
కిల్ బిల్ పాండే తెలుసు... ఫ్రస్ట్రేషన్ ఎక్కువై ఏం చేయాలో తెలియక, దాన్ని ఎలా చూపాలి అర్థం కాక ఏదోటి చేసేసి రిలాక్స్ అవుతాడు ... తేడా వస్తే దొరికినోళ్లందర్నీ కాల్చేసి.. ఫైర్.. ఫైర్ అని అరుస్తుంటాడు.. ఈపాటికే మీకు గుర్తుకు వచ్చింది కదా బ్రహ్మీ అలియాస్ కిల్ బిల్.... ఇప్పుడు తెలుగు సమాజంలో కూడా రామోజీ రావు అచ్చం కిల్ బిల్ పాండేలా తయారయ్యారు.
ఒకవైపు కమ్ముకొస్తున్న మార్గదర్శి కేసులు, మరోవైపు అటు చిట్ చందాదారులు, డిపాజిట్ దారులు తమ డబ్బు కోసం చేస్తున్న డిమాండ్లు, ఇంకోవైపు పెద్ద కోడలు చేస్తున్న పరువు తక్కువ కామెంట్లు... ఇవన్నీ ఒక ఎత్తు కాగా తనకు పుట్టు విరోధి అయిన జగన్ మోహన్ రెడ్డి తనకు ఎంతకూ కొరుకుడు పడకుండా వందే భారత్ ట్రైన్ మాదిరిగా దూసుకుపోతుండడంతో ఆ ట్రైన్‌ను ఆపడం రామోజీకి సాధ్యం కావడం లేదు. ఇక అక్క ఆరాటమే తప్ప బావ బతికేది లేదు అన్నట్లుగా తానూ ఈనాడులో జాకీలు వేసి లేపడం తప్ప ఎక్కడా చంద్రబాబు .. లోకేష్ బలపడక పోవడంతో రామోజీకి భవిష్యత్ అర్థం అయిపోతోంది. దీంతో ఫ్రస్ట్రేషన్ తన్నుకువస్తోంది. అందులో భాగంగా తప్పుడు వార్తలు, ఆధారాలు లేని స్టోరీలతో గాయి గత్తర చేద్దాం అని బయలుదేరుతున్నారు.
జగన్ వచ్చాక పోలవరం కట్టలేదు... అమరావతి లేదు... ఇతర ప్రాజెక్టులు లేవు... అంటూ నోటొకొచ్చినట్లు రాస్తూ పోతున్నారు. ఐదేళ్ళలో జగన్ అది చేయలేదు.. ఇది లేదు అని రాస్తూ వస్తున్న రామోజీకి మరి ముప్పయ్యేళ్లుగా రాజకీయాల్లో ఉంటూ పదిహేనేళ్ళు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవనీ ఎందుకు గుర్తుకు రాలేదో తెలీదు. చంద్రబాబు ఏటా దావోస్ వెళ్లి ఫోటోలు దిగి రావడం తప్ప ఇన్నేళ్ళలో ఆంధ్రాలో ఒక అప్పడాలు, అటుకుల మిల్లు అయినా పెట్టించలేదు
గతంలో ఏపీ సీఐడీ విచారణ సందర్భంగా రామోజీరావు(ఫైల్‌ఫోటో)
పైగా పదుల సంఖ్యలో ప్రభుత్వ సంస్థలు మూసేసారు. మరి ఆనాడు రామోజీ నోరు లేవలేదేం. అహో అమరావతి అని హెడ్డింగులు పెట్టి గ్రాఫిక్స్ చూపించిన పత్రికలు అదే అమరావతికి చంద్రబాబు తూట్లు పొడిచి తాత్కాలిక రాజధానిగా పేర్కొంటూ వర్షానికి కారిపోయేలా భవనాలు కడితే ఎందుకు ప్రశ్నించలేదు. ఐదేళ్ళలో అమరావతి ఎందుకు పూర్తి చేయలేదు. పులిచింతల ఏమైంది, పోలవరానికి ఉసురు తీసి దాన్ని ఏటీఎం మాదిరిగా వాడుకున్నది ఎవరు.? మరి అప్పుడు లేవని నోరు ఇప్పుడు లేస్తున్నదేం ? రైతు రుణమాఫీ ఎగ్గొట్టినపుడు, మహిళలకు పావలా వడ్డీ రుణాలు ఎగ్గొట్టినపుడు... అలవిమాలిన దోపిడీ, టిడిపి నాయకుల అరాచకాలు..ఇవన్నీ అప్పుడు ఎందుకు కనిపించలేదు.
పైగా జగన్‌మోహన్‌రెడ్డి ఇస్తున్న సంక్షేమ పథకాలు వాళ్ళ ఆంధ్ర అప్పులపాలు అయిపోతుంది అంటూ దారినబోయే దానయ్యలతో చెప్పిస్తూ పేజీలు నింపేసే రామోజీ ఇప్పుడు చంద్రబాబు ఇచ్చిన మ్యానిఫెస్టో చూడలేదా.. అవన్నీ ఇచ్చుకుంటూ పొతే ఆంధ్ర శ్రీలంక అవ్వదా ? వెనిజులా అవ్వదా..? మరి అవన్నీ ఇవ్వడానికి ఎక్కడ అప్పులు చేస్తారు.. ఇవన్నీ ఎందుకు రాయడం లేదు.. ఓహో... తమకు నచ్చినవాళ్లు అప్పులు చేస్తే ఫర్లేదా.?తమకు నచ్చనివాళ్ళు చేస్తేనే అప్పులు... ఇబ్బందుకు.. ఆర్థిక కష్టాలు వస్తాయా.?
వయసు పెరగ్గానే సరిపోదు పెద్దాయన.. కాస్త బుద్ధి కూడా పెరగాలి.. జీవితంలో ఒక్కసారైనా ప్రజల పక్షాన నిలవండి.. జీవితాన్ని అంత్యదశలో అయినా సార్థకత చేసుకోండి.
Comments
Please login to add a commentAdd a comment