liquor shop closed
-
AP: మద్యంపై మహిళల పోరు.. పునాదులు తొలగించి..
సాక్షి, కాకినాడ: ఏపీలో కూటమి సర్కార్ పాలన తీరుపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. ముఖ్యంగా మద్యం విషయంలో చాలా చోట్ల ప్రజల నుంచి నిరసన ఎదురవుతోంది. తాజాగా కాకినాడ జిల్లాలో మద్యంపై మహిళలు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. సర్కార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ షాపు నిర్మాణం చేపట్టిన చోట పునాదుల నుంచి రాళ్లను తొలగించారు.కాకినాడ జిల్లాలోని తునిలో మద్యం మహిళలు అసహనం వ్యక్తం చేశారు. గ్రామంలో మద్యం షాపులు ఏర్పాటు చేస్తామంటే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. ఇదే క్రమంలో డి.పోలవరం గండిలో మద్యం షాపు నిర్మాణాన్ని మహిళలు అడ్డుకున్నారు. చంద్రబాబు సర్కార్‌పై ఆగ్రహంతో పునాదుల నుంచి రాళ్లను తొలగించారు. మళ్లీ నిర్మాణం చేపడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. -
11 నుంచి 13 వరకు మద్యం దుకాణాల బంద్
దొండపర్తి (విశాఖ దక్షిణ): ఉత్తరాంధ్ర జిల్లా పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికలు ఈ నెల 13వ తేదీన జరగనున్న దృష్ట్యా జిల్లాలో మూడు రోజుల పాటు అన్ని రకాల మద్యం దుకాణాలు మూసివేయడం జరుగుతుందని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ శ్రీనివాస్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున ఆదేశాల మేరకు ఈ నెల 11వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు ప్రభుత్వ మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు(స్టార్ హోటళ్లలో సైతం), టూరిజం బార్స్, నేవల్ క్యాంటీన్స్, కల్లు దుకాణాలు, మద్యం డిపోలు కూడా మూసివేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే ఓట్ల లెక్కింపు జరిగే 16వ తేదీన కౌంటింగ్ కేంద్రం పరిసర ప్రాంతాల్లో కూడా మద్యం దుకాణాలు తెరవడం జరగదన్నారు. -
మత్తు లేక మరోలోకం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మద్యం, కల్లు విక్రయాలు అప్పుడప్పుడూ నిలిపేస్తారు. కానీ వరుసగా ఇన్నాళ్ల పాటు అందుబాటులో లేకపోవడం ఇదే తొలిసారి. దీంతో వ్యసనాపరులు నానా అగచాట్లు పడుతున్నారు. లాక్డౌన్ అమల్లోకి వచ్చిన తర్వాత ఒకట్రెండు రోజులు అందుబాటులో ఉన్న మద్యం, కల్లును అధిక ధరలకు కొనుగోలు చేసి తాగారు. కానీ ఆ తర్వాత పూర్తిగా అం దుబాటులో లేకపోవడంతో 5–7 రోజుల్లో బయటపడే లక్షణాలు వారిని బాధపెడుతున్నాయి. దీంతో ఒక్క సోమవారమే ఎర్రగడ్డలోని మానసిక వైద్యశాలకు వంద మంది వరకు బాధితులు వచ్చారు. ముఖ్యంగా కల్లులో కలిపే క్లోరల్ హైడ్రేట్, చాక్లెట్ పౌడర్, యూరియా, అల్ప్రాజోలమ్, డైజోఫామ్‌లాంటివి వ్యసనపరుల నాడీ వ్యవస్థను పూర్తిగా దెబ్బతీస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఆల్కహాల్‌కు దీర్ఘకాలికంగా అలవాటుపడిన వారి మెదడులోని నాడీ కణాలు కూడా మత్తుకు అలవాటు పడి ఉం టాయని, సమయానికి ఆల్కహాల్ తీసుకోకపోతే అవి తీవ్రంగా స్పందిస్తాయని అంటున్నారు. వీటి ప్రభావంతోనే ఇప్పుడు మందు, కల్లుబాబులు చిందులు వేస్తున్నారని, మతి కోల్పోయి పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారని చెబుతున్నారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సమీక్ష రాష్ట్రంలోని మందుబాబుల విచిత్ర విన్యాసాలపై ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సమీక్ష నిర్వహించారు. వ్యసనానికి బానిస లై పిచ్చిగా ప్రవర్తిస్తున్న వారికి పీహెచ్‌సీల్లో చికిత్స చేయించాలని ఎక్సైజ్ అధికారులకు ఆదేశించారు. ఇటువంటి వారంతా యోగ, ధ్యానం, ఆటలు లాంటి వాటి ద్వారా ఉపశమనం పొందాలని సూచించారు. కల్లు లేక నలుగురు మృతి రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో వేర్వేరు ఘటనల్లో కల్లు లేక నలుగురు మృతిచెందారు. వికారాబా ద్ జిల్లా బూర్గుపల్లి నివాసి చాకలి రాచ య్య(45) ఆదివారం అర్ధరాత్రి బావి లో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎక్‌మామిడికి చెందిన గొర్రె వెంకటమ్మ (50) రెండు రోజుల క్రితం కల్లు లేక సొమ్మసిల్లి పడిపోయింది. తలకు గాయాలై ఆదివారం రాత్రి మృతిచెందింది. మరో ఘటనలో కర్ణాటకకు చెం దిన మహ్మద్ అలీ(50).. నగరం నుంచి స్వస్థలానికి వెళ్తూ.. పరిగి మండలం లక్ష్మిదేవిపల్లిలో మృతిచెందాడు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం కొడిచెర్లకిS చెందిన చింతకింది లక్ష్మయ్య(39) కొన్ని రోజులుగా కల్లు దొరకకపోవడంతో పిచ్చిగా ప్రవర్తించాడు. సోమవారం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను పట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. -
‘లాక్’తో ‘కిక్’కు షాక్
ఆదాయపుపన్ను బకాయి పడ్డ ఏపీబీసీఎల్ మద్యం డిపోలకు తాళం వేసిన ఐటీ శాఖ ‘చుక్క’కు కొరత, ధర పెంపుతో నిషాబాబుల ఇక్కట్లు అమలాపురం : ‘తుంటి మీద కొడితే మూతి పళ్లు రాలినట్టు’ ఆంధ్రప్రదేశ్ బేవరేజస్ కార్పోరేషన్ లిమిటెడ్ (ఏపీ బీసీఎల్) ఆదాయపు పన్ను చెల్లించకపోవడం మద్యపాన ప్రియులకు ‘చుక్క’ కరువయ్యే స్థితిని తెచ్చి పెట్టింది. జిల్లాలో మూడు మద్యం గొడౌన్లకు సంబంధించి ఆ కార్పొరేషన్ దాదాపు రూ.450 కోట్ల మేర ఆదాయపు పన్నుల శాఖ బకాయి పడిందని సమాచారం. కోట్లాదిరూపాయల ఆదాయం పొందుతున్న ఏపీబీసీఎల్ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో సంస్థ అయినా సకాలంలో పన్ను చెల్లించకపోవడంతో ఇన్‌కం ట్యాక్స్ శాఖ నోటీసుల మీద నోటీసులు జారీ చేసింది. అయినా స్పందన లేకపోవడంతో ఏపీబీసీఎల్ డిపోలకు తాళాలు వేయాలని నిర్ణయించింది. ఫలితంగా సామర్లకోట, రాజమండ్రి, అమలాపురం డిపోలకు తాళాలు పడడంతో మద్యం దుకాణాలకు సరఫరా నిలిచిపోయింది. డిపోలకు తాళాలు వేసి ఆరు రోజులు కావస్తుండడంతో షాపుల్లో డిమాండ్ మేరకు మద్యం లేకుండా పోయింది. జిల్లాలోని సుమారు 542 మద్యం షాపులకు ఈ డిపోల ద్వారానే మద్యం అందుతుంది. జిల్లావ్యాప్తంగా సగటున రోజుకు రూ.మూడు, నాలుగు కోట్ల విలువచేసే మద్యం సరఫరా అవుతుంటుంది. సరఫరా నిలిచిపోవడం, ఉన్న మద్యం నిల్వలు అయిపోవడంతో దుకాణదారులు తలలు పట్టుకుంటున్నారు. కోరుకున్న చుక్క పడక మద్యం ప్రియులు అల్లాడిపోతున్నారు. ప్రధానంగా చీప్ లిక్కరుతోపాటు మీడియం క్వాలిటీ మద్యం దొరకడం గగనమైంది. చీప్‌లిక్కర్‌తో పాటు బ్రాండ్ మద్యం షాపుల్లో అత్యధికంగా అమ్ముడుపోతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లోని స్లమ్ ఏరియాల్లో చీప్ లిక్కర్ అమ్మకాలు జోరుగా సాగుతుంటాయి. మొత్తం అమ్మకాల్లో ఇవి 70 శాతం పైనేనని అంచనా. వీటి సరఫరా లేకపోవడంతో మద్యం దుకాణాల వద్ద అమ్మకాలు అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. ఎంఆర్పీని మించి గుంజుతున్న షాపులు డిపోలకు తాళాలు పడతాయని ముందుగా గుర్తించిన పట్టణ ప్రాంతాల మద్యం దుకాణదారులు కొంత వరకు సరుకు నిల్వ చేశారు. గ్రామాల్లో ఆ పరిస్థితి లేదు. 20 నుంచి 30 రోజులకు సరిడా మద్యాన్ని ముందుగానే తెచ్చుకుని నిల్వ చేసుకుంటారు. ఇటువంటి వారు డిపోలకు తాళాలు పడే ముందు అవసరమైన నిల్వలను ఉంచుకోలేకపోయారు. దీనితో ఇప్పుడు మద్యానికి కొరత ఏర్పడింది. ఇదే మంచి సమయంగా భావించి నిల్వ చేసిన మద్యం దుకాణదారులు చీప్ లిక్కర్, మీడియం బ్రాండ్ మద్యాన్ని ఎంఆర్పీకంటే ఎక్కువకు అమ్ముతూ మద్యం ప్రియుల జేబులు గుల్ల చేస్తున్నారు. వచ్చి పడుతున్న ‘యూనాం సరుకు’ జిల్లాలో చీప్ లిక్కర్, మీడియం బ్రాండ్ మద్యం అందుబాటులో లేకపోవడంతో ఇదే అదనుగా పుదుచ్చేరి పరిధిలోని యానాం నుంచి మద్యం అక్రమ రవాణాకు కొందరు తెరదీశారు.మన ప్రాంతంలో ఎంఆర్పీకి మద్యం అమ్మకాలు ఆరంభించిన తరువాత ధరల్లో పెద్దగా వ్యత్యాసం లేనందున యూనాం నుంచి అక్రమ రవాణా చాలా వరకు తగ్గింది. ఇప్పుడు మద్యం అందుబాటులో లేకపోడంతో యానాం నుంచి జిల్లాలోని పలు ప్రాంతాలకు అక్రమంగా రవాణా అవుతోంది. సరుకు లేక అమ్మకాలు దాదాపుగా నిలిచపోవడంతో గ్రామీణ ప్రాంతాల బెల్ట్ షాపుదారులు అక్రమ రవాణాకు తెరదీశారు. తాళాలు పడ్డ డిపోలు మరో రెండు రోజుల పాటు తెరుచుకునే అవకాశం లేకపోవడంతో మద్యప్రియులకు అప్పటి వరకూ గడ్డుకాలమే.