
పవన్‌కల్యాణ్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి మండిపడ్డారు.
సాక్షి, కాకినాడ(తూర్పుగోదావరి): పవన్‌కల్యాణ్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, జనసేన కార్యకర్తలకు పవన్.. అన్యాయం చేస్తున్నారన్నారు. జనసేన పార్టీని ప్యాకేజీ కోసం మళ్లీ తాకట్టు పెడుతున్నాడని.. త్వరలో జన సైనికులు బాధపడే రోజు వస్తుందన్నారు.
ప్యాకేజీలకు అమ్ముడుపోయి నేతలు, కార్యకర్తలకు అన్యాయం చేయొద్దని ద్వారంపూడి హితవు పలికారు. ఎన్టీఆర్‌కే వెన్నుపొటు పొడిచిన చంద్రబాబు.. పవన్‌ను వెన్నుపోటు పొడవడం ఓ లెక్కా.. జిల్లాలో పవన్ కల్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేసిన ఓడిస్తానని ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి సవాల్ విసిరారు.
చదవండి: ‘అది నిజమేనని తేలిపోయింది’