
సాక్షి, పశ్చిమగోదావరి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు నలభయ్యేళ్ల వైఎస్ జగన్ ఆలోచనల్ని కాపీ కొడుతున్నారని ఎద్దేవా చేశారు. ‘పరీక్షల్లో కాపీ కొట్టిన విద్యార్థిని డీబార్ చేస్తుంటారు. మరి వైఎస్సార్‌సీపీ హామీలను కాపీ కొట్టిన చంద్రబాబును ఏం చేయాలి’ అని ప్రశ్నించారు. నల్లజర్ల మండలంలోని తెలికిచెర్ల గ్రామంలో మంగళవారం జరిగిన ‘నిన్ను నమ్మం బాబు’ కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రసంగించారు.
చంద్రబాబు ఎక్స్పైర్ అయిన టాబ్లెట్ లాంటివారని రోజా వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్ అప్‌డేటెడ్ వెర్షన్ అయితే బాబు ఔట్ డేటెడ్ వెర్షన్ అని అన్నారు. గత ఎన్నికల సమయంలో బాబు వస్తే జాబు అని హామిలిచ్చిన చంద్రబాబు.. తన కొడుక్కి మాత్రమే మంత్రి పదవి తెప్పించుకున్నారని విమర్శించారు. ‘పెంచిన పెన్షన్ 2వేల రూపాయలను బాబు రెండు నెలలు మాత్రమే ఇస్తారు. అదే వైఎస్ జగన్‌కు ఓటువేస్తే జీవితాంతం ఇస్తారు’ అని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ సమన్వయకర్త తలారి వెంకట్రావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment