
సాక్షి, కాకినాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో తెలంగాణ సీఎం కేసీఆర్ ఫుట్ బాల్ ఆడుకున్నారని మాజీ ఎమ్మెల్యే, కాకినాడ సిటీ వైఎస్సార్‌సీపీ కోఆర్డినేటర్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. మనం చేసే రాజకీయాలు భావితరాలకు ఆదర్శంగా ఉండాలి, కానీ చంద్రబాబు చేసే దౌర్భాగ్య రాజకీయాలు ఎవరు చేయాలేరని మండిపడ్డారు. రాజకీయాలంటే ఆసక్తి ఉన్న వారు చంద్రబాబులా వ్యవహరించోద్దని సూచించారు. తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఓడించాలని చంద్రబాబు ప్రచారం చేశారు, మరి ఏపీలో 23మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి మంత్రి పదవులు కట్టబెట్టడానికి సిగ్గనిపించలేదా అని ధ్వజమెత్తారు. సమైక్యాంధ్ర, ప్రత్యేక హోదా కోసం చిత్తశుద్ధితో పోరాటం చేసిన నాయకుడు వైఎస్ జగన్ అన్నారు. చంద్రబాబు తీరును ప్రజలు గమనించాలన్నారు.
రక్తం మరిగిన పులిలా.. డబ్బుకు రుచి మరిగిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు మళ్లీ పేకాట క్లబ్‌లను నడుపుతున్నారని నిప్పులు చెరిగారు. కాకినాడ మూడవ వంతెన నిర్మాణంలో రూ.50 కోట్ల అవినీతి జరుగుతోందని, ఆ అవినీతి సొమ్ము ఎమ్మెల్యే కొండబాబు జేబులో చేరబోతోందన్నారు. కాకినాడ మున్సిపాలిటీ ఇంజినీరింగ్ విభాగం తీవ్ర అవినీతికి పాల్పడుతోందని ధ్వజమెత్తారు. బాగున్న రోడ్ల మీదనే తక్కువ మందం కలిగిన రోడ్లు వేసి అవినీతికి పాల్పడుతున్నారన్నారు. మున్సిపల్ అధికారుల అవినీతిపై విచారణ జరిపించాలని విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నామని తెలిపారు. చంద్రబాబు మాదిరిగానే ఎమ్మెల్యే కొండబాబుకు శిలాఫలకాల పిచ్చి పట్టుకుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment