Pension Schemes
-
చంద్రబాబు డబల్ గేమ్.. మరోసారి మోసపోయిన ఉద్యోగులు
-
YS Jagan: కేంద్రంలోనూ జీపీఎస్..
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జాతీయ పెన్షన్ స్కీం (కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం–సీపీఎస్) విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రభుత్వం అనుసరించిన విధానం వైపే కేంద్ర ప్రభుత్వం కూడా అడుగుల వేస్తోంది. 2004 నుంచి అమల్లోకి వచి్చన జాతీయ పెన్షన్ స్కీం ద్వారా ఉద్యోగులు రిటైరయ్యాక వారికి పెన్షన్ చాలా తక్కువగా వస్తోందని, పాత పెన్షన్ స్కీంను అమలుచేయాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వివిధ రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.నిజానికి.. 2004లో తీసుకొచి్చన సీపీఎస్ ప్రకారం.. ఉద్యోగులు పది శాతం, ప్రభుత్వాలు పది శాతం పెన్షన్ నిధికి జమచేస్తాయి. మార్కెట్ అధారిత రిటర్న్‌ల ప్రకారం ఆ నిధి నుంచి ఉద్యోగులు పదవీ విరమణ అనంతరం పెన్షన్ వస్తుంది. మార్కెట్లపై ఆధారపడటంతో ఇంత పెన్షన్ వస్తుందనే గ్యారెంటీ లేదు. కొందరు ఉద్యోగులకు పదవీ విరమణ అనంతరం బేసిక్ వేతనంలో కనీసం 20 శాతం కూడా పెన్షన్ వచ్చే పరిస్థితిలేదు. ఈ నేపథ్యంలో.. 2019 ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల డిమాండ్ మేరకు సీపీఎస్‌ను రద్దుచేస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.అయితే, సీపీఎస్ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అయినందున దీనిపై జగన్ ముఖ్యమంత్రి అయ్యాక సుదీర్ఘ కసరత్తు చేశారు. 2004కు ముందు ఉద్యోగంలో చేరిన వారికి పాత పెన్షన్ విధానంలో పదవీ విరమణ తర్వాత ఎక్కువ పెన్షన్ రావడం.. 2004 తర్వాత ఉద్యోగంలో చేరిన వారికి చాలా తక్కువ పెన్షన్ రావడం వంటి అసమానతలు నెలకొన్నాయి. అలాగని, సీపీఎస్ రద్దుచేసి పాత పెన్షన్ విదానంలోకి వెళ్తే రాష్ట్రాల ఆరి్థక వ్యవస్థలపై భవిష్యత్తులో పెనుభారం పడటమే కాకుండా జీతాలు, పెన్షన్లు చెల్లించలేని పరిస్థితి నెలకొంటుందని ఆర్బీఐ వంటి సంస్థల అధ్యయనాలు పేర్కొన్నాయి.ఈ నేపథ్యంలో.. సీపీఎస్ ఉద్యోగులకు మేలు చేయాలనే తపనతో జగన్ సర్కారు సుదీర్ఘ కసరత్తు చేసింది. రిటైర్డ్ ఉద్యోగుల జీవన ప్రమాణాలను కూడా నిలబెట్టేలా గ్యారెంటీ పెన్షన్ స్కీం (జీపీఎస్‌ను)ను రూపొందించింది. దీని ప్రకారం.. బేసిక్ జీతంలో 50 శాతం అంటే రూ.1 లక్ష జీతం ఉంటే రిటైరైన తర్వాత రూ.50 వేలు పెన్షన్‌గా వస్తుంది. 62 ఏళ్లకు రిటైరైతే 82 ఏళ్లలో కూడా అదే స్థాయిలో జీవన ప్రమాణాలు ఉండాలన్న ఆలోచనతో ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని డీఆర్లు ఇచ్చేలా జీపీఎస్‌లో పొందుపరిచారు.సీపీఎస్‌లో మార్పులకు కేంద్రం కమిటీ.. ఇదిలా ఉంటే.. కేంద్ర ప్రభుత్వోద్యోగుల డిమాండ్ నేపథ్యంలో జాతీయ పెన్షన్ స్కీం విధానంలో మార్పులు చేయడానికి కేంద్ర ఆరి్థక శాఖ కార్యదర్శి నేతృత్వంలో కమిటీనీ ఏర్పాటుచేసింది. ఉద్యోగులు, ప్రభుత్వం తమతమ కంట్రిబ్యూషన్‌ను కొనసాగిస్తూనే 2004 తర్వాత చేరిన ఉద్యోగులకు పదవీ విరమణ అనంతరం మరింత మెరుగైన పెన్షన్ వచ్చేలా మార్గాలను కేంద్ర కమిటీ అన్వేíÙంచింది. ఇందుకు సంబంధించిన సిఫార్సులతో ఇటీవల కేంద్రానికి ఆ కమిటీ నివేదిక సమరి్పంచినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ కమిటీ కూడా జగన్ సర్కారు తీసుకొచ్చిన జీపీఎస్‌లోని అంశాలనే సిఫార్సు చేసిందని, ఇది దేశానికే ఆదర్శంగా నిలిచిందని అధికార వర్గాలు చెబుతున్నాయి.ఇక అప్పట్లో ఉద్యోగ సంఘాలతో జరిగిన సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో దేశమే ఈ పెన్షన్ స్కీంను అమలుచేసే పరిస్థితి రాబోతుందని చెప్పారు. ఇప్పుడు అక్షరాలా అదే నిజమవుతోంది. జగన్ సర్కార్ చేసిన మార్పులివే.. 2004 పెన్షన్ సంస్కరణలను కాపాడుతూనే వైఎస్ జగన్ సర్కార్ జాతీయ పెన్షన్ స్కీంలో మార్పులు చేస్తూ జీపీఎస్‌ను తీసుకొచ్చింది. – ఇటు రాష్ట్రంపై ఆర్థిక భారం పెద్దగా పడకుండా ఉద్యోగులు పదవీ విరమణ అనంతరం చివరి నెల బేసిక్ వేతనంలో 50 శాతం పెన్షన్ గ్యారెంటీని జగన్ సర్కారు ఇచ్చింది. – తద్వారా ఏపీజీపీఎస్లో ఉద్యోగులు రిటైరయ్యాక చివరి నెలలో డ్రా చేసిన మూల వేతనంలో 50 శాతం పెన్షన్‌కు గ్యారెంటీ ఇస్తోంది. – అలాగే, ఉద్యోగి మరణిస్తే జీవిత భాగస్వామికి హమీ ఇచ్చిన పెన్షన్‌లో 60 శాతం పెన్షన్ వస్తుంది.– ద్రవ్యోల్బణం ప్రకారం డీఆర్ వస్తుంది. – అంతేకాక.. ఉద్యోగులకు హెల్త్ స్కీం వర్తిస్తుంది. -
రూ.10 లక్షల కోట్లకు పింఛను నిధులు
న్యూఢిల్లీ: పింఛను పధకాల నిర్వహణ ఆస్తుల విలువ ఈ ఏడాది సెప్టెంబర్ చివరికి రూ.10 లక్షల కోట్ల మైలురాయిని చేరుకోనున్నట్టు పింఛను నిధి నియంత్రణ, అభివృద్ధి సంస్థ చైర్మన్ దీపక్ మహంతి తెలిపారు. చందాదారుల నుంచి క్రమం తప్పకుండా వస్తున్న చందాల వల్లే ఈ వృద్ధి సాధ్యమని చెప్పారు. తాజా గణాంకాల ప్రకారం పీఎఫ్ఆర్డీఏ నిర్వహణలోని నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్), అటల్ పెన్షన్ యోజన (ఏపీవై), ఎన్పీఎస్ లైట్ పథకాల పరిధిలోని ఆస్తుల విలువ (ఏయూఎం) రూ.9.58 లక్షల కోట్లకు చేరుకుంది. ‘‘రూ.9.5 లక్షల కోట్ల ఏయూఎంను చేరుకున్నాం. ఈ ఆర్థిక సంవత్సరం మధ్య భాగానికి ఏయూఎం రూ.10 లక్షలు చేరుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒక్క ఎన్పీఎస్ నిర్వహణ నిధి రూ.10 లక్షల కోట్లు దాటుతుంది’’అని తెలిపారు. నిధులపై వచ్చే రాబడులు, మార్కెట్ పనితీరు ఏయూఎంను ప్రభావితం చేస్తాయన్నారు. ఈక్విటీ, కొన్ని రకాల డెట్ ఆస్తుల రాబడులు మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా చలిస్తుండడం తెలిసిందే. పింఛను పథకాల మొత్తం ఏయూఎం రూ.9.58 లక్షల కోట్లలో ఒక్క ఎన్పీఎస్ నిర్వహణ ఆస్తుల విలువే రూ.9.29 లక్షల కోట్లకు చేరినట్టు మహంతి తెలిపారు. ఏపీవై నిధులు రూ.28,538 కోట్లుగా ఉన్నట్టు చెప్పారు. విస్తరణకు చర్యలు ఎన్పీఎస్ కింద ప్రభుత్వ ఉద్యోగులతోపాటు ప్రైవేటు ఉద్యోగులు, వ్యక్తుల పింఛను నిధులు కూడా ఉన్నట్టు మహంతి తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల పింఛను చందాలు వాటంతట అవే వస్తుంటాయని చెబుతూ.. ప్రైవేటు వ్యక్తుల నుంచి ఇవి వృద్ధి చెందాల్సి ఉందన్నారు. ఇందుకోసం పీఎఫ్ఆర్డీఏ ఎన్నో చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ఏజెంట్లను అనుమతించామని, కార్పొరేట్ ఉద్యోగులు ఎన్పీఎస్ను తీసుకునే విధంగా ప్రోత్సాహక చర్యలు అమలు చేస్తున్నట్టు తెలిపారు. డిజిటల్‌గా ఈ–ఎన్పీఎస్ ఖాతాను తెరిచి, చందాలు చెల్లించే అవకాశం కల్పించినట్టు పేర్కొన్నారు. దీనివల్ల మధ్యవర్తుల ప్రమేయం ఉండదన్నారు. ఎన్పీఎస్ చందాదారుల సంఖ్య గతేడాదే 1.20 కోట్లకు చేరినట్టు తెలిపారు. ఈ ఏడాది చందాదారుల సంఖ్యను 1.3 కోట్లకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు పేర్కొన్నారు. ఇక ఏపీవై చందాదారుల సంఖ్య 5.2 కోట్లుగా ఉందని, ఇది చాలా గణనీయమైనదన్నారు. -
AP: ప్రజాప్రభుత్వ చిత్తశుద్ధికి తార్కాణం ఇది!
సాక్షి, తాడేపల్లి: అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు ఏ ఆటంకం లేకుండా అందాలనేది జగనన్న ప్రభుత్వ ఉద్దేశం. ఆ ఉద్దేశానికి తగ్గట్లే మేనిఫెస్టోను ప్రకటించి.. ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ పోతున్నారు సీఎం వైఎస్ జగన్. కులం, మతం, పార్టీ, ప్రాంతం.. లేకుండా అవినీతి, పక్షపాతానికి తావు లేకుండా పారదర్శకంగా.. నేరుగా లబ్ధిదారుల వద్దకే చేరుతున్నాయి కూడా. ఈ తరుణంలో.. రాష్ట్రంలోని వయోవృద్ధులకు, అర్హులైన ఇతరులకు వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద.. నెలవారీ ఫించన్లను అందజేస్తోంది వైఎస్సార్సీపీ ప్రభుత్వం. ప్రతి నెల ప్రారంభంలో గ్రామ వలంటీర్లు స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్‌ను దగ్గరుండి అందజేస్తున్నారు. ఇక సెప్టెంబర్ 2022 నెలకు సంబంధించిన ఫించన్‌ను అక్టోబర్ 1వ తేదీ నుంచి పంపిణీ చేయబోతున్నారు వలంటీర్లు. ఆ నగదు అక్షరాల 1,590.50 కోట్ల రూపాయలు. సుమారు 62.53 లక్షల మంది ఫించన్‌దారులకు ఈ నగదు పంచబోతున్నారు వలంటీర్లు. అయితే గత ఏడేళ్లలో సెప్టెంబర్ నెల గణాంకాలను ఓసారి పరిశీలిస్తే.. సెప్టెంబర్ 2022 - రూ.1,590.50 కోట్లు సెప్టెంబర్ 2021 - రూ.1,397 కోట్లు సెప్టెంబర్ 2020 - రూ.1,429 కోట్లు సెప్టెంబర్ 2019 - రూ.1,235 కోట్లు సెప్టెంబర్ 2018 - రూ. 477 కోట్లు సెప్టెంబర్ 2017 - రూ. 418 కోట్లు సెప్టెంబర్ 2016 - రూ. 396 కోట్లు సెప్టెంబర్ 2015 - రూ. 405 కోట్లు.. ఇలా గత ప్రభుత్వం మధ్యలో కోత ద్వారా పెన్షన్‌ను తగ్గించుకునే ప్రయత్నం చేస్తే.. అధికారంలోకి రాగానే అర్హులైన వాళ్లందరినీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం గుర్తించింది . అంతేకాదు లబ్ధిదారులకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా వేల కోట్ల రూపాయలను సకాలంలో అందజేస్తూ తన చిత్తశుద్ధిని ప్రదర్శిస్తోంది జగనన్న ప్రభుత్వం. -
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం: 6 నెలలు ఎక్కడ ఉంటే అక్కడే పింఛన్
సాక్షి, అమరావతి: పింఛన్ల పంపిణీలో అర్హులకు ఏ చిన్న ఇబ్బందీ కలగకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. లబ్ధిదారులు సొంత ఊరిలో కాకుండా గత ఆరు నెలలుగా మన రాష్ట్రంలోనే మరో చోట నివాసం ఉంటుంటే.. తాము ఉన్న చోటనే పింఛన్ పొందేందుకు వీలు కల్పించింది. ఇందుకోసం తాము నివాసం ఉంటున్న పరిధిలోని గ్రామ, వార్డు సచివాలయంలో పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) సీఈవో ఇంతియాజ్ అన్ని జిల్లా డీఆర్డీఏ పీడీలకు బుధవారం ఆదేశాలిచ్చారు. సొంత ఊరు వదిలి కనీసం ఆరు నెలలు అయితేనే ఇలా ఉపయోగించుకునేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. (చదవండి: ఇక సోలార్ వాటర్ ఏటీఎంలు) -
TS: పాత పింఛను సాధనే ధ్యేయం
సాక్షి, హైదరాబాద్: భాగస్వామ్య పింఛను పథకం రద్దు, పాత పింఛను పథకం పునరుద్దరణ సాధనే తమ ధ్యేయమని తెలంగాణ కాంట్రిబ్యుటరీ పెన్షన్ స్కీమ్ టీచర్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (సీపీఎస్టీఈఏటీఎస్) రాష్ట్ర ప్రచార కార్యదర్శి మాచన రఘునందన్ అన్నారు. ఆయన బుధవారం జలసౌధలో సీపీఎస్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర వ్యాప్తంగానే గాక దేశ వ్యాప్తంగా కూడా పాత పింఛను పథకం సాధన కోసం ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ప్రత్యక్ష, పరోక్ష కార్యాచరణకు పూనుకున్నాయని తెలిపారు. చదవండి: సారథి కావలెను: టీఆర్ఎస్ అధిష్టానం రహస్య సర్వే! సీపీఎస్‌ను రద్దు చేస్తామని ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలకు ఎప్పటికప్పుడు హామీ ఇవ్వడం అధికార వర్గాలకు పరిపాటిగా మారిందని అన్నారు. సంఘం రాష్ట్ర సహా అధ్యక్షులు వారణాశి రామ కృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్ర అధ్యక్షులు దాముక కమలాకర్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ఉద్యోగులు నల్ల రిబ్బన్లతో నిరసన తెలిపారు. -
‘జగన్‌కు ఓటేస్తే జీవితాంతం పెన్షన్’
సాక్షి, పశ్చిమగోదావరి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు నలభయ్యేళ్ల వైఎస్ జగన్ ఆలోచనల్ని కాపీ కొడుతున్నారని ఎద్దేవా చేశారు. ‘పరీక్షల్లో కాపీ కొట్టిన విద్యార్థిని డీబార్ చేస్తుంటారు. మరి వైఎస్సార్సీపీ హామీలను కాపీ కొట్టిన చంద్రబాబును ఏం చేయాలి’ అని ప్రశ్నించారు. నల్లజర్ల మండలంలోని తెలికిచెర్ల గ్రామంలో మంగళవారం జరిగిన ‘నిన్ను నమ్మం బాబు’ కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. చంద్రబాబు ఎక్స్పైర్ అయిన టాబ్లెట్ లాంటివారని రోజా వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్ అప్డేటెడ్ వెర్షన్ అయితే బాబు ఔట్ డేటెడ్ వెర్షన్ అని అన్నారు. గత ఎన్నికల సమయంలో బాబు వస్తే జాబు అని హామిలిచ్చిన చంద్రబాబు.. తన కొడుక్కి మాత్రమే మంత్రి పదవి తెప్పించుకున్నారని విమర్శించారు. ‘పెంచిన పెన్షన్ 2వేల రూపాయలను బాబు రెండు నెలలు మాత్రమే ఇస్తారు. అదే వైఎస్ జగన్‌కు ఓటువేస్తే జీవితాంతం ఇస్తారు’ అని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ సమన్వయకర్త తలారి వెంకట్రావు పాల్గొన్నారు. -
పెన్షన్ కోసం... మీ ‘ప్లాన్’ ఏంటి?
ఒకప్పటి పరిస్థితి ఇప్పుడు లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా పెన్షన్ లేక ఎన్‌పీఎస్‌లో (జాతీయ పెన్షన్ విధానం) చేరి... దాన్నుంచి పెన్షన్ అందుకునే పరిస్థితి ఉంది. ఇక ప్రయివేటు ఉద్యోగులో..? ఏదో కొద్ది మందికి ఆయా సంస్థలు సొంత ట్రస్టుల్ని పెట్టుకుని పెన్షన్ ఇస్తున్నాయి తప్ప 90 శాతానికిపైగా ఇలాంటి సౌకర్యం లేనివారే. ఇక స్వయం ఉపాధి పొందుతున్న వారి గురించి చెప్పనే అక్కర్లేదు. మరి వీళ్లందరికీ రిటైరయ్యాక కూడా స్థిరంగా నెలనెలా కొంత ఆదాయం వచ్చేదెలా? ఇదిగో... దీనికోసం ఉద్దేశించినవే పెన్షన్ పథకాలు. వీటిలో బీమా పెన్షన్ పథకాలకు మొదట్లో బాగా ఆదరణ ఉండేది కానీ... మధ్యలో ఎవ్వరూ వీటివైపు చూడటం మానేశారు. కాకపోతే, ఐఆర్డీఏ బీమా ఉత్పత్తుల విషయంలో చేపట్టదలిచిన తాజా సంస్కరణలు ఆచరణలోకి వస్తే గనక ఇవి మళ్లీ మునుపటిలా ఆకర్షణీయంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. యూనిట్ ఆధారిత పెన్షన్ ప్లాన్లను (యూఎల్‌పీపీ) మరింత సౌకర్యంగా, జాతీయ పెన్షన్ పథకానికి (ఎన్పీఎస్) దీటుగా ఉండేలా ఐఆర్డీఏ కీలక మార్పులను ప్రతిపాదించింది. అయినప్పటికీ యులిప్ పెన్షన్ ప్లాన్లతో పోలిస్తే ఎన్పీఎస్ చాలా చౌక. ఇందులో చార్జీలు చాలా తక్కువ కూడా!!. – సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం యూనిట్ ఆధారిత బీమా పథకాల (యులిప్) గురించి చాలా మందికి తెలుసు. యూఎల్పీపీల పనితీరు కూడా వాటి మాదిరే ఉంటుంది. కాకపోతే వీటిల్లో బీమా ఉండదు. ఏ ఫండ్స్‌లో పెట్టబడులు పెట్టాలన్నది ఇన్వెస్టర్ల ఇష్టానికే పరిమితం. ఇక యులిప్‌లు, యూఎల్‌పీపీలు రెండింటిలోనూ ఐదేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. పెన్షన్ ప్లాన్లు కాబట్టి తొలి నాళ్లలోనే పెట్టుబడులను వెనక్కి తీసుకోకుండా చూడటమే ఈ లాకిన్ పీరియడ్ ఉద్దేశం. యూఎల్పీపీలో పాక్షిక ఉపసంహరణలకు అవకాశం లేదు. పాలసీ కాల వ్యవధి ముగియకముందే పెట్టుబడులను నగదుగా మార్చుకోవాలనుకుంటే మూడింట ఒకవంతు మాత్రమే తీసుకోవడానికి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని యాన్యుటీ ప్లాన్‌లో (ప్రతి నెలా పెన్షన్ చెల్లించే ప్లాన్) పెట్టాల్సి ఉంటుంది. లేదా సింగిల్ ప్రీమియం పెన్షన్ పాలసీ కొనుగోలుకు వినియోగించుకోవచ్చు. కాల వ్యవధి ముగిశాక కూడా, మూడింట ఒకవంతు మాత్రమే తీసుకోవడానికి ఉంటుంది. మిగిలింది యాన్యుటీగా మార్చుకోక తప్పదు. ఎన్పీఎస్... ఇపుడు మారింది ‘‘ఎన్పీఎస్ పథకంలో రూ.50,000 పెట్టుబడులపై సెక్షన్ 80సీకి అదనంగా పన్ను మినహాయింపు పొందొచ్చు. అంతేకాదు! రిటైర్మెంట్ సమయంలో వెనక్కి తీసుకునే 60 శాతం నిధులపైనా తాజాగా పన్నును తొలగించారు’’అని హెచ్డీఎఫ్సీ పెన్షన్ మేనేజ్మెంట్ సీఈవో సుమీత్ శుక్లా చెప్పారు. ఎన్‌పీఎస్‌లో ఏటా కనీస మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టడం తప్పనిసరి. అలాగే, 60 ఏళ్లు రాక ముందే తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవాలనుకుంటే అందుకు అవకాశం లేదు. చాలా ప్రత్యేకమైన సందర్భాల్లోనే అందుకు అవకాశం కల్పిస్తారు. పిల్లల విద్య, వివాహం, ఇల్లు కొనుగోలు లేదా తీవ్రమైన అనారోగ్యం ఎదురైతే చికిత్స అవసరాల కోసం ఎన్పీఎస్ నిధిలో 25 శాతాన్ని ఉపసంహరించుకోవచ్చు. మొత్తం ఎన్పీఎస్ కాల వ్యవధిలోపు మూడు సార్లు పాక్షిక ఉపసంహరణలకు అవకాశం ఇస్తారు. ఒకవేళ 60 ఏళ్లు నిండకముందే ఎన్పీఎస్ నుంచి వైదొలగాలనుకుంటే అప్పటి వరకు ఉన్న మొత్తం నిధుల్లో కేవలం 10 శాతమే చేతికి వస్తాయి. మిగిలిన 90 శాతాన్ని యాన్యుటీ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఎన్‌పీఎస్‌లో చేరిన వారు 60 ఏళ్ల వయసుకు వచ్చాక మొత్తం నిధిలో 60 శాతాన్ని తీసేసుకుని మిగిలిన 40 శాతాన్ని యాన్యుటీ ప్లాన్‌లో పెడితే సరిపోతుంది. అదే యూఎల్‌పీపీల్లో అయితే మొత్తం నిధిలో మూడింట ఒక వంతు అంటే 33.33 శాతమే తీసుకుని, మిగిలిన 66 శాతాన్ని యాన్యుటీ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఎన్పీఎస్ మాదిరే, యూఎల్పీపీల్లోనూ కాల వ్యవధి తీరిన తర్వాత 60 శాతాన్ని వెనక్కి తీసుకునేందుకు, కాల వ్యవధిలోపు పాక్షిక ఉపసంహరణలకు అవకాశం కల్పించే ప్రతిపాదనలను ఐఆర్డీఏ తాజా ముసాయిదా నిబంధనల్లో ఉన్నాయి. ఇవి అమలైతే ఈ విషయాల్లోనూ యూఎల్‌పీపీలు ఎన్పీఎస్కు ఏ మాత్రం తీసిపోవు. పెట్టుబడుల తీరు ఇలా... యూఎల్‌పీపీలు ప్రస్తుతానికి పూర్తి ఈక్విటీ ఫండ్స్‌ను ఆఫర్ చేయడం లేదు. ఎన్‌పీఎస్‌లో మాత్రం 75 శాతం వరకు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసుకునేందుకు వీలుంది. అయితే, ఈ రెండు రకాల ఉత్పాదనల్లోనూ పరిమితులున్నాయి. ‘‘ఐఆర్డీఏ తన ముసాయిదా నిబంధల్లో మెచ్యూరిటీపై గ్యారంటీని ఐచ్ఛికం చేసింది. దీంతో కస్టమర్లు దీర్ఘకాలంలో తగినంత నిధిని సమకూర్చుకునేందుకు గాను అగ్రెస్సివ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం లభిస్తుంది’’ అని మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ మార్కెటింగ్ డైరెక్టర్ మాణిక్నాంజియా తెలిపారు. ఎన్‌పీఎస్‌లోనూ గతంలో ఈక్విటీల్లో గరిష్ట పరిమితి 50 శాతమే ఉండేది. జీఎన్ బాజ్‌పాయి కమిటీ ఈక్విటీల్లో 100 శాతం ఇన్వెస్ట్‌మెంట్‌కు సిఫారసు చేయగా, ఆ తర్వాత ఎన్‌పీఎస్‌లో ఈక్విటీ పరిమితిని 75 శాతానికి పెంచారు. ఫండ్స్ కంటే ఎన్పీఎస్ మెరుగే... ప్రస్తుతం ఎన్పీఎస్ పథకంలో రిటైర్మెంట్ సమయానికి మొత్తం నిధిలో 60 శాతాన్ని వెనక్కి తీసుకోవచ్చు. ఇందులో 20 శాతంపై పన్ను పడుతోంది. ఇకపై పూర్తి 60 శాతానికి పన్ను మినహాయింపు కల్పించారు. ఇప్పటికే ఎన్‌పీఎస్‌లో పెట్టుబడులకూ పన్ను మినహాయింపు ఉంది. దీంతో ఈపీఎఫ్, పీపీఎఫ్ మాదిరే ఎన్పీఎస్కూ మూడు దశల్లోనూ పన్ను మినహాయింపు లభించింది. మొత్తంగా మ్యూచువల్ ఫండ్స్‌తో పోలిస్తే ఎన్పీఎస్ మెరుగైనది. ఎందుకంటే... రిటైర్మెంట్ తర్వాత ఎన్పీఎస్ నిధిలో 40 శాతాన్ని యాన్యుటీ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేసి, మిగిలిన 60 శాతాన్ని రూపాయి కూడా పన్ను చెల్లించకుండా వెనక్కి తీసేసుకోవచ్చు. ఇది ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేటుగా ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేసే అందరికీ లభిస్తుంది. 2004 తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరిన వారందరూ ఎన్‌పీఎస్‌లో చేరడం తప్పనిసరి. పథకంలో తాజా మార్పుతో ప్రైవేటు ఉద్యోగులకూ ప్రయోజనం కలగనుంది. ఏ పథకంలో ఎంత వ్యయాలు? పథకాలు ఏవైనా అందులో ఇన్వెస్టర్లు భరించాల్సిన వ్యయాలు కీలకం అవుతాయి. దీర్ఘకాలంలో రాబడులను ఇవి నిర్దేశిస్తాయి. ఎన్పీఎస్ పథకంలో ప్రస్తుతం 0.001 శాతాన్నే పెట్టుబడుల నిర్వహణ ఫీజుగా వసూలు చేస్తున్నారు. ఈ ఫీజులు భవిష్యత్తులో పెరగొచ్చు. కానీ యూఎల్‌పీపీల్లో ఫండ్ మేనేజ్మెంట్ చార్జ్ 1.35 శాతం వరకు ఉంటోంది. పంపిణీ ఖర్చులు మొదటి ఏడాది ప్రీమియంలో 7.5 శాతం మేర, ఆ తర్వాత ఏటా ప్రీమియంలో 2 శాతం మేర ఉంటాయి. ఎన్‌పీఎస్‌లో అయితే ఈ ఫీజు కేవలం 0.25 శాతానికే పరిమితం చేశారు. అది కూడా గరిష్ట పరిమితి రూ.25,000గానే ఉంది. ఇతర వ్యయాలు చూసుకున్నా మొత్తం మీద ఎన్‌పీఎస్‌లో చార్జీలు చాలా తక్కువ. అంకెల్లో పెద్ద తేడా అనిపించకపోవచ్చు. ఉదాహరణకు... ఓ యూఎల్‌పీపీ పథకంలో ఏటా రూ.లక్ష చొప్పున 8 శాతం రాబడి రేటు అంచనా ఆధారంగా 15 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేశారనుకోండి. అప్పుడు మొత్తం నిధి రూ.24 లక్షలు అవుతుంది. అదే ఎన్‌పీఎస్‌లో ఇంతే మొత్తం 15 ఏళ్లు ఇన్వెస్ట్ చేస్తే, ఇంతే రాబడి రేటు ప్రకారం సమకూరే మొత్తం రూ.29 లక్షలు అవుతుంది. చార్జీల్లో వ్యత్యాసం వల్ల 15 ఏళ్ల కాలంలో ఏకంగా రూ.5 లక్షల రాబడిని నష్టపోయినట్లు అర్థం చేసుకోవచ్చు. ఏది నయం?..: వ్యయాలు, సౌకర్యాల రీత్యా ఎన్పీఎస్ మొదటి స్థానంలో నిలుస్తుంది. పైగా ఎన్‌పీఎస్‌లో పెట్టుబడులు, రాబడులు, ఉపసంహరణలపైనా ప్రభుత్వం పన్ను మినహాయింపు కల్పించడం అదనపు ఆకర్షణ. ‘‘ఎన్‌పీఎస్‌లో సెక్షన్ 80సీకి అదనంగా రూ.50,000 పెట్టుబడులపై పన్ను మినహాయింపు కూడా మరో ఆకర్షణ. పైగా ఎన్పీఎస్ ద్వారా యాన్యుటీ ప్లాన్‌ను కొనుగోలు చేస్తే జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇతర పెన్షన్ ప్లాన్ ద్వారా యాన్యుటీని కొనుగోలు చేస్తే 1.8 శాతం జీఎస్టీ చెల్లించాలి’’ అని సుమీత్ శుక్లా తెలిపారు. తమ పెట్టుబడుల్లో 20 శాతాన్నే ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేసి, మిగిలిన నిధులను పీపీఎఫ్, ఈటీఎఫ్, మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలని తాను సూచిస్తానని లాడర్–7 ఫైనాన్షియల్ అడ్వైజర్స్ వ్యవస్థాపకుడు సురేశ్ సెడగోపన్ చెప్పారు. ఇక యూఎల్‌పీపీల్లో ప్రస్తుతం రిటైర్మెంట్ సమయంలో 33.33 శాతం మొత్తానికే పన్ను మినహాయింపు ఉంది. అయితే, ఐఆర్డీఏ ప్రతిపాదన అమల్లోకి వస్తే అప్పుడు 60 శాతం నిధిపైనా పన్ను మినహాయింపు లభిస్తుందని ఫ్యూచర్ జనరాలి ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ సీఎల్ భరద్వాజ్ తెలిపారు. -
తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది
-
బీమా పథకాలతో పేదలకు భద్రత
జాతీయ బీమా, పెన్షన్ పథకాల ప్రారంభసభలో సీఎం చంద్రబాబు జన్‌ధన్ యోజన అత్యుత్తమ పథకం: కేంద్రమంత్రి పారికర్ విజయవాడ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన మూడు పథకాలు ప్రధానమంత్రి జీవన్ సురక్షా యోజన, జీవన్‌జ్యోతి యోజన, అటల్ పెన్షన్ పథకాలతోపాటు రాష్ట్రంలో డ్రైవర్ల బీమా పథకం అసంఘటిత రంగ కార్మికులు, పేదలకు ఎంతో మేలు చేస్తాయని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఎవరైనా ప్రమాదవశాత్తూ చనిపోయినప్పుడు ఈ పథకాలతో వారి కుటుంబానికి రూ.9 లక్షలు వస్తుందని చెప్పారు. శనివారం సాయంత్రం కోల్‌కతాలో ప్రధానమంత్రి మోదీ ఈ పథకాలను ప్రారంభిస్తున్న సమయంలోనే రాష్ట్రంలో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సీఎం చంద్రబాబు, కేంద్ర రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ అటల్ పెన్షన్ యోజన ద్వారా పేదలు, కార్మికులు, డ్వాక్రా మహిళలు కూడా పెన్షన్ పొందవచ్చని చెప్పారు. కేంద్ర మంత్రి పారికర్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే ఎన్డీఏ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేసిందన్నారు. కేంద్ర అత్యుత్తమ పథకాల్లో జన్‌ధన్ యోజన ఒకటని చెప్పారు. ప్రధాని ప్రసంగాన్ని ఇక్కడి నుంచే సీఎం, కేంద్ర మంత్రి వీక్షించారు. ఎప్పుడూ వ్యతిరేక వార్తలు రాసే మీడియా ఇలాంటి అనుకూల వార్తలు కూడా రాయాలని సమావేశం చివర్లో చంద్రబాబు సూచించారు. కార్యక్రమంలో మంత్రులు డి.ఉమామహేశ్వరరావు, కామినేని శ్రీనివాస్, కొల్లు రవీంద్ర, ఆంధ్రా బ్యాంక్ ఈడీ ఎస్ కర్లా, నాబార్డు సీజీఎం,ఆర్బీఐ ఏజీఎం పాల్గొన్నారు. చంద్రబాబుతో ఎమ్మెల్సీ ఆశావహుల భేటీ శాసనమండలికి జరగనున్న ఎన్నికల్లో సీటు ఆశిస్తున్న పలువురు టీడీపీ నేతలు సీఎం, పార్టీ అధ్యక్షుడు చం ద్రబాబుతో శనివారమిక్కడ భేటీ అయ్యారు. తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలంటూ విన్నవించారు. అయితే, బాబు వారికి ఎలాంటి హామీ ఇవ్వలేదు. భూమి ఇస్తే మరో అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటు చేస్తాం: టాటా గ్రూప్ ప్రతినిధులు హైదరాబాద్: నిజాంపట్నం లేదా కావలిలో 1,750 ఎకరాల భూమిని కేటాయిస్తే ఆరు వేల మెగావాట్ల సామర్థ్యంతో మరో అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు వద్ద టాటా గ్రూప్ ప్రతినిధులు ప్రతిపాదించగా కావలి పరిసర ప్రాంతాల్లో భూమిని కేటాయించే అంశాన్ని పరిశీలి స్తామని చెప్పారు. శనివారం హైదరాబాద్‌లోని సీఎం క్యాంపు ఆఫీసులో చంద్రబాబుతో అటామిక్ ఎనర్జీ చైర్మన్ ఆర్కే సిన్హా, టాటా గ్రూప్ ప్రతినిధులు సమావేశమయ్యారు. కొవ్వాడ వద్ద నిర్మిస్తోన్న అణు విద్యుదుత్పత్తి కేంద్రం పనుల పురోగతిపై చర్చించారు. ఏపీ సీం చంద్రబాబుపై కేసు నమోదు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై హైదరాబాద్ చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌లో శనివారం కేసు నమోదైంది. ఏపీలోని కాకినాడ, రాజమండ్రి బహిరంగసభల్లో చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని జనార్దన్‌గౌడ్ అనే న్యాయవాది రంగారెడ్డి కోర్టులో రెండురోజుల క్రితం పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు చంద్రబాబుపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేపట్టాలని కోర్టు ఆదేశించటంతో పోలీసులు కేసు నమోదు చేశారు. -
9న బీమా, పెన్షన్ పథకాల ప్రారంభం!
కోల్‌కతాలో మొదలుపెట్టనున్న ప్రధాని మోదీ న్యూఢిల్లీ: ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతా తెరిచే లక్ష్యంతో చేపట్టిన జన్‌ధన్ పథకం బాటలోనే మరో రెండు భారీ పథకాలను ఈ నెల 9న ప్రారంభించనుంది. పేదలందరికీ బీమాతో పాటు పెన్షన్ కల్పించే పథకాల అమలును ప్రధాని నరేంద్ర మోదీ కోల్‌కతాలో మొదలుపెట్టనున్నారు. బీమా ప్రయోజనాలు జూన్ నుంచి అందుబాటులోకి వస్తాయి. కేంద్ర బడ్జెట్లోనే ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన(పీఎంఎస్బీవై), ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన(పీఎంజేజేబీవై) బీమా పథకాలను అటల్ పెన్షన్ యోజన(ఏపీవై) పింఛను పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. పీఎంఎస్బీవై కింద ఏడాదికి రూ. 12 ప్రీమియంతో 18 నుంచి 70 ఏళ్ల వయసులోపు బ్యాంకు ఖాతాదారులందరికీ రూ. 2 లక్షల ప్రమాద బీమాను కేంద్రం కల్పిస్తుంది. పీఎంజేజేబీవై కింద ఏడాదికి రూ. 330 ప్రీమియంతో 18 నుంచి 50 ఏళ్ల వయసులోపు బ్యాంకు ఖాతాదారులందరికీ జీవిత బీమా లభిస్తుంది. ఏపీవై కింద అసంఘటిత రంగంలోని వారికి 60 ఏళ్ల తర్వాత పింఛను అందించే ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం 18 నుంచి 40 ఏళ్లలోపు వారు 20 ఏళ్ల పాటు ప్రీమియం జమ చేయాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని బట్టి 60 ఏళ్ల తర్వాత రూ. వెయ్యి నుంచి రూ. 5 వరకు పింఛను అందుతుంది. -
బీమా కంపెనీలతో ఐబీఏ సమావేశం
ముంబై: బడ్జెట్లో ప్రతిపాదించిన పలు కొత్త బీమా, పెన్షన్ పథకాల అమలుపై ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ) త్వరలో బీమా కంపెనీలతో సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశంలో కొత్త పథకాల ప్రారంభానికి ప్రీమియంను ఎలా సేకరించాలి, సర్టిఫికెట్లను ఎలా జారీచేయాలి, బీమా కంపెనీలకు సమాచారాన్ని ఎలా బదిలీ చేయాలి వంటి అంశాలు చర్చకు రానున్నాయని న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ సీనియర్ అధికారి చెప్పారు. వీటితోపాటు క్లెయిమ్ పత్రాలను ఎవరు సేకరిస్తారు వంటి త దితర అంశాలు చర్చకు రానున్నాయన్నారు. బడ్జెట్లో ప్రతిపాదించిన ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన వంటి మూడు పథకాలపై మార్చి 3న ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి హస్ముక్ అదియా సమావేశాన్ని నిర్వహించారు. దీనికి పీఎఫ్ఆర్డీఏ చైర్మన్ హేమంత్, ఎల్ఐసీ చైర్మన్ ఎస్.కె.రాయ్, న్యూ ఇండియా ఇన్సూరెన్స్ డెరైక్టర్ శశాంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
రీయింబర్స్‌మెంట్‌కు ఆంక్షలా?
బాబు ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి పార్థసారథి మండిపాటు సాక్షి, హైదరాబాద్: అనేక రకాల ఆంక్షలతో ఇప్పటికే రైతు రుణమాఫీ, ఫించను పథకాల్లో భారీగా కోతలు పెట్టిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు అదే తీరున విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు కోతలు పెట్టే ప్రయత్నం చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి కె. పార్థసారథి ఆదివారం ఇక్కడి పార్టీ ప్రధాన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్మెంట్ పథకంపై ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన నిబంధన లు చూస్తే రాష్ట్ర విద్యార్ధులకు తీవ్ర అన్యాయం జరిగేలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హత ఉన్న ఏ ఒక్క విద్యార్థికీ ఫీజు రీయింబర్స్మెంట్ చేయకపోయినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమ బాట పడుతుందని హెచ్చరించారు. విద్యార్థులకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని తెలిపారు. స్థానికతపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాబుదంతా.. ప్రచార ఆర్భాటమే హుదూద్ తుపాను తరువాత ప్రభుత్వ యంత్రాంగమంతా సహాయక చర్యల్లో నిమగ్నమై ఉంటే.. చంద్రబాబు మాత్రం పూర్తి ప్రచార ఆర్భాటాలకే పరిమితమయ్యారని పార్థసారథి ఆరోపించారు. తమ అధినేత జగన్మోహన్రెడ్డి హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన తరువాత పార్టీ నేతలందరం చర్చించుకొని తుపాను సాయంపై ప్రధానిని కలిసే విషయంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ కూడా త్వరలో తుపాను ప్రాంతాల్లో పర్యటిస్తారని చెప్పారు. -
నిశ్చింతగా రిటైర్మెంట్ ఇలా..
ఉద్యోగం చేసినన్నాళ్లు కుటుంబానికి ఏ ఢోకా లేకుండా చూసుకునేందుకు, సౌకర్యంగా గడిపేందుకు ప్రాధాన్యతనిస్తుంటాం. అయితే ప్రస్తుత అవసరాలపై దృష్టి పెట్టే హడావుడిలో .. రిటైర్మెంట్ గురించి ప్లానింగ్ చేసుకోవడాన్ని మనలో చాలా మంది పట్టించుకోరు. అమెరికా, బ్రిటన్, కెనడా వంటి సంపన్న దేశాల్లో ప్రభుత్వం తమ పౌరులందరికీ రిటైర్మెంట్ తర్వాత సామాజిక భద్రత కల్పిస్తుంటుంది. కానీ భారత్‌లో మాత్రం ఉద్యోగం చేసే జనాభాలో కేవలం 12 శాతం మందికి మాత్రమే పింఛను కవరేజి ఉంది. వారికి కూడా ప్రావిడెంట్ ఫండ్ ఏకమొత్తంగా లభించినా.. ధరల పెరుగుదల వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. నెలవారీగా పింఛను వచ్చినా అదే పరిస్థితి. ప్రస్తుతం దాదాపు రూ. 15,000గా ఉన్న కుటుంబఖర్చులు.. పదేళ్లలో రూ. 35,000కి పెరిగిపోతాయన్న ద్రవ్యోల్బణ గణాంకాల్లో అతిశయోక్తి లేదు. అంటే మనం పొదుపు చేసే దానికి మించిన స్థాయిలో ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఇది రిటైర్మెంట్ తర్వాత గడిపే జీవితంపై కూడా ప్రభావం చూపుతుంది. కనుక, ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొని పదవీ విరమణ తర్వాత కూడా నిశ్చింతగా జీవితం గడపాలంటే సమగ్రమైన ప్రణాళిక ఉండాలి. లక్ష్యాన్ని బట్టి ప్రణాళిక .. రిటైర్మెంట్ ప్లాన్ రూపొందించుకునేటప్పుడు ప్రధానంగా ఆర్థిక లక్ష్యాలు, మీరెంత రిస్కు తీసుకోగలరు, అలాగే ద్రవ్యోల్బణం రేటును పరిగణనలోకి తీసుకోవాలి. రిటైరయ్యాక జీవితాన్ని ఎలా గడపాలనుకుంటున్నారు? ప్రపంచాన్ని చుట్టి వద్దామనుకుంటున్నారా, ఏదైనా కన్సల్టెన్సీ లాంటిది ప్రారంభిస్తారా లేదా హాయిగా ఇంటిపట్టునే ఉండి మనవలు, మనవరాళ్లతో సరదాగా కాలం వెళ్లబుచ్చుదామనుకుంటున్నారా? ఇలా.. మీ రిటైర్మెంట్ లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలి. దానికి అవసరమయ్యే నిధిని సమకూర్చుకునేందుకు అనువైన వివిధ సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టాలి. ఇందుకోసం స్టాక్స్, బీమా, మ్యూచువల్ ఫండ్స్, పీపీఎఫ్లు మొదలైన సాధనాలు ఉన్నాయి. మీరు ఏ దశలో ఉన్నారు, ఆర్థిక లక్ష్యాలేంటి, రిస్కు సామర్థ్యం ఎంత మొదలైన వాటి ఆధారంగా వీటన్నింటి మేళవింపుతో సమగ్రమైన పోర్ట్‌ఫోలియో రూపొందించుకోవాలి. రిటైర్మెంట్ లేదా పింఛను పథకాలు: బీమా కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలు వీటిని ఆఫర్ చేస్తుంటాయి. ఇవి దీర్ఘకాలికమైనవి. బీమా కంపెనీలు అందించే పింఛను పథకాల్లో మెచ్యూరిటీ వేళ సమ్ అష్యూర్డ్‌లో 30 శాతం మొత్తాన్ని అందుకోవచ్చు. మిగతాది యాన్యుటీ రూపంలో అందుకోవచ్చు. ఆరోగ్య బీమా: వైద్యం ఖర్చులు రోజు రోజుకీ పెరిగిపోతున్న నేపథ్యంలో సమగ్రమైన ఆరోగ్య బీమా ఉండాలి. మెడిక్లెయిమ్, అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీ ఆరోగ్యానికి బీమా రక్షణ పొందవచ్చు. ఎండోమెంట్ పథకాలు: బీమా సంస్థలు అందించే ఈ పథకాలు పిల్లల పెళ్లిళ్లు, ఇల్లు కొనుగోలు వంటి నిర్దిష్ట లక్ష్యాలకు ఉపయోగపడతాయి. బీమాతో పాటు పెట్టుబడి పథకాలుగా ఇవి ఉపయోగపడతాయి. క్రమం తప్పకుండా నిర్దిష్ట కాలానికి ప్రీమియం కడితే, గడువు తీరిన తర్వాత భారీ మొత్తాన్ని మెచ్యూరిటీ విలువ కింద అందుకోవచ్చు. ఒకవేళ పాలసీదారు ఆకస్మికంగా మరణించినా నామినీకి సమ్ అష్యూర్డ్ మొత్తం అందుతుంది. పెట్టుబడి, ఆర్థిక లక్ష్యాలకు ఎటువంటి విఘాతం కలగకపోవడం ప్రధాన ప్రయోజనం. వీటన్నింటితో పాటు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లు, ఫిక్స్డ్ డిపాజిట్లలో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. మీ అనుభవాన్ని, రిస్కు సామర్థ్యాన్ని బట్టి స్టాక్స్‌లో నేరుగా లేదా యులిప్స్ లేదా ఫండ్స్ మార్గంలో పెట్టుబడి పెట్టొచ్చు. స్టాక్‌మార్కెట్లలో భారీ ఒడిదుడుకులు ఉంటుంటాయి కనుక వయసు పెరిగే కొద్దీ ఈక్విటీల్లో పెట్టుబడులను క్రమంగా తగ్గించుకోవడం మంచిది. రిటైర్మెంట్ తర్వాత ఏం చేద్దామనుకుంటున్నారన్న దాని ఆధారంగా ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. పర్యాటక ప్రదేశాలు తిరిగి రావడం వంటి ఆలోచనలు ఉంటే కాస్త దూకుడుగా, ఈక్విటీ ఆధారిత ప్రణాళికలు, అలా కాకుండా ఇంటిపట్టునే ఉంటే డెట్ సాధనాల ఆధారిత ప్లాన్ వైపు మొగ్గు చూపవచ్చు. పిల్లల చదువు, పెళ్లిళ్లు మొదలైన వాటికి ముందునుంచే ప్లానింగ్ చేసుకుంటే నిశ్చింతగా రిటైర్ కావొచ్చు. -
అవ్వతాతలకు బువ్వేది ?
* బాబు జమానాలో ఒకరు మరణిస్తేనే మరొకరికి పెన్షన్.. * రోశయ్య, కిరణ్ హయాంలోనూ అంతే * వైఎస్ తరువాత పెరగని పింఛన్లు పెద్ద కొడుకు కోసం ‘కోటి’ కళ్లేసుకొని... కోటి మంది... వీళ్లంతా పింఛన్ల కోసం ఎదురుచూసే అభాగ్యులు. పిడికెడు మెతుకుల కోసం పరితపిస్తున్నవారు. ఇందులో పండుటాకులే సగానికి పైగా ఉన్నారు. జీవిత చరమాంకంలో బతుకు పోరు సాగిస్తున్న ఇలాంటివారిని ఆదుకోవాలని చంద్రబాబుకు ఏనాడూ అన్పించలేదు. కేవలం 75 రూపాయలు విదిల్చి అదే భారమని భావించారు. అది కూడా మూణ్ణెల్లకోసారే! ఎవరైనా లబ్ధిదారుడు చస్తేనే కొత్త పింఛన్‌దారుడిని ఎంపిక చేస్తామన్నారు. అలాంటివారి కోసం నేనున్నానంటూ ముందుకొచ్చి భరోసా ఇచ్చారు వైఎస్ రాజశేఖరరెడ్డి. తల్లడిల్లే ముసలి తల్లిదండ్రులకు పెద్ద కొడుకయ్యాడు. అధికారంలోకి రాగానే పింఛన్‌ను రూ.200లకు పెంచడమేగాక నెలనెలా ఠంచనుగా అందించి వారి జీవితాల్లో మళ్లీ వెలుగులు నింపారు. వైఎస్ హఠాన్మరణంతో ప్రభుత్వానికి అవ్వాతాతలు భారమయ్యారు. ఉన్న సంఖ్యలో కోతపెట్టి ‘ఖర్చు’ తగ్గించుకుంటున్నారు. ‘పెద్దకొడుకు’ రూపంలో వచ్చి తమ బతుకులు మార్చేవారి కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ముదిమి వయసులోనూ తమ ఓటును ఆయుధంగా మలిచేందుకు సిద్ధమవుతున్నారు. పెన్షన్.. బలహీనులకు ఆర్థిక భరోసానిచ్చే ఆయుధం. వృద్ధాప్యం వల్లనో, వైకల్యం వల్లనో సొంతంగా సంపాదించుకోలేని, వారికి ప్రభుత్వం కచ్చితంగా అందించాల్సిన చేయూత. కానీ వైఎస్ హయాం వరకు ప్రభుత్వాలు పింఛను అంశాన్ని ఆర్థికాంశంగా, ఖజానాపై భారంగా, అనవసర వ్యయంగానే చూశాయి. పెన్షన్ల పథకం 1995-96లో ప్రారంభమైంది. అంతకుముందు వితంతు పెన్షన్లు ఉన్నా అతి తక్కువ మందికి లబ్ధి చేకూరేది. 1995-96లో వృద్ధాప్య, 2000లో వికలాంగ, 2001లో చేనేత పెన్షన్ల ప్రక్రియ ప్రారంభ మైంది. 1995లో వితంతు, వృద్ధాప్య పెన్షన్లు అందుకునే వారి సంఖ్య 9.68 లక్షలు ఉంటే.. అందులో వృద్ధులకు రూ. 75, వితంతువులకు రూ. 50 మాత్రమే చెల్లించేవారు. - కె. శ్రీకాంత్ రావు పొన్ను కర్ర పోటేసుకుంటూ వచ్చిందా అవ్వ. వైఎస్ ఆ ఊరొచ్చాడని ఎవరో చెప్పారట. జన ప్రవాహంలోనే రాజన్న దగ్గరకొచ్చింది. ‘ఏంటమ్మా?’ అని ప్రశ్నిస్తే ఆ అవ్వ కన్నీటి పర్యంతమైంది. ‘అయ్యా! ఆరేళ్లుగా పెన్షన్ కోసం తిరుగుతున్నాను. కన్పించిన ప్రతి నాయకుడిని వేడుకున్నా. ఎన్నికలప్పుడైతే ఇస్తామంటున్నారు. ఆ తర్వాత ఎవరైనా చస్తేనే పెన్షన్ వస్తుందని చెప్పారు. మా ఊరు వచ్చినచంద్రబాబును కలవాలనుకున్నా. కానీ ఆయన చుట్టూ ఉన్నోళ్లు ఎవరూ పోనివ్వలేదు. అయ్యా! ఆ పెన్షన్ ఇస్తే కాస్త ఆసరాగా ఉంటుంది కదా..’ ఆ అవ్వ కొంగుతో కళ్లు అద్దుకుంటూ వైఎస్ చేతులను తడిమింది. ‘వచ్చేది మన ప్రభుత్వమే, నీకు పెన్షన్ వస్తుంది’ అని రాజన్న మాట ఇచ్చారు. ఆ తర్వాత ఆ అవ్వకు పెన్షన్ వచ్చింది. ఆ ఊరి అధికారే ఆమె దగ్గరకొచ్చి ఆ విషయం చెప్పారు. ఆ సమయంలో అవ్వ ఆనందంతో కన్నీళ్లు పెట్టింది. ఇదో యదార్థ గాథ. వైఎస్ పాదయాత్ర సందర్భంగా సంచలనం కలిగించిన వార్త. ‘బాబు’ కాలంలో ఓటు కోసమే పోలింగ్ బూతుకొచ్చిన ఆ అవ్వ... ఆ తర్వాత వైఎస్ కోసమే ఓటెయ్యాలని వస్తున్నా... అని చెప్పింది. మన రాష్ట్రంలో వయోవృద్ధులు, వితంతువులు, వికలాంగుల ఓటు శాతం తక్కువేమీ కాదు. దాదాపు కోటి మంది ప్రతిసారి ఓటేయడానికి వస్తున్నారు.. ఆ క్షణంలో వాళ్లు కోరుకునేది ఒకే ఒక్కటి. గెలిచిన ప్రభుత్వం తమకు ఎంతోకొంత మేలు చేయాలని వేడుకుంటారు. వైఎస్ రాజశేఖరరెడ్డి సామాజిక పెన్షన్ల తీరు తెన్నులే మార్చిన తర్వాత వయోవృద్ధుల ఓటింగ్ శాతం పెరిగింది. వికలాంగుల్లోనే తమ ఓటుతో మనోగతాన్ని చాటుకోవాలనే ఆలోచన రెట్టింపయింది. ఈ పరిస్థితిని గుర్తించిన పార్టీలు సామాజిక పెన్షనర్ల ఓటింగ్‌ను రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. పెన్షన్ల కోసం ఏళ్ల తరబడి తిప్పించుకున్న పార్టీలు సైతం, వాగ్దానాల మొసలి కన్నీరు కారుస్తున్నాయి. సామాజిక పెన్షన్ల వ్యవస్థే భారమన్న చంద్రబాబు సైతం తన మేనిఫెస్టోలో దీన్నో ప్రచారాస్త్రంగా చేసుకున్నారు. అయితే వృద్ధులు, వికలాంగులు, వితంతువులు నిర్దిష్టమైన హామీల వైపే దృష్టి పెట్టారు. కచ్చితమైన భరోసానే కోరుకుంటున్నారు. ఇప్పుడున్న పార్టీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాజిక పెన్షన్లపై స్పష్టమైన విధానాన్ని వెల్లడించడం వారిలో ఆశలు రేపుతోంది. అధికారంలోకి వస్తే ఏకంగా కోటి మందికి పెన్షన్లు ఇస్తామని ప్రకటించడం వారికి ఊరట కల్గిస్తోంది. ఏలికలు పేలికలైన చేనేతలూ పెన్షన్ల భద్రత కోసం రాజన్న తరహా వ్యూహం కావాలని, అలాంటి ఆశయాలతో ముందుకెళ్లే పార్టీలకే పట్టంకట్టాలనే ఆలోచనలో ఉన్నారు. పిసరంత సాయం కోసం పోటెత్తే పెన్షనర్ల ఓట్లు అన్ని స్థానాలను ప్రభావితం చేస్తాయనేది సుస్పష్టం. చంద్రబాబు - చంద్రబాబు 2004లో పదవి నుంచి దిగిపోయేనాటికి.. రాష్ట్రంలో మొత్తం వృద్ధాప్య, వితంతు, చేనేత, వికలాంగ పెన్షన్ల సంఖ్య 18.97 లక్షలు. - పెన్షన్ల కోసం ఏడాదికి చేసిన వ్యయం రూ.163.90 కోట్లు. - అర్హులైన అందరికీ కాకుండా, ‘ఒకరు మరణిస్తేనే.. మరొకరికి’ పింఛన్ ఇచ్చేవారు. అదీ మూడు నెలలకోసారి గ్రామ సభల్లో అందించేవారు. వైఎస్ రాజశేఖరరెడ్డి - 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి రాగానే.. 50 రూపాయలు, 75 రూపాయలున్న పెన్షన్లను వంద రూపాయలకు పెంచారు. - 2005-06 ఆర్థిక సంవత్సరంలోనే పెన్షన్ మొత్తాన్ని రూ.వంద నుంచి రూ. 200కు పెంచారు. - 2006 సంవత్సరం నుంచి అర్హులైన అందరికీ పెన్షన్లు ఇవ్వాలనే ఆలోచనలో.. సంతృప్తస్థాయి విధానాన్ని ప్రారంభించారు. లబ్ధిదారుల సంఖ్య ఒక్కసారిగా 21 లక్షల నుంచి 71 లక్షలకు చేరింది. - దరఖాస్తు చేసుకున్న, తెల్లరేషన్‌కార్డు ఉన్న, అర్హులైన వారందరికీ.. ఎలాంటి మధ్యవర్తులు, సిఫారసులు లేకుండానే పెన్షన్లు మంజూరు చేశారు. - ప్రతినెలా పెన్షన్లు ఇచ్చేవారు. రెండో సంతకం చేస్తా.. పింఛన్ రూ.700 చేస్తా పనులకు పోతున్న అవ్వతాతల కోసం రెండో సంతకం చేస్తాను. ఇవాళ ఈ అవ్వతాతలకు ఇస్తున్న రూ. 200 ఫించన్‌ను మనవడిలా రూ. 700లకు పెంచుతూ రెండో సంతకం చేస్తాను. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత నేను చేసే ఐదు సంతకాలు రాష్ట్ర దశాదిశను మార్చేవిగా ఉంటాయి. పైనున్న రాజశేఖరరెడ్డి గర్వపడే విధంగా ఉంటాయి.. - వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇదీ ప్రస్తుతం ఉన్న లెక్క (2014 మార్చి వరకు) కేటగిరి లక్ష్యం మంజూరు పంపిణీ వృద్ధాప్య 42,89,616 37,50,325 33,10,111 వైకల్యం 8,84,246 9,12,807 8,20,024 వితంతు 17,77,658 22,83,351 19,52,955 చేనేత 1,44,514 1,33,067 1,17,942 గీతపని 1,00.000 37,841 33.927 రోశయ్య, కిరణ్ - వైఎస్ మరణం తరువాత అధికారం చేపట్టిన రోశయ్య, ఆ తరువాత అనూహ్యంగా సీఎం అయిన కిరణ్‌కుమార్‌రెడ్డి పెన్షన్లను ఖజానాపై భారంగా భావించారు. - పెన్షనర్ల సంఖ్యను తగ్గించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఒకరు మరణిస్తేనే మరొకరికి పెన్షన్ అనే పాత పద్ధతికి మళ్లీ తెరతీశారు. బినామీలని, వలసలు వెళ్లారని, స్మార్ట్కార్డులంటూ చేతిముద్రలతో సరిపోలితేనే పెన్షన్ ఇవ్వాలని.. ఇలా రకరకాల పద్ధతుల్లో పెన్షన్ల సంఖ్యకు కత్తెరేశారు. - ఒక ఇంట్లో ఇద్దరు వృద్ధులు ఉన్నా.. ఇద్దరు వితంతువులు ఉన్నా.. ఒక్కరికి మాత్రమే పెన్షన్ మంజూరు చేసే పద్ధతిని రోశయ్య ప్రభుత్వం ప్రారంభించింది. - ఒకవైపు ధరలు ఆకాశానికి చేరుతున్నా.. పెన్షన్ మొత్తాన్ని మాత్రం పెంచలేదు. దీనిని కనీసం రూ.400 చేయాలని కేంద్రం పలుమార్లు రాష్ట్రానికి సూచించినా ఏనాడు పట్టించుకోలేదు. - 80 సంవత్సరాల వయస్సు దాటిన వారికి కేంద్రం రూ.500 చెల్లిస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం వాటినీ తన ఖాతాలోనే వేసుకుంది. పెన్షన్‌దారుల అర్హత వయసును కేంద్రం 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గించింది. దీన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. - వైఎస్ హయాంలో 71 లక్షలుగా ఉన్న పెన్షన్ల సంఖ్య ఇప్పుడూ అలాగే ఉంది. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు వైఎస్ తరువాత వచ్చిన ప్రభుత్వాల పనితీరు ఎలా ఉందో.. ఓదార్పు ఇచ్చేదెవరు? అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. మనదేశంలో 60 ఏళ్లు పైబడిన వారు 27 కోట్ల మంది ఉన్నట్టు జాతీయ కుటుంబ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. 2001లో దేశ జనాభాలో 7.6 శాతమే ఉన్న వృద్ధులు... తాజా సర్వేలో 20 శాతానికి చేరినట్టు తేలింది. గడచిన దశాబ్దకాలంగా వీరు హక్కుల కోసం సమైక్య పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో వృద్ధుల సంక్షేమం దిశగా తొలి అడుగు వేసింది వైఎస్ రాజశేఖరరెడ్డి మాత్రమే. తల్లిదండ్రులు, వృద్ధుల పోషణ, సంరక్షణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని ముఖ్యమంత్రిగా ఆయన ఆకాంక్షించారు. ఆరోగ్య శ్రీ పరిధిలోకి వృద్ధులను చేర్చే అంశంపై అధికారులతో సమీక్షించి విధివిధానాల రూపకల్పనకు ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాతి ప్రభుత్వాలు ఆ ఫైళ్లను ముట్టుకోలేదు. కేంద్ర ప్రభుత్వ సౌజన్యంతో రాష్ట్రంలోని 100 జిల్లాల్లో అమలు చేస్తున్న ఎన్‌పీహెచ్‌సీఈ పథకాన్ని ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. సర్కారీ నిర్లక్ష్యంపై వయో వృద్ధుల సంఘాలు అనేకసార్లు ప్రభుత్వానికి నివేదించినా ఫలితంలేదు. -
బాబు పాలనలో వృద్ధుల ఆకలి కేకలు
ముదిమి వయుసులో రూ.75 పింఛన్ కోసం చంద్రబాబు ప్రభుత్వంలో నరకం చూడాల్సి వచ్చేది. ఒక లబ్ధిదారుడు చనిపోతే తప్ప మరొకరికి పింఛన్ ఇవ్వలేని దుస్థితి. 2002లో జరిగిన ఒక ఘటన ఎవరికైనా కన్నీళ్లు తెప్పిస్తుంది. నెల్లూరుకు చెందిన 68 ఏళ్ల చింతల పుల్లవ్ము పింఛన్ కోసం పలుసార్లు దరఖాస్తు చేసుకున్నా టీడీపీ సర్కారు కరుణించలేదు. ఓ ‘తెలుగు తవుు్మడు’ చెబితే అప్పు చేసి మరీ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు వచ్చింది పుల్లమ్మ. పడిగాపులే తప్ప చంద్రబాబును కలిసి గోడు చెప్పుకొనే భాగ్యం కలగలేదు. వారం పాటు నిరీక్షించాక ఆకలి భరించలేక పుల్లవ్ము భిక్షాటన చేయూల్సి వచ్చింది. కేంద్రప్రభుత్వం ఇచ్చిన వ్యూచింగ్ గ్రాంటునే సగానికి కోతవేసి రూ.75 చొప్పున విదిల్చిన ఘనుడు చంద్రబాబు. -
చెవిటి, మూగ యువతికి వైఎస్ జగన్ ఓదార్పు!
వికలాంగుల పెన్షన్ రావడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెవిటి, మూగ యువతి స్వప్న తన ఆవేదనను చెప్పుకున్నారు. సైగలతోనే వైఎస్ జగన్ కు స్వప్న తన బాధను వెళ్లగక్కారు. దాంతో ఆవేదనకు గురైన స్వప్నకు వైఎస్ జగన్ ధైర్యాన్ని ఇవ్వడమే కాకుండా.. తానున్నానని భరోసా ఇచ్చారు. త్వరలోనే మన ప్రభుత్వం వస్తుందని.. వికలాంగులందరికి పెన్షన్ ఇప్పిస్తానని జగన్ హామీ ఇచ్చారు. మహానేత వైఎస్ఆర్ అకాల మరణం తర్వాత పేదలకు, వికలాంగులకు సంక్షేమ పథకాలు దూరమయ్యాయని స్థానికులు జగన్ దృష్టికి తీసుకువచ్చారు. త్వరలోనే రాజన్న రాజ్యం వస్తుందని అన్ని కష్టాలు తీరుతాయని జగన్ అన్నారు. -
పింఛన్‌కు ప్లస్‌లూ ఉంటాయి
పెన్షన్ అనగానే గుర్తుకొచ్చేది బీమా పథకాలే. ప్రస్తుతం బీమా కంపెనీలు రెండు రకాల పెన్షన్ పథకాలను అందిస్తున్నాయి. స్టాక్, మనీ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసే యులిప్ పెన్షన్ పథకాలు ఒకటైతే సంప్రదాయ పెన్షన్ పథకాలు మిగతావి. రిటైర్మెంట్ నిధి సమకూర్చుకునేటప్పుడు రిస్క్ ఎందుకులే అనుకుంటే సంప్రదాయ బీమా పథకాలు చాలా ఉత్తమం. సంప్రదాయ పెన్షన్ బీమా పథకాల్లో ఉండే ప్రయోజనాలేమిటో ఇప్పుడు చూద్దాం... రక్షణాత్మకమైన రాబడి ఈ పథకాలు గ్యారంటీతో కూడిన రక్షణాత్మకమైన రాబడులను అందిస్తాయి. ఈ పథకాలపై ఏటా అందించే బోనస్‌లు, అదనపు బోనస్‌లను మెచ్యూరిటీ లేదా క్లెయిమ్ సమయంలో ఒకేసారి చెల్లిస్తారు. తీసుకోవడం సులభం ఇతర పాలసీలతో పోలిస్తే పెన్షన్ పథకాల జారీ చాలా సులభం. చాలా బీమా కంపెనీలు ఆరోగ్య పరిస్థితితో సంబంధం లేకుండా ఎటువంటి వైద్య పరీక్షలు అవసరం లేకుండానే పెన్షన్ పథకాలను జారీ చేస్తున్నాయి. నెలవారీ ఆదాయం పాలసీ గడువు తీరాక వచ్చిన మొత్తాన్ని యాన్యుటీ పథకంలో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు యాన్యుటీ పథకం జీవిత కాలం హామీతో కూడిన ఆదాయాన్ని ప్రతీ నెలా అందిస్తుంది. దీని వలన రిటైర్మెంట్ తర్వాత ఉండే అవసరాలకు ఈ మొత్తాన్ని వినియోగించుకోవచ్చు. అంతేకాదు రిటైర్మెంట్ తర్వాత వయస్సుతో పాటు ఆరోగ్య సమస్యలు పెరుగుతుంటాయి. ఇలాంటి అత్యవసర సమయాల్లో పెన్షన్ పథకాలు అక్కరకొస్తాయి. పన్ను ప్రయోజనాలు పెన్షన్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసిన మొత్తంపై ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 80సీ ప్రకారం లక్ష రూపాయల వరకు పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. అధిక మొత్తంలో పెన్షన్ కావాలనుకునే వాళ్లు ఈ పరిమితిని దాటి కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో కేవలం లక్ష రూపాయల వరకు పన్ను ప్రయోజనాలు లభించినా రిటైర్మెంట్ తర్వాత కావల్సినంత పెన్షన్‌ను అందుకునే వెసులుబాటు కలుగుతుంది. బీమా రక్షణ కేవలం పెన్షనే కాకుండా బీమా రక్షణ ఉండటం కూడా ఈ పథకాల్లో ప్రధానమైన ఆకర్షణ. పాలసీదారునికి అనుకోని సంఘటన ఏదైనా జరిగి క్లెయిమ్ సంభవిస్తే పాలసీ మొత్తంతో పాటు అప్పటి వరకు జమ కూడిన నిధిని మొత్తం నామినీకి ఇవ్వడం జరుగుతుంది. చివరగా.. రిటైర్మెంట్ కోసం ప్రణాళికను సిద్ధం చేసుకునేటప్పుడు ఇన్వెస్ట్మెంట్ కాలపరిమితి ఎక్కువ ఉండే విధంగా చూసుకోవడమే కాకుండా చిన్న వయస్సులోనే ప్రారంభించండి. దీని వలన చిన్న మొత్తంతోనే అధిక పెన్షన్ పొందొచ్చు.