సాక్షి, కాకినాడ: జిల్లాలోని ప్రత్తిపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై ఉన్న వారిని ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి చెందారు. ఇక, మృతులను బాపట్ల జిల్లాలకు చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.
వివరాల ప్రకారం.. ప్రత్తిపాడు మండలంలోని పాదాలమ్మ గుడి వద్ద 16వ నెంబర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. కాగా, లారీ పంక్చర్ కావడంతో నలుగురు వ్యక్తులు టైర్ మారుస్తున్నారు. ఈ క్రమంలో అతి వేగంతో అటుగా వస్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు దాసరి ప్రసాద్, దాసరి కిషర్, క్లీనర్ నాగయ్య, స్థానికుడు రాజు మృతిచెందారు. మృతులను బాపట్ల జిల్లా నక్క బొక్కలపాలెంకు చెందిన వారిగా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment