కోల్‌కతాలో మొదలుపెట్టనున్న ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతా తెరిచే లక్ష్యంతో చేపట్టిన జన్‌ధన్ పథకం బాటలోనే మరో రెండు భారీ పథకాలను ఈ నెల 9న ప్రారంభించనుంది. పేదలందరికీ బీమాతో పాటు పెన్షన్ కల్పించే పథకాల అమలును ప్రధాని నరేంద్ర మోదీ కోల్‌కతాలో మొదలుపెట్టనున్నారు. బీమా ప్రయోజనాలు జూన్ నుంచి అందుబాటులోకి వస్తాయి. కేంద్ర బడ్జెట్‌లోనే ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన(పీఎంఎస్‌బీవై), ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన(పీఎంజేజేబీవై) బీమా పథకాలను అటల్ పెన్షన్ యోజన(ఏపీవై) పింఛను పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది.
పీఎంఎస్‌బీవై కింద ఏడాదికి రూ. 12 ప్రీమియంతో 18 నుంచి 70 ఏళ్ల వయసులోపు బ్యాంకు ఖాతాదారులందరికీ రూ. 2 లక్షల ప్రమాద బీమాను కేంద్రం కల్పిస్తుంది. పీఎంజేజేబీవై కింద ఏడాదికి రూ. 330 ప్రీమియంతో 18 నుంచి 50 ఏళ్ల వయసులోపు బ్యాంకు ఖాతాదారులందరికీ జీవిత బీమా లభిస్తుంది. ఏపీవై కింద అసంఘటిత రంగంలోని వారికి 60 ఏళ్ల తర్వాత పింఛను అందించే ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం 18 నుంచి 40 ఏళ్లలోపు వారు 20 ఏళ్ల పాటు ప్రీమియం జమ చేయాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని బట్టి 60 ఏళ్ల తర్వాత రూ. వెయ్యి నుంచి రూ. 5 వరకు పింఛను అందుతుంది.
9న బీమా, పెన్షన్ పథకాల ప్రారంభం!
Published Mon, May 4 2015 1:18 AM | Last Updated on Tue, Aug 21 2018 9:33 PM
Advertisement