
సాక్షి, హైదరాబాద్: మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో అవకతవకలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు చేస్తున్న తనిఖీలపై పత్రికల్లో వచ్చిన ఫొటోలను పరిగణనలోకి తీసుకోలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి తనిఖీలు జరిపితే.. సంస్థ రోజువారీ కార్యకలాపాలకు ఇబ్బంది కలగకుండా చూడాలని సీఐడీని ఆదేశించింది. తనిఖీల పేరిట రోజువారీ కార్యకలాపాలను అడ్డుకుంటున్నారని మార్గదర్శి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ముమ్మినేని సుధీర్‌కుమార్ గురువారం విచారణ చేపట్టారు.
ఏపీ ప్రభుత్వం తరఫున ఏజీపీ ఏబీ లలితా గాయత్రి వాదనలు వినిపించారు. తనిఖీల సమయంలో ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించడంలేదని చెప్పారు. చట్ట ప్రకారమే తనిఖీలు జరిగాయన్నారు. పారదర్శకంగా సాగుతున్న దర్యాప్తును అడ్డుకునేందుకు మార్గదర్శి ఇప్పటికే పలు పిటిషన్లు వేసిందన్నారు. పత్రికలో ఏవో ఫొటోలను ప్రచురించి ఖాతాదారులను అడ్డుకుంటున్నామని చూపించే యత్నం చేస్తోందని తెలిపారు.
చదవండి: అప్పులంటూ అబద్ధాలా?
అలాంటి ఫొటోలను, ప్రచురణలను పరిగణనలోకి తీసుకోవద్దని కోర్టును కోరారు. ఏపీలో నమోదవుతున్న కేసులపై ఈ కోర్టు నుంచి ఉపశమనం పొందాలని భావిస్తోందని తెలిపారు. పరిధి లేని పిటిషన్లను విచారణకు స్వీకరించవద్దని, పిటిషన్‌ను కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. పత్రికల్లోని ఫొటోలను పరిగణనలోకి తీసుకోలేమని స్పష్టంచేశారు. ఈ పిటిషన్ కూడా ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న పిటిషన్‌లకు కలుపుతూ విచారణను వాయిదా వేశారు.
చదవండి: తీవ్ర తుపానుగా ‘మోచా’
Comments
Please login to add a commentAdd a comment