మార్గదర్శి కేసు విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్‌ రవి | Justice Ravi who withdrew from the trial of the Margadarsi case | Sakshi
Sakshi News home page

మార్గదర్శి కేసు విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్‌ రవి

Published Fri, Dec 23 2022 8:31 AM | Last Updated on Fri, Dec 23 2022 8:31 AM

Justice Ravi who withdrew from the trial of the Margadarsi case - Sakshi

సాక్షి, అమరావతి: చిట్‌ఫండ్‌ చట్టం నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన సమాచారం, రికార్డులు ఇవ్వకపోవడమే కాక అధికారులు చట్టబద్ధంగా చేస్తున్న సోదాలను తప్పు­పడుతూ మార్గదర్శి చిట్‌ఫండ్‌ యాజమాన్యం దాఖలు చేసిన పిటిషన్‌ విచారణ నుంచి మరో న్యాయమూర్తి తప్పుకున్నారు. మంగళవారం ఈ వ్యాజ్యం విచారణ నుంచి న్యాయమూర్తి జస్టిస్‌ దొనడి రమేశ్‌ తప్పుకోగా, గురువారం జస్టిస్‌ చీమలపాటి రవి కూడా ఈ వ్యాజ్యాన్ని విచారించలేనని చెప్పారు.

వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి ముందుంచాలని జస్టిస్‌ రవి రిజిస్ట్రీని ఆదేశించారు. దీంతో రిజిస్ట్రీ తిరిగి ఈ వ్యాజ్యం ఫైలును ప్రధాన న్యాయమూర్తి ముందుం­చింది. ప్రధాన న్యాయమూర్తి ఈ వ్యాజ్యం విచారణను జస్టిస్‌ సత్తి సుబ్బారెడ్డికి అప్పగించారు. శుక్రవారం మార్గదర్శి వ్యాజ్యంపై జస్టిస్‌ సుబ్బారెడ్డి విచారణ జరిపే అవకాశం ఉంది. సుబ్బారెడ్డి ముందున్న కేసుల విచారణ జాబితాలో మార్గదర్శి పిటిషన్‌ 170వ కేసుగా నమోదైంది. ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణకు వచ్చే పరిస్థితి లేకపోవడంతో మధ్యాహ్నం విచారణ చేపట్టాలని మార్గదర్శి న్యాయవాదులు కోరే అవకాశం ఉంది.  

చదవండి: (బాలయ్యా.. ఇటు రావేమయ్యా.. కిష్టప్ప.. ఎక్కడున్నావప్పా..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement