఎన్నికల కమిషనర్ మీనా ఎందుకు ప్రకటించారో .. స్పష్టం తెలియాలి అని ఉండవల్లి డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment