pattipadu
-
కాకినాడ: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
సాక్షి, కాకినాడ: జిల్లాలోని ప్రత్తిపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై ఉన్న వారిని ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి చెందారు. ఇక, మృతులను బాపట్ల జిల్లాలకు చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. వివరాల ప్రకారం.. ప్రత్తిపాడు మండలంలోని పాదాలమ్మ గుడి వద్ద 16వ నెంబర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. కాగా, లారీ పంక్చర్ కావడంతో నలుగురు వ్యక్తులు టైర్ మారుస్తున్నారు. ఈ క్రమంలో అతి వేగంతో అటుగా వస్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు దాసరి ప్రసాద్, దాసరి కిషర్, క్లీనర్ నాగయ్య, స్థానికుడు రాజు మృతిచెందారు. మృతులను బాపట్ల జిల్లా నక్క బొక్కలపాలెంకు చెందిన వారిగా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. -
గుంటూరులో రేపు సీఎం జగన్ పర్యటన
-
తూర్పుగోదావరిలో దారుణం..
సాక్షి, కాకినాడ: ఆస్తి కోసం కన్నతల్లినే హతమార్చిన కసాయి కొడుకు ఉదంతం తూర్పుగోదావరి జిల్లాలో శనివారం జరిగింది. పత్తిపాడు మండలం రౌతు పాలెం గ్రామంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. ఆస్తి రాయిలేదనే కోపంతో నిమ్మల శ్రీనివాస్ అనే వ్యక్తి టీవీ చూస్తున్న తన తల్లి నూకరత్నాన్ని కర్రతో తలపై కొట్టి అతి కిరాతకంగా హత్య చేసి పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. -
మార్పు తథ్యం!
సాక్షి, పత్తికొండ: పత్తికొండ నియోజకవర్గ రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరమే..రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన సంఘటనలు కూడా ఇక్కడే జరిగాయి. నియోజకవర్గంలో ఇప్పటి వరకు 15 సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 6 సార్లు కాంగ్రెస్, 7 సార్లు టీడీపీ, ఒక సారి సీపీఎం, ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలిచారు. రెండు సార్లు ఉప ఎన్నికలు జరిగాయి. కేఈ సోదరులకు రెండు పర్యాయాలు మద్దతు పలికినా నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయకపోవడంతో ప్రజలు వారిపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరోసారి జనం ముందుకు ఓట్లడగటానికి వస్తుండటంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన సమస్యలను విస్మరించడంతో రైతులు, ప్రయాణికులు, విద్యార్థుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రకాశం పంతులు ప్రభుత్వాన్ని కూల్చిన పత్తికొండ ఎమ్మెల్యే 1952లో ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టగా అప్పటి పత్తికొండ ఎమ్మెల్యే ముడుమాల శంకరరెడ్డి వ్యతిరేకంగా ఓటు వేయడంతో ప్రభుత్వం పడిపోయింది. అంతకుముందు రెండుసార్లు నియోజకవర్గాన్ని పునర్విభజించగా 2007లో మూడోసారి విభజించారు. పత్తికొండ, మద్దికెర, తుగ్గలి, కృష్ణగిరి, వెల్దుర్తి మండలాలతో నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు. నియోజకవర్గం నుంచి ఎస్వీ సుబ్బారెడ్డి మూడుసార్లు హ్యాట్రిక్ విజయం సాధించారు. అమలు కాని హామీలు పందికోన, కొత్తపల్లి, రిజర్వాయరు నుంచి 32,200 ఎకరాలకు, కృష్ణగిరిలో రిజర్వాయరు నుంచి 5,100 ఎకరాలకు సాగునీరందించి 68 చెరువులకు జలకళ తెస్తామని టీడీపీ నాయకులు హామీ ఇచ్చారు.అంతేకాక ఆర్టీసీ మినీ డిపో నుంచి పూర్తిగా స్థాయిలో ఏర్పాటు, పాలిటెక్నిక్ కళాశాల, బీసీ బాలికలకు వసతి గృహం ఏర్పాటు, 80 గ్రామాలకు తాగు నీరు సరఫరా చేస్తామని హామీ ఇచ్చి గెలిచిన తరువాత పట్టించుకోలేదు. కేఈ కుటుంబంపై ఆగ్రహం రెండుసార్లు కేఈ కుటుంబానికి మద్దతు పలికినా హామీల గురించి మాటెత్తకుండా మూడోసారి కేఈ శ్యాం కుమార్ (కేఈ కృష్ణమూర్తి కుమారుడు) బాబుకు ఓట్లు వేయాలని అడుగుతుంటే ఓటర్లు జీర్ణించు కోలేకపోతున్నారు. వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త చెరుకులపాడు నారాయణరెడ్డిని పట్టపగలే దారుణంగా హత్య చేయించారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఏడాది పాటు శ్యామ్‌బాబు అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇక ఆర్అండ్బీ రోడ్లు, నీరుచెట్టు ,చెక్‌డ్యాంలు, సీసీ రోడ్లు నిర్మాణాల్లో టీడీపీ నేతలు జేబులు నింపుకున్నారు. పక్కాగృహం మంజూరు కావాలంటే రూ.50వేలు ఇవ్వాల్సిందే. ఇలా లక్షల రూపాయలు వసూలు చేశారని లబ్ధిదారులు వాపోతున్నారు. నియోజకవర్గ అభివృద్ధి పట్టించుకోకపోవడంతో కేఈ సోదరులపై ప్రజా వ్యతిరేకత, చంద్రబాబు ప్రకటించిన 650 çహామీల్లో ఒక్కటీ అమలు చేయకపోవడం వైఎస్సార్సీపీకి కలిసొచ్చే అంశం. జోరుగా ఫ్యాను గాలి.. నియోజకవర్గంలో టీడీపీ నాయకుల అవినీతి, ఆక్రమాలు, ప్రత్యర్థుల చేతిలో భర్తను కోల్పోయిన శ్రీదేవికి నియోజకవర్గ ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. ఓటమి ఖాయమని గ్రహించిన కేఈ సోదరులు డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా ఈ ఎన్నికల్లో కంగాటి శ్రీదేవికి పట్టం కట్టడానికి ఓటర్లు సిద్ధమయ్యారు. ఈఎన్నికల్లో ఫ్యాన్ గాలికి సైకిళ్లు లేచిపోవడం ఖాయమని భావిస్తున్నారు. – పూజారి గోపాల్, పత్తికొండ ఓటర్ల వివరాలు మొత్తం 1,89,409 పురుషులు 95,751 మహిళలు 93,640 ఇతరులు 18 -
ప్రశ్నలు కాదు.. బుల్లెట్లే
- ప్రజాస్వామ్యంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన అధికారులు - ఊహకందని ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసిన పదో తరగతి విద్యార్థులు - సమాధానం చెప్పేందుకు తడబడ్డ అధికారులు వారంతా పదో తరగతి విద్యార్థులు. మన సర్కారు పాఠశాలలో చదువుతున్నారు. కానీ వారి ఆలోచనలు మాత్రం అందనంత ఎత్తులో ఉన్నాయి. వారు సంధించిన ప్రశ్నాస్త్రాలు అధికారులకు నోటమాటరాకుండా చేశాయి. సమాజం, ప్రజాస్వామ్యం, ఓటు హక్కుపైనా వారికున్న అవగాహన అధికారులను నోరెళ్లబెట్టేలా చేసింది. అసలేం జరిగింది. ఎవ్వరా విద్యార్థులు. వారు అధికారులకు సంధించిన ప్రశ్నలేంటి.. అన్న వివరాలు తెలుసుకుందాం రండి.. ప్రత్తిపాడు: ఇంటెన్సివ్ రివిజన్లో భాగంగా ప్రత్తిపాడు భవనం వెంకటరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తహసీల్దార్ సిహెచ్.పద్మావతి ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యం, ఎన్నికలు, ప్రభుత్వాల ఏర్పాటు, ఓటు హక్కు అనే అంశాలపై అవగాహన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడు తాండవకృష్ణ మాట్లాడుతూ ప్రజాస్వామ్యం, పౌరులహక్కులపై వివరించారు. తదనంతరం తహసీల్దార్ మాట్లాడుతూ ఓటు హక్కు, ప్రభుత్వాల ఏర్పాటు, ఓటర్లు, ప్రజల పాత్రపై తెలియజేశారు. పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువతీ, యువకులకు ఓటు హక్కు పొందే అవకాశం ఉందని చెప్పారు. ఎన్నికల సమయంలో డబ్బు తీసుకుని ఓట్లు వెయ్యడం చట్టరీత్యా నేరమని, డబ్బు తీసుకున్నా, ఇచ్చినా రెండూ నేరమేనన్నారు. ఎన్నికల సమయంలో మద్యంపైన కూడా నిషేధాన్ని విధిస్తారని చెప్పారు. తదనంతరం మీకేమైనా సందేహాలుంటే అడగాలని తహసీల్దార్ పద్మావతి విద్యార్థులను కోరారు. ఈ సందర్భంగా వారి మధ్య ఆసక్తికర సంభాషణ నడిచింది. విద్యార్థులు ఎస్కె.నసీమా, మల్లేశ్వరి, రమ్య, శిరీష అధికారుల ఊహకందని రీతిలో ప్రశ్నలు సంధించడంతో అధికారులు అవాక్కవ్వాల్సిన పరిస్థితి చోటుచేసుకుంది. విద్యార్థుల ప్రశ్నలు, అధికారుల సమాధానాలు వారి మాటల్లోనే.. విద్యార్థి: ప్రజలచేత ఎన్నుకోబడిన నాయకులు గెలిచిన తర్వాత పార్టీ మారుతున్నారు కదా? వారిపై చర్యలు ఎందుకు తీసుకోరు? తహసీల్దార్: అది వాళ్ల ఇష్టం. ఏ పార్టీకైనా వాళ్లు మారవచ్చు. వాళ్లపై చర్యలు తీసుకునే అధికారం ఎవ్వరికీ లేదు. తర్వాత వచ్చే ఎన్నికల్లో ప్రజలే వారికి తగిన సమాధానం చెబుతారు. విద్యార్థి: బెల్టు షాపులను రద్దు చేస్తున్నాం, చేస్తున్నాం అంటున్నారు. కానీ అసలు మద్యం దుకాణాలకు ఎందుకు ప్రభుత్వం అనుమతులు ఇస్తుంది? తహసీల్దార్: మద్యం వలన రాష్ట్రానికి ఆదాయం ఎక్కువగా వస్తుంది. అందు వలన మద్యం దుకాణాలకు అనుమతి ఇస్తున్నారు. అయినా ఎన్నికల సమయంలో మాత్రం నిషేదం ఉంటుంది. విద్యార్థి: మీరేమో ఎన్నికల సమయంలో మద్యం నిషేదం అంటున్నారు. కానీ అసలు ఎక్కువగా గ్రామాల్లో మద్యం పంచేది అప్పుడే కదా? తహసీల్దార్: ఎన్నికల సమయంలో ఖచ్చితంగా గ్రామాల్లో నిషేదం అమల్లో ఉంటుంది. దానికి తోడు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. రహస్యంగా గ్రామాల్లో మద్యం పంపిణీ చేస్తే కఠినమైన చర్యలు ఉంటాయి. విద్యార్థి: ఇందాక మీరు మద్యంను ఆదాయ వనరు అన్నారు. ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేసే మద్యంను ఆదాయ వనరుగా ఎంచుకునే బదులు, ప్రభుత్వాలు ఆదాయ వనరులుగా ప్రత్యామ్నాయాలను వెతుక్కోవచ్చుగా? తహసీల్దార్: అవును అలా చేయవచ్చు. చేస్తే బాగుంటుంది. విద్యార్థి: ఐదేళ్లకోసారే ఎన్నికలు ఎందుకు నిర్వహిస్తారు? తహసీల్దార్: ఎన్నికలు బాగా ఖర్చుతో కూడుకున్న పని కావడంతో ఐదేళ్లకోసారి నిర్వహిస్తారు. అంతేకాకుండా ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలు అభివృద్ధి పనులు చేసేందుకు కనీసం అంత సమయం పడుతుంది. ఈ విధానం బ్రిటిష్ కాలం నుంచి వస్తుంది. విద్యార్థి: ఓటు హక్కు పొందడానికి పద్దెనిమిది సంవత్సరాలు కావాలంటున్నారు. మరి ఎమ్మెల్యేగా పోటీ చెయ్యడానికి 21 సంవత్సరాలు ఉండాలంటున్నారు? అలా ఎందుకు? ఓటు హక్కుకు సరిపోయిన వయస్సు ఎమ్మెల్యేగా పోటీ చెయ్యడానికి ఎందుకు సరిపోదు? పద్దెనిమిది సంవత్సరాలకే ఎమ్మెల్యేగా పోటీ చేసే హక్కు యువతకు కల్పించవచ్చు కదా? తహసీల్దార్: ఏం చెప్పాలో అర్థం కాక కొద్ది నిమిషాల పాటు తహసీల్దార్ మౌనం. ఆ తర్వాత ఈ విషయాన్ని నేను ఎన్నికల కమిషన్‌కు లేఖ రాస్తా అని తహసీల్దార్ తెలిపారు. విద్యార్థి: ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి, గెలిచిన తర్వాత హామీలు నెరవేర్చని ఎమ్మెల్యేలను ఎందుకు రీకాల్ చెయ్యకూడదు? ఉపాధ్యాయుడు: అలా రీకాల్ చేసే పద్ధతి మన రాజ్యాంగంలో లేదు. -
ఎస్బీహెచ్లో రూ. 2.65 కోట్లు మాయం
ప్రత్తిపాడు: తూర్పుగోదావరి జిల్లాలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్(ఎస్ బీహెచ్) బ్యాంకులో రూ.2.65 కోట్లు మాయమయ్యాయి. కాగా బ్యాంకులో పనిచేసే ఓ ఉద్యోగే డబ్బును దారి మళ్లించినట్లు గుర్తించారు. దీంతో సదరు వ్యక్తి పరారీలో ఉన్నాడు. బ్యాంకు మేనజర్ సత్యానందం తెలిపిన వివరాల ప్రకారం.. ప్రత్తిపాడు పరిధిలో ట్రెజరీ ద్వారా నిర్వహించే నిధులు, లావాదేవీలు, ఉద్యోగుల జీతభత్యాలు, ఇతర ఆర్ధిక కార్యకలాపాలన్నీ ప్రత్తిపాడు ఎస్ బీహెచ్ ద్వారానే జరుగుతాయి. అయితే ఈ లావాదేవీల్లో పెద్ద మొత్తంలో నిధులు దారి మళ్లినట్లు ఏడాది మే నెల నుంచి సెప్టెంబర్ నెల వరకూ నిర్వహించిన లెక్కల్లో తేలిందని చెప్పారు. దీంతో ట్రెజరీ, ఇతరత్రా బ్యాంకు కార్యకలాపాల్లో చురుకుగా ఉండే బ్యాంకు సబ్ స్టాఫర్ ఎడ్ల ఉషా సత్య సూర్య వెంకట రాకేష్ అలియాస్ చిన్నాపై అనుమానం వచ్చినట్లు తెలిపారు. అతని అకౌంట్ లావాదేవీలను పరిశీలించి చూడగా రూ.2.65కోట్లను బినామీల ఖాతాలకు దారి మళ్లించినట్లు తేలిందని చెప్పారు. అమలాపురం, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాల్లో 29 బినామీ ఖాతాలు తెరిచినట్లు పేర్కొన్నారు. వాటిలోకి డబ్బును జమ చేసినట్లు చెప్పారు. ఒక్కో ఖాతాకు లక్ష రూపాయలకు పైనే జమ చేసినట్లు తెలిపారు. కాగా దారి మళ్లించిన సొమ్మును వెనక్కు తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు వెల్లడించారు. ఇప్పటివరకూ రూ.1.38కోట్ల నిధులు వెనక్కురాబట్టుకున్నట్లు పేర్కొన్నారు. ట్రెజరీస్ డీడీ విచారణ నిధుల గోల్మాల్ వ్యవహారంలో ట్రెజరీ ఉద్యోగుల పాత్రపై ట్రెజరీ జిల్లా స్ధాయి అధికారి డీడీ భోగారావు శుక్రవారం విచారణ జరిపారు. స్థానిక సబ్ ట్రెజరీలోని ఖాతాలను, సబ్ ట్రెజరీ ద్వారా బ్యాంక్‌లో జరిగిన లావాదేవీలను లోతుగా పరిశీలించారు. బ్యాంక్ మేనేజర్‌ను కలిసి ఖాతాలను పరిశీలించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ.. సబ్ ట్రెజరీ నిధుల్లో ఒక్క పైసా కూడా దుర్వినియోగం కాలేదని చెప్పారు. సబ్ ట్రెజరీ నిధులు, వోచర్లు సక్రమంగా ఉన్నాయన్నారు. ఆయన వెంట సబ్ ట్రెజరీ అధికారులు జగదీశ్వరి, సోమయాజులు, జహిరుద్దీన్ తదితరులున్నారు. -
8 క్వింటాళ్ల గంజాయి స్వాధీనం
పత్తిపాడు: అక్రమంగా తరలిస్తున్న ఎనిమిది క్వింటాళ్ల గంజాయిని పత్తిపాడు జాతీయరహదారివద్ద సోమవారం ఉదయం స్థానిక పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. గంజాయిని అక్రమంగా తరలిస్తున్నారనే ముందస్తు సమాచారం మేరకు స్థానిక పోలీసులు తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు జాతీయ రహదారిపై తనిఖీలు చేపట్టారు. రెండు బోలెరో వాహనాల్లో ఈ గంజాయిని తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. రెండు బోలెరో వాహనాలతో పాటు మరో ద్విచక్రవాహనాన్ని సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.