
సాక్షి, తూర్పు గోదావరి: రాష్ట్రంలో నిశ్శబ్ధ విప్లవం ప్రారంభమైందనడానికి గ్రామ సచివాలయాల వ్యవస్థే నిదర్శనమని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రామ సచివాలయాల ఉద్యోగాల భర్తీతో సీఎం జగన్ చరిత్ర సృష్టించారన్నారు. పైరవీలకు చోటు లేకుండా నిరుద్యోగులు ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు సంపాదించుకున్నారని తెలిపారు.
ముఖ్యమంత్రి ప్రతినిధులుగా గ్రామ సచివాలయ ఉద్యోగులు క్షేత్ర స్థాయిలో ప్రజలతో మమేకం కావాలని పిలుపునిచ్చారు. చరిత్ర సృష్టించే దమ్మున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని ప్రశంసించారు. పాదయాత్రలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలో భాగంగానే గ్రామ సచివాలయ ఉద్యోగాలు అందించారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల కాలంలో నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చి జగన్ రికార్డు సృష్టించారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment