
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ హైకోర్టులో మార్గదర్శికి ఎదురుదెబ్బ తగిలింది. ఖాతాదారుల వివరాలను పిటిషనర్ ఉండవల్లి అరుణ్‌కుమార్‌కు పెన్‌డ్రైవ్‌లో ఇవ్వాల్సిందేనని కోర్టు గురువారం ఆదేశించింది.
ఫిజికల్ కాపీ ఉన్నప్పుడు.. పెన్‌డ్రైవ్‌లో వివరాలు ఇవ్వడానికి ఇబ్బంది ఏంటని ఈ సందర్భంగా మార్గదర్శి తరఫు లాయర్‌ను ప్రశ్నించింది న్యాయస్థానం. ఉండవల్లికి పెన్‌డ్రైవ్‌లోని వివరాలు ఇవ్వాల్సిందేనని కోర్టు తెలిపింది. ఎస్ క్రో అకౌంట్‌లో ఉన్న డబ్బులు ఎవరివో మార్గదర్శి చెప్పాలంటూ ఉండవల్లి కోర్టులో వాదనలు వినిపించారు.
చందాదారులు ఎందుకు డబ్బులు తీసుకోవటం లేదో మార్గదర్శి చెప్పాలన్నారు. తాను బాధిత ప్రజల కోసం పోరాడుతున్నానని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. లూద్రా లాగా లిటిగెంట్ కోసం పోరాటం చేయటం లేదని తెలిపారు. అనంతరం పిటిషన్ విచారణను వాయిదా వేసింది.