సాక్షి,విశాఖపట్నం:తూర్పుమధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ‘దానా’ తుపాన్ గురువారానికి(అక్టోబర్ 24) బలపడి తీవ్ర తుపాన్‌గా మారుతుందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి కేవీఎస్ శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతానికి పారాదీప్‌కు 520 కిలోమీటర్ల దూరంలో తుపాన్ కేంద్రీకృతమై ఉందన్నారు.‘ తుపాన్ గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాములోపు తీరం దాటే అవకాశం ఉంది.
పూరీ-సాగర్ ద్వీపం మధ్య సమీపంలో తీరం దాటనుంది. గంటకు 15 కిలోమీటర్ల వేగంతో తుపాను కదులుతోంది. దీని ప్రభావంతో ఉమ్మడి శ్రీకాకుళం,విజయనగరం జిల్లాలోని తీర ప్రాంతం వెంబడి బలమైన ఈదురుగాలులు వీయనున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో శుక్రవారం భారీ వర్షాలు కురుస్తాయి. బుధ,గురు వారాల్లో సముద్రం అలజడిగా ఉంటుంది. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదు. అన్ని పోర్టులలో రెండో నెంబర్ హెచ్చరిక జారీ చేశాం’అని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: దానా తుపాన్ టెన్షన్
Comments
Please login to add a commentAdd a comment