చేసిన పాపాలు మనకు తిరిగి తగులుతాయని చంద్రబాబు, రామోజీ చూస్తే తెలుస్తుందంటూ రామోజీరావు తోడల్లుడు డాల్ఫిన్ అప్పారావు వ్యాఖ్యానించారు. రామోజీ అంటే ఆయన కుమారుడికి నచ్చరని, సుమన్ ఉండి ఉంటే.. మార్గదర్శికి సంబంధించి ఏం జరిగేందో వంటి ఆసక్తికరమైన విషయాలు సాక్షికి వెల్లడించారు.
ఆశ్చర్యమనిపించింది..
మార్గదర్శిపై సీఐడీ దాడులతో రామోజీ భయపడ్డారు. అందుకే మంచం పట్టినట్లు కనిపించారు. దాని వల్ల ఎక్కువగా ప్రశ్నించరని అనుకున్నారు. కానీ.. అది వర్కవుట్ కాలేదు. ఆ ఫొటో (మంచంపై పడుకున్న రామోజీని సీఐడీ విచారిస్తున్న) చూశాక నాకే ఆశ్చర్యమనిపించింది. ఆ స్థితిని చూసినప్పుడు ఈ మధ్య చంద్రబాబు ఏడ్చిన విషయం గుర్తొచ్చింది.
గతంలో ఆరోగ్యం కూడా బాగోలేని ఎన్టీఆర్‌ని చంద్రబాబు, రామోజీ కలిసి ఏడిపించారు. చాలా మానసిక వేదనకు గురిచేశారు. రామోజీ మంచంపై పడుకోవడానికి.. చంద్రబాబు ఏడవడానికి కారణం కూడా అదే. చేసిన పాపాలు మనకు తిరిగి తగులుతాయని వీళ్లని చూస్తే తెలుస్తుంది. సుమన్ ఉండి ఉంటే.. మార్గదర్శికి సంబంధించి అప్పుడే గొడవలు జరిగి ఉండేవేమో. ఎందుకంటే సుమన్‌కి ఈ తరహా మోసాలు అసలు నచ్చవు.
రికార్డులు ఇవ్వడానికి భయమెందుకు?
వచ్చిన చిట్స్ మొత్తాన్ని రామోజీ ఇష్టం వచ్చినట్లు మళ్లించేస్తుంటే.. భవిష్యత్తులో ఏ చిన్న పొరపాటు జరిగినా లక్షల మందికి ఎలా చెల్లించగలరు? ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొనాల్సిన అవసరం ఉంది. మార్గదర్శి డిపాజిటర్ల భవిష్యత్తుకు భరోసా కల్పించేందుకే ప్రభుత్వం మార్గదర్శిపై విచారణ ప్రారంభించడం చాలా మంచిపని. ఇన్నాళ్లూ మోనార్క్‌గా వ్యవహరించి.. మన మీదకు ఎవరు విచారణకు వస్తారనే ధీమాతో రామోజీ ఉండేవారు. ఇప్పుడు ఇలా ఒక్కసారిగా విచారణకు వస్తుంటే తట్టుకోలేకపోతున్నారు. లెక్కలన్నీ పక్కాగా ఉన్నప్పుడు రికార్డులు ఇవ్వడానికి భయమెందుకు?
అహం పెరిగిపోయింది..
ఇదంతా.. తన సామ్రాజ్యం.. ఇందులో వేరెవరికీ చోటుండకూడదని రామోజీరావు ఎప్పుడూ భావిస్తుంటారు. దీనికి చంద్రబాబు సహకారం అందించారు. ఎన్టీఆర్‌ని పదవీచ్యుతుడిని చేశాక ఇద్దరూ ఒక్కటైపోయారు. అప్పటి నుంచి రామోజీకి తానే చక్రవర్తిననే అహం పెరిగిపోయింది. ఫిల్మ్‌సిటీని 1,000 నాగళ్లతో దున్నించేస్తానని కేసీఆర్ చెప్పడంతో.. ఆయనను మభ్యపెట్టేందుకు కేసీఆర్‌తో చర్చలు జరిపారు. ఓం సిటీ కడతానని ప్లాన్లు చూపించారు. ఇది ఫిల్మ్‌సిటీని మించిపోతుందని నమ్మించారు. దాన్ని మోదీకి కూడా చూపించారు. కానీ.. ఓం సిటీ ఏమైంది..? పేపర్లకే పరిమితమైంది.
చదవండి: రామోజీ ఎందుకు ఓర్వలేకపోయారు?.. ఆ భయం వెంటాడిందా?
Comments
Please login to add a commentAdd a comment