
సాక్షిప్రతినిధి, రాజమహేంద్రవరం: విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించకుండా రాజకీయాలకతీతంగా పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ విజ్ఞప్తి చేశారు. రాజమహేంద్రవరంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎందరో త్యాగాల ఫలితంగా ఏర్పాటైన తొలి ప్రభుత్వరంగ సంస్థను ప్రైవేటుపరం చేయకుండా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు.
అధికార వైఎస్సార్‌సీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సహా అన్ని పక్షాలు స్టీల్ ప్లాంట్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటుపరం చేయకుండా ఉండే వరకైనా కలిసి ఉండాలన్నారు. లాభాల్లో ఉన్న ఫ్యాక్టరీని నష్టాల పేరుతో బడా కార్పొరేట్ సంస్థలకు అప్పగించే కుట్ర జరుగుతోందన్నారు. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న తరుణంలో ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రతిపాదనను కేంద్రం ఉపసంహరించుకునేలా రాష్ట్రంలోని పార్టీలన్నీ తీవ్రమైన ఒత్తిడి తీసుకురావడం ఒక్కటే మన ముందున్న మార్గమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment