
సాక్షి, కాకినాడ: చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు మంత్రి సీదిరి అప్పలరాజు. కుప్పంలో దొంగ ఓట్లతోనే చంద్రబాబు గెలుస్తున్నాడని అన్నారు. చంద్రబాబు.. ఎన్టీఆర్ పేరుమీద స్పాన్సర్డ్ కార్యక్రమం పెట్టి బీజేపీ నేతలతో లాబీయింగ్ చేశాడు అని కామెంట్స్ చేశారు.
కాగా, మంత్రి సీదిరి అప్పలరాజు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘కుప్పంలోనే 30-40వేల బోగస్ ఓట్లు ఉన్నాయి. కుప్పంలో దొంగ ఓట్లు పోతాయనే బాబు మొసలికన్నీరు కారుస్తున్నాడు. చాలాసార్లు బీజేపీ అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడంతో ఎన్టీఆర్ పేరుమీద స్పాన్సర్డ్ కార్యక్రమం పెట్టి బీజేపీ నేతలతో లాబీయింగ్ చేశాడు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని ఎందుకు అడగలేదు?. ఎన్టీఆర్ బొమ్మతో ఓట్లు లబ్ధి పొందాలనేదే చంద్రబాబు తాపత్రయం. ఎన్టీఆర్‌కు ప్రత్యేక గుర్తింపు కావాలనే ఆలోచన బాబుకు లేదు. ఎన్టీఆర్ బొమ్మతో చంద్రబాబుకు రాజకీయాలు మాత్రమే కావాలి.
ఇదే సమయంలో విశాఖ మత్య్సకారుల సమస్యలపై కూడా మంత్రి సీదిరి అప్పలరాజు స్పందించారు. విశాఖలో మత్స్యకారుల సమస్య ఈనాటిది కాదు. గత ముప్పై ఏళ్ల కింద ఇచ్చిన హామీ అమలు కాలేదు. విశాఖ మత్స్యకారుల సమస్య పరిష్కారం కోసం కలెక్టర్‌తో మాట్లాడాను. మత్స్యకారులకు ఇళ్ల స్థలాలు నెరవేర్చేందుకు ప్రయత్నిస్తాం’ అని తెలిపారు.
ఇది కూడా చదవండి: బీజేపీ చీఫ్ పురంధేశ్వరిపై పోసాని సీరియస్ కామెంట్స్
Comments
Please login to add a commentAdd a comment