చెవిటి, మూగ యువతికి వైఎస్ జగన్ ఓదార్పు!
వికలాంగుల పెన్షన్ రావడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెవిటి, మూగ యువతి స్వప్న తన ఆవేదనను చెప్పుకున్నారు. సైగలతోనే వైఎస్ జగన్ కు స్వప్న తన బాధను వెళ్లగక్కారు. దాంతో ఆవేదనకు గురైన స్వప్నకు వైఎస్ జగన్ ధైర్యాన్ని ఇవ్వడమే కాకుండా.. తానున్నానని భరోసా ఇచ్చారు. త్వరలోనే మన ప్రభుత్వం వస్తుందని.. వికలాంగులందరికి పెన్షన్ ఇప్పిస్తానని జగన్ హామీ ఇచ్చారు.
మహానేత వైఎస్ఆర్ అకాల మరణం తర్వాత పేదలకు, వికలాంగులకు సంక్షేమ పథకాలు దూరమయ్యాయని స్థానికులు జగన్ దృష్టికి తీసుకువచ్చారు. త్వరలోనే రాజన్న రాజ్యం వస్తుందని అన్ని కష్టాలు తీరుతాయని జగన్ అన్నారు.