
శ్రీకాకుళం, సాక్షి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాక్షాత్తు దేవుడిని అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. తిరుమల ప్రసాదాన్ని అపవిత్రం చేసే విధంగా చంద్రబాబు మాట్లాడారని అన్నారు. ఆయన శనివారం మందసలోని వాసుదేవా పెరుమాళ్ళ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
‘‘తిరుమల ప్రసాదాన్ని అపవిత్రం చేసే విధంగా సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుకు త్వరలోనే బుద్ధి చెప్పాలని వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను. ఈరోజు దేవుని ప్రతిష్టను బజారుకు ఈడ్చే విధంగా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తిరుపతి లడ్డు ప్రసాదంపై చంద్రబాబు తప్పుగా మాట్లాడడం సమాజసం కాదు. ప్రతి పదార్థానికి పరీక్షలు చేసిన తర్వాతే టీటీడీ ప్రసాదంలో వాటిని వినియోగిస్తారు. ఇదే విషయాన్ని టీటీడీ ఈవో సైతం చెప్పారు’’ అని అన్నారు.
ఇది కూడా చదవండి: శ్రీవారి లడ్డూపై వివాదం.. బాబు పక్కా స్కెచ్‌తోనే..
Comments
Please login to add a commentAdd a comment