సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జాతీయ పెన్షన్ స్కీం (కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం–సీపీఎస్) విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రభుత్వం అనుసరించిన విధానం వైపే కేంద్ర ప్రభుత్వం కూడా అడుగుల వేస్తోంది. 2004 నుంచి అమల్లోకి వచి్చన జాతీయ పెన్షన్ స్కీం ద్వారా ఉద్యోగులు రిటైరయ్యాక వారికి పెన్షన్ చాలా తక్కువగా వస్తోందని, పాత పెన్షన్ స్కీంను అమలుచేయాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వివిధ రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.
నిజానికి.. 2004లో తీసుకొచి్చన సీపీఎస్ ప్రకారం.. ఉద్యోగులు పది శాతం, ప్రభుత్వాలు పది శాతం పెన్షన్ నిధికి జమచేస్తాయి. మార్కెట్ అధారిత రిటర్న్‌ల ప్రకారం ఆ నిధి నుంచి ఉద్యోగులు పదవీ విరమణ అనంతరం పెన్షన్ వస్తుంది. మార్కెట్‌లపై ఆధారపడటంతో ఇంత పెన్షన్ వస్తుందనే గ్యారెంటీ లేదు. కొందరు ఉద్యోగులకు పదవీ విరమణ అనంతరం బేసిక్ వేతనంలో కనీసం 20 శాతం కూడా పెన్షన్ వచ్చే పరిస్థితిలేదు. ఈ నేపథ్యంలో.. 2019 ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల డిమాండ్ మేరకు సీపీఎస్‌ను రద్దుచేస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.
అయితే, సీపీఎస్ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అయినందున దీనిపై జగన్ ముఖ్యమంత్రి అయ్యాక సుదీర్ఘ కసరత్తు చేశారు. 2004కు ముందు ఉద్యోగంలో చేరిన వారికి పాత పెన్షన్ విధానంలో పదవీ విరమణ తర్వాత ఎక్కువ పెన్షన్ రావడం.. 2004 తర్వాత ఉద్యోగంలో చేరిన వారికి చాలా తక్కువ పెన్షన్ రావడం వంటి అసమానతలు నెలకొన్నాయి. అలాగని, సీపీఎస్ రద్దుచేసి పాత పెన్షన్ విదానంలోకి వెళ్తే రాష్ట్రాల ఆరి్థక వ్యవస్థలపై భవిష్యత్తులో పెనుభారం పడటమే కాకుండా జీతాలు, పెన్షన్లు చెల్లించలేని పరిస్థితి నెలకొంటుందని ఆర్బీఐ వంటి సంస్థల అధ్యయనాలు పేర్కొన్నాయి.
ఈ నేపథ్యంలో.. సీపీఎస్ ఉద్యోగులకు మేలు చేయాలనే తపనతో జగన్ సర్కారు సుదీర్ఘ కసరత్తు చేసింది. రిటైర్డ్ ఉద్యోగుల జీవన ప్రమాణాలను కూడా నిలబెట్టేలా గ్యారెంటీ పెన్షన్ స్కీం (జీపీఎస్‌ను)ను రూపొందించింది. దీని ప్రకారం.. బేసిక్ జీతంలో 50 శాతం అంటే రూ.1 లక్ష జీతం ఉంటే రిటైరైన తర్వాత రూ.50 వేలు పెన్షన్‌గా వస్తుంది. 62 ఏళ్లకు రిటైరైతే 82 ఏళ్లలో కూడా అదే స్థాయిలో జీవన ప్రమాణాలు ఉండాలన్న ఆలోచనతో ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని డీఆర్‌లు ఇచ్చేలా జీపీఎస్‌లో పొందుపరిచారు.
సీపీఎస్‌లో మార్పులకు కేంద్రం కమిటీ..
ఇదిలా ఉంటే.. కేంద్ర ప్రభుత్వోద్యోగుల డిమాండ్ నేపథ్యంలో జాతీయ పెన్షన్ స్కీం విధానంలో మార్పులు చేయడానికి కేంద్ర ఆరి్థక శాఖ కార్యదర్శి నేతృత్వంలో కమిటీనీ ఏర్పాటుచేసింది. ఉద్యోగులు, ప్రభుత్వం తమతమ కంట్రిబ్యూషన్‌ను కొనసాగిస్తూనే 2004 తర్వాత చేరిన ఉద్యోగులకు పదవీ విరమణ అనంతరం మరింత మెరుగైన పెన్షన్ వచ్చేలా మార్గాలను కేంద్ర కమిటీ అన్వేíÙంచింది. ఇందుకు సంబంధించిన సిఫార్సులతో ఇటీవల కేంద్రానికి ఆ కమిటీ నివేదిక సమరి్పంచినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ కమిటీ కూడా జగన్ సర్కారు తీసుకొచ్చిన జీపీఎస్‌లోని అంశాలనే సిఫార్సు చేసిందని, ఇది దేశానికే ఆదర్శంగా నిలిచిందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
ఇక అప్పట్లో ఉద్యోగ సంఘాలతో జరిగిన సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో దేశమే ఈ పెన్షన్ స్కీంను అమలుచేసే పరిస్థితి రాబోతుందని చెప్పారు. ఇప్పుడు అక్షరాలా అదే నిజమవుతోంది.
జగన్ సర్కార్ చేసిన మార్పులివే..
2004 పెన్షన్ సంస్కరణలను కాపాడుతూనే వైఎస్ జగన్ సర్కార్ జాతీయ పెన్షన్ స్కీంలో మార్పులు చేస్తూ జీపీఎస్‌ను తీసుకొచ్చింది.
– ఇటు రాష్ట్రంపై ఆర్థిక భారం పెద్దగా
పడకుండా ఉద్యోగులు పదవీ విరమణ అనంతరం చివరి నెల బేసిక్ వేతనంలో 50 శాతం పెన్షన్ గ్యారెంటీని జగన్ సర్కారు ఇచ్చింది.
– తద్వారా ఏపీజీపీఎస్‌లో ఉద్యోగులు రిటైరయ్యాక చివరి నెలలో డ్రా చేసిన మూల వేతనంలో 50 శాతం పెన్షన్‌కు గ్యారెంటీ ఇస్తోంది. – అలాగే, ఉద్యోగి మరణిస్తే జీవిత భాగస్వామికి హమీ ఇచ్చిన పెన్షన్‌లో 60 శాతం పెన్షన్ వస్తుంది.
– ద్రవ్యోల్బణం ప్రకారం డీఆర్ వస్తుంది.
– అంతేకాక.. ఉద్యోగులకు హెల్త్ స్కీం వర్తిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment