
సాక్షి, తూర్పుగోదావరి : గోదావరిలో మునిగిపోయిన రాయల్ వశిష్ట బోటును వెలికి తీసిన ధర్మాడి సత్యం బృందంపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈనేపథ్యంలో ధర్మాడి సత్యంను కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి ప్రశంసించారు. శ్రీ బాలాత్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో ఆయన ధర్మాడి సత్యంనుఘనంగా సత్కరించారు. ఎమ్మెల్యే ద్వారంపూడి మాట్లాడుతూ.. సాహసోపేతంగా పనిచేసి ధర్మాడి సత్యం బృందం బోటును వెలికి తీసినందుకు గర్వంగా ఉందని అన్నారు. వైఎస్సార్‌సీపీ ఆవిర్భావం నుంచి సత్యం తన వార్డులో పార్టీకి మంచి సేవలందించారని ద్వారంపూడి గుర్తు చేశారు.
ధర్మాడి సత్యం మాట్లాడుతూ.. ‘బోటును వెలికితీయడంలో నా కర్తవ్యాన్ని నిర్వర్తించాను. అందరూ చేతులెత్తేసినా.. పట్టుదలతో నావంతు ప్రయత్నం చేసి.. బోటును బయటపడేందుకు శ్రమించా. బోటు వెలికితీయడం ద్వారా చనిపోయిన వారి కుటుంబాల్లో కాస్తంత ఊరట కలిగించానన్న తృప్తి నాకు మిగిలింది’అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment