
సాక్షి, కాకినాడ: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పచ్చి అవకాశవాదనీ, తన స్వార్థం కోసం ఏ పార్టీతో అయినా జతకాడతారని వైఎస్సార్‌సీపీ కో ఆర్డినేటర్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. అధికారం కోసం నిన్నటి వరకు బీజేపీతో జతకట్టి.. ఇవాళ కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకుంటున్నారని మండిపడ్డారు. శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... గతంలో వైఎస్సార్‌ను ఎదుర్కొంనేందుకు మహాకూటమి అంటూ కేసీఆర్‌తో చంద్రబాబు జట్టుకట్టిన విషయాన్ని గుర్తుచేశారు.
ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా టీఆర్‌ఎస్‌తో కలిసి పనిచేయాలని కేసీఆర్‌ను కోరింది నిజంకాదా అని ప్రశ్నించారు. కూకట్‌పల్లిలో లోధియా అపార్ట్‌మెంట్‌లో మంత్రి లోకేష్ చేసిన అక్రమాల వ్యవహారాల వీడియోలను కేసీఆర్ త్వరలోనే బయటపెట్టే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. బహుశా చంద్రబాబు నాయుడికి కేసీఆర్ ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ అదే కాబోలు అంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం వైఎస్ జగన్, కేసీఆర్‌తో కలిసి పనిచేయడాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment