
సాక్షి, అమరావతి: పింఛన్ల పంపిణీలో అర్హులకు ఏ చిన్న ఇబ్బందీ కలగకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. లబ్ధిదారులు సొంత ఊరిలో కాకుండా గత ఆరు నెలలుగా మన రాష్ట్రంలోనే మరో చోట నివాసం ఉంటుంటే.. తాము ఉన్న చోటనే పింఛన్ పొందేందుకు వీలు కల్పించింది.
ఇందుకోసం తాము నివాసం ఉంటున్న పరిధిలోని గ్రామ, వార్డు సచివాలయంలో పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) సీఈవో ఇంతియాజ్ అన్ని జిల్లా డీఆర్‌డీఏ పీడీలకు బుధవారం ఆదేశాలిచ్చారు. సొంత ఊరు వదిలి కనీసం ఆరు నెలలు అయితేనే ఇలా ఉపయోగించుకునేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
(చదవండి: ఇక సోలార్ వాటర్ ఏటీఎంలు)
Comments
Please login to add a commentAdd a comment