
దొండపర్తి (విశాఖ దక్షిణ): ఉత్తరాంధ్ర జిల్లా పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికలు ఈ నెల 13వ తేదీన జరగనున్న దృష్ట్యా జిల్లాలో మూడు రోజుల పాటు అన్ని రకాల మద్యం దుకాణాలు మూసివేయడం జరుగుతుందని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ శ్రీనివాస్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున ఆదేశాల మేరకు ఈ నెల 11వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు ప్రభుత్వ మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు(స్టార్ హోటళ్లలో సైతం), టూరిజం బార్స్, నేవల్ క్యాంటీన్స్, కల్లు దుకాణాలు, మద్యం డిపోలు కూడా మూసివేస్తున్నట్లు వెల్లడించారు.
అలాగే ఓట్ల లెక్కింపు జరిగే 16వ తేదీన కౌంటింగ్ కేంద్రం పరిసర ప్రాంతాల్లో కూడా మద్యం దుకాణాలు తెరవడం జరగదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment