కాకినాడ శ్యామల అంటే తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ఆమె దాదాపుగా 200 సినిమాల్లో నటించింది. ఆమె తెలుగు, తమిళ భాషల్లో ఎక్కువగా నటించింది. నటిగా, నిర్మాతగా, ఫైనాన్షియర్‌గా కాకినాడ శ్యామల గుర్తింపు దక్కించుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె పలు ఆసక్తకర విషయాలను పంచుకున్నారు. సిల్క్ స్మిత జీవితంపై శ్యామల మాట్లాడారు.
కాకినాడ శ్యామల మాట్లాడుతూ..'నేను చాలా సినిమాలకు ఫైనాన్స్ చేశా. సిల్క్ స్మిత సొంత సినిమాకి కూడా డబ్బులిచ్చాను. అయితే ఆ సినిమా సరిగ్గా ఆడకపోవడం వల్ల సిల్క్ స్మిత అప్పులపాలైంది. ఒక్క సినిమాతోనే సిల్క్ స్మిత ఆస్తులన్నీ పొగొట్టుకుంది. ఆమె వ్యక్తిత్వం చాలా గొప్పది. తెరపై వేసే పాత్రలు వేరు .. బయట కనిపించే స్మిత వేరు. ఆమె నిజాయితీ ఉన్న మనిషి. ఆమెను హత్య చేశారని కొంతమంది అంటారు. ఆత్మహత్య చేసుకుందని మరికొందరు అంటారు. నిజానికి ఏం జరిగిందనేది ఆ పైవాడికి మాత్రమే తెలియాలి. కానీ ఆమె ఎందుకు చనిపోయిందో కారణాలు తెలియవు. అయినప్పటికీ సిల్క్‌స్మిత అందరికీ అప్పులు తిరిగి చెల్లించింది. ఆ తరువాత ఆమె కెరియర్ బాగానే సాగింది. అలాంటి సమయంలోనే ఆమె చనిపోయిందనే వార్త విన్నా. ' అని అన్నారు
Comments
Please login to add a commentAdd a comment