జగన్‌కు ప్రజల్లో 51 శాతం ఆదరణ | Vundavalli Aruna Kumar Comments On YS Jagan Govt | Sakshi
Sakshi News home page

జగన్‌కు ప్రజల్లో 51 శాతం ఆదరణ

Published Thu, Feb 20 2020 5:21 AM | Last Updated on Thu, Feb 20 2020 5:21 AM

Vundavalli Aruna Kumar Comments On YS Jagan Govt - Sakshi

రాజమహేంద్రవరం సిటీ: రాష్ట్ర ప్రజల్లో జగన్‌కు 51 శాతం ఆదరణ ఉందని, అతనిని ఎవరూ ఏమీ చేయలేరని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజమహేంద్రవంలో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేయాలని కోరారు. మాజీ సీఎం రాజశేఖరరెడ్డి తలపెట్టిన పోలవరం ప్రాజెక్టు జగన్‌ ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యంగా ఉండాలన్నారు. రాజశేఖరరెడ్డి చొరవతో కాలువల నిర్మాణం జరగడం వల్లనే చంద్రబాబు పట్టిసీమ ద్వారా నీరు ఇవ్వగలిగాడన్నారు. వైఎస్సార్‌ ఆలోచనను 14 ఏళ్ల తరువాత జగన్‌ నిజం చేశారని  సంతోషం వ్యక్తం చేశారు. ఈ విషయమై జగన్‌కు బుధవారం లేఖ రాశానని చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement