
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి వరుపుల రాజా (49) మృతి చెందారు. శనివారం ప్రత్తిపాడులో గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురైన రాజాను కాకినాడ అపోలో ఆస్పత్రికి తీసుకువచ్చారు.
ఈ క్రమంలో వైద్యులు ఆయనను ప్రాణాపాయం నుంచి రక్షించేందుకు సీపీఆర్ చేసినా ఫలితం లేకపోయింది. దీంతో రాత్రి 11 గంటలకు రాజా మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డీసీసీబీ చైర్మన్‌గా వరుపుల రాజా పనిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment