నిర్మించారు..వదిలేశారు | Constructed anganvadi centers left over | Sakshi
Sakshi News home page

నిర్మించారు..వదిలేశారు

Published Sun, Jul 31 2016 11:30 PM | Last Updated on Tue, Mar 19 2019 6:15 PM

నిర్మించారు..వదిలేశారు - Sakshi

నిర్మించారు..వదిలేశారు

–లక్షలు వెచ్చించి నిర్మించిన భవనాలు నిరుపయోగం
–అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిరద్శనం
అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ అస్తవ్యస్తం
చిలుకూరు :  అధికారుల  నిర్లక్ష్యం కారణంగా మండలంలోని చిలుకూరు, సీతరాంపురం, ఆచార్యులగూడెం గ్రామాల్లో లక్షల రూపాయాలు వెచ్చించి నిర్మించిన అంగన్‌వాడీ భవనాలు నిరుపయోగంగా మారాయి. దాదాపుగా నాలుగేళ్ల క్రితం నిర్మించిన భవనాలు నేటి వరకు  ప్రారంభానికి నోచుకోలేదు.  మండలంలోని అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహృణ అçస్తవ్యస్తంగా తయారైంది. అంVృSన్‌వాడీ కేంద్రాలు కొన్ని అద్దెభవనాల్లో,  కమ్యూనిటీ హాల్‌లో ఏర్పాటు చేశారు. అంగన్‌వాడీ కేంద్రాలను గ్రామంలో ఎక్కడ నిర్మిస్తే సౌకర్యంగా ఉంటుందో తెలుసుకోకుండా మండలస్థాయి అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరించడంతో అంగన్‌వాడీ కేంద్రాలు అధ్వానస్థితికి చేరుకున్నాయి.
ఎనిమిది కేంద్రాలకే పక్క భవనాలు
మండలంలో మొత్తం 38 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా వాటిల్లో ఎనిమిది కేంద్రాలకు మాత్రమే పక్కా భవనాలున్నాయి. మరో తొమ్మిది కేంద్రాలు పాఠశాలల్లో, కమ్యూనిటీ హాళ్లలో సాగుతుండగా 21 కేంద్రాలను అద్దె గదుల్లో నిర్వహిస్తున్నారు. సీతారాంపురం, సీతారాంపురం చిలుకూరు గ్రామాల్లో ఒక్కొక్క భవనానికి రూ.3 లక్షలు వెచ్చించి పక్కాభవనాలు నిర్మించారు. ఈ భవనాలు నిర్మించి మూడు  సంవత్సరాలు దాటినా ప్రారంభానికి నోచుకోలేదు.  చిలుకూరులో గ్రామ శివారులో శివాలయంకు వెళ్లే రోడ్డులో కంపచెట్ల మధ్య నిర్మించారు. దీంతో అ భవనంలో ఏకంగా కొందరు రైతులు గడ్డివాములు వేసుకున్నారు. ఈ భవనం కూడ మరెక్కడో లేదు. స్వయానా చిలుకూరు గ్రామ సర్పంచ్‌ ఇంటి దగ్గరే ఉన్నది.  అలాగే సీతరాంపురం గ్రామంలో చెరువు పక్కన భవనం నిర్మించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు భయపడి బడికి పంపించరని అ భవనంను నేటి వరకు ప్రారంభించలేదు.  ఆచార్యులగూడెంలో కేంద్రాంకు  పక్కాభవనం ఉన్నా అ భవనం గ్రామ శివారులో ఉండడంతో విద్యార్థులు రాక పోవడంతో  ఆ అంగన్‌వాడీ కేంద్రం  నిర్వహణ స్థానిక ప్రాథమిక పాఠశాలలోనే నిర్వహిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే అభవనాలను  ప్రారంభించాలని పలువురు గ్రామస్తులు కోరుతున్నారు.
గడ్డివాము తీయిస్తాం–సుల్తాన్‌ వెంకటేశ్వర్లు, సర్పంచ్, చిలుకూరు
అంగన్‌ వాడీ భవనంలో  వేసిన గడ్డిని తీయిస్తాము. అధికారులతో మాట్లాడి భవనంకు నూతన ఏర్పాట్లు చేసి మరమ్మతులు చేసి భవనంను ఉపయోగంలోకి తీసుకొని వచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం.  తక్షణమే భవనంకు పూర్తి స్థాయిలో ప్రహరి ఏర్పాటు చేసి ఉపయోగంలోని తీసుకొని వస్తాం.
మాకు అప్పగించలేదు– వెంకటరమణ, అంగన్‌ వాడీ సూపర్‌వైజర్‌‡
చిలుకూరు, సీతరాంపురం గ్రామాల్లో  నిర్మించిన∙భవనాలు మాకు అధికారికంగా మాకు అప్పగించలేదు. అందుకే అ భవనాల్లో నిర్వాహాణ కొనసాగించడం లేదు. అలాగే ఆచార్యులగూడెం అంగన్‌ వాడీ భవనం గ్రామానికిు చివర ఉండడంతో విద్యార్థులు రాకపోవడంతో అ భవనం నిరుపయోగంగా ఉంది. పాఠశాల నిర్వాహాణ ప్రాథమిక పాఠశాలలో కొనసాగిస్తున్నాం.








 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement