సాక్షి, కాకినాడ: ఏపీలో కూటమి సర్కార్ పాలన తీరుపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. ముఖ్యంగా మద్యం విషయంలో చాలా చోట్ల ప్రజల నుంచి నిరసన ఎదురవుతోంది. తాజాగా కాకినాడ జిల్లాలో మద్యంపై మహిళలు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. సర్కార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ షాపు నిర్మాణం చేపట్టిన చోట పునాదుల నుంచి రాళ్లను తొలగించారు.
కాకినాడ జిల్లాలోని తునిలో మద్యం మహిళలు అసహనం వ్యక్తం చేశారు. గ్రామంలో మద్యం షాపులు ఏర్పాటు చేస్తామంటే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. ఇదే క్రమంలో డి.పోలవరం గండిలో మద్యం షాపు నిర్మాణాన్ని మహిళలు అడ్డుకున్నారు. చంద్రబాబు సర్కార్‌పై ఆగ్రహంతో పునాదుల నుంచి రాళ్లను తొలగించారు. మళ్లీ నిర్మాణం చేపడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment