సాక్షి, విశాఖ: తనకు రామోజీరావుతో ఎటువంటి వ్యక్తిగత విభేదాలు లేవని, కేవలం ఆయన చేసిన అక్రమాలని మాత్రమే ప్రశ్నిస్తున్నానని మరోసారి స్పష్టం చేశారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్. చట్టాలు, నిబంధనలు అందరికీ ఒకేలా ఉండాలని, అందుకే ప్రజల్లో తిరుగుబాటు మొదలైందన్నారు ఉండవల్లి.
‘రామోజీరావు సంస్థల చరిత్ర మొత్తం నా దగ్గర ఉంది - రామోజీరావుకు తెలియని విషయాలు కూడా నాకు తెలుసు. మార్గదర్శి చిట్‌ఫండ్ డబ్బును మార్గదర్శి ఫైనాన్షియర్స్ లో పెట్టారు. ఇదే విషయం ప్రశ్నిస్తే నాపై పరువునష్టం దావా వేశారు. రామోజీరావుకు చట్టం, నిబంధనలు వర్తించవా? రామోజీ కేసులో వాస్తవాలు వెలుగుచూడాలన్నదే నా ఆకాంక్ష. రామోజీకి వైఎస్ఆర్సీపీ తప్ప అన్ని పార్టీలు మద్ధతు పలుకుతున్నాయి. ప్రజల నుండి మద్ధతు ఉండబట్టే నా పోరాటం కొనసాగుతోంది. దేశంలోని ఆర్థిక నేరాలకు ఇకనైనా ఫుల్‌స్టాప్ పడాలి. రామోజీరావు అయినా రూల్స్ పాటించాల్సిందే. చట్టాలు అందరికీ వర్తించాలన్నదే మా డిమాండ్ - చట్టాలకు లోబడే మార్గదర్శి డిపాజిట్లు సేకరించిందా?
ఈ అంశాన్ని ప్రశ్నించినందుకే ఉండవల్లిని ఈనాడు బ్యాన్ చేసింది. ఈ పోరాటంలో ఉండవల్లికి అన్ని వర్గాల మద్ధతు ఉంది. 17 ఏళ్లుగా ఉండవల్లి చేస్తున్న పోరాటం చాలా గొప్ప విషయం. తప్పులను ఎత్తిచూపాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. ఉండవల్లి పోరాటం వల్లే రామోజీ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. చట్టంలోని లోపాలను అడ్డుపెట్టుకుని తప్పించుకోవడం రామోజీరావుకు వెన్నతో పెట్టిన విద్య. నిబంధనలకు వ్యతిరేకంగా మార్గదర్శి వ్యవహరిస్తోంది. డిపాజిటర్లకు ఇవ్వాల్సిన డబ్బు తన దగ్గరే పెట్టుకుంది.
డిపాజిటర్లకు డబ్బు చెల్లిస్తే ఆ వివరాలను వెల్లడించవచ్చు కదా. చెల్లించాల్సిన డబ్బు మార్గదర్శి దగ్గర ఉందా?. అక్రమాలను నిరోధించేందుకే చర్యలు చేపట్టింది. వ్యవస్థలోని లోపాలను పత్రికలు ఎత్తిచూపాలి. ప్రభుత్వంలోని తప్పులను పత్రికలు చెప్పాలి. ఒక వ్యక్తి వ్యవస్థగా మారితే మార్గదర్శిలాంటి పరిస్థితి వస్తుంది. వ్యక్తికి, పార్టీకి కొమ్ముకాసే విధంగా పత్రికలు వ్యవహరించకూడదు
పొలిటికల్ మాఫియాతో మీడియా మాఫియా చేతులు కలిపిందిమార్గదర్శిలో అవకతవకలు జరిగిన మాట వాస్తవం. 1980 నుంచి మార్గదర్శిలో అవకతవకలు జరిగాయి. కొందరు గ్యారెంటీస్ ఇవ్వకపోవడం వల్ల చిట్ పాడుకున్న తర్వాత కూడా డబ్బు ఇచ్చేవారు కాదు. మార్గదర్శిలో అవకతవకల పై ప్రశ్నించేందుకు సీఐడీ వెళ్లినప్పుడు మంచం పై ఉన్నా సహకరించాననే చెప్పుకునేందుకే రామోజీ యత్నం. చంద్రబాబు లేకుండా రామోజీ లేరు.. రామోజీ లేకుండా చంద్రబాబు లేరు’ అని ఉండవల్లి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment