అనంతపురం అర్బన్ : జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో మీ– సేవ కేంద్రాల ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించదని జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మికాంతం తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం మీ–సేవ∙కేంద్రాలు ఉన్న గ్రామ పంచాయతీలను మినహాయించి 158 పంచాయతీల్లో ఏర్పాటు చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.
158 పంచాయతీల్లో మీ– సేవ కేంద్రాలు
Published Tue, Aug 2 2016 12:24 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
Advertisement
Advertisement