రైల్వేస్టేషన్‌లో నెల్లూరుకు బయల్దేరిన బాలికలతో డీఆర్‌డీఏ అధికారి
బాలికలను అక్రమంగా తరలిస్తున్నారనే వార్తలతో కదిలిన యంత్రాంగం
డీఆర్‌డీఏ అనుమతి పొంది ఉద్యోగం కోసం పంపుతున్నట్టు వెల్లడి
వెనుదిరిగిన పోలీసులు, చైల్డ్‌లైన్ అధికారులు
ఆమదాలవలస : శ్రీకాకుళం రోడ్డు( ఆమదాలవలస) రైల్వేస్టేషన్ నుంచి బాలికలను అక్రమంగా ర వాణా చేస్తున్నట్లు 1098కు వచ్చిన సమాచారంతో చైల్డ్ లైన్, మానవ అక్రమ రవాణా నిరోధక శాఖ పోలీసులు, జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్ పోలీసులు శనివారం రైల్లేస్టేషన్‌లో తనిఖీలు చేశారు. మూడో నంబర్ ప్లాట్‌ఫాంపై ఉన్న డీఆర్‌డీఏ జిల్లా ప్లేస్‌మెంట్ కో ఆర్డినేటర్ అశోక్‌కుమార్‌తో పాటు మరో 15మంది బాలికలను గుర్తించారు.
బాలికల అక్రమ తరలింపు విషయమై అశోక్‌కుమార్‌ను ప్రశ్నించగా బాలికలను డీఆర్‌డీఏ పీడీ ఇచ్చిన అనుమతి ఉత్తర్వులతో నెల్లూరు జిల్లా తడ మండలంలోని శ్రీసిటీ సెల్ కంపెనీలో నెలకు రూ.12వేలు జీతం ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకొని పంపిస్తున్నామని చెప్పారు. వీరంతా ఎచ్చెర్లలోని శిక్షణ పొందిన వారని చెప్పారు. దీంతో అధికారులు చేసేది ఏమి లేక వెనుదిరిగారు. సుమారు రెండు గంటల పాటు రైల్వేస్టేషన్‌లో అలజడి నెలకొంది. కార్యక్రమంలో ఏహెచ్‌టీయూ ఎస్.ఐ. ఎం.లక్ష్మయ్య, హెచ్.సీ. బి.జగదీశ్వరరావు, పీసీలు ఆర్.బాస్కరరావు, బి.జగదీష్‌కుమార్, జీఆర్‌పీ హె^Œ సీ ప్రకాశరావు, చైల్డ్‌లైన్ కో–ఆర్డినేటర్ సంతోష్‌కుమార్, ఫీల్డ్ అధికారిణి మాధవి తదితరులు పాల్గొన్నారు.