పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
Published Wed, Dec 7 2016 11:04 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
కలెక్టర్ అరుణ్‌కుమార్
వెలుగుబంద (రాజానగరం) : పర్యావరణ పరిరక్షణను అంతా బాధ్యతగా తీసుకుంటేనే సరైన ఫలితాలను అందుకోగలుగుతామని కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ అన్నారు. స్థానిక గైట్ కళాశాలలో 'స్వచ్చ భారత్ – స్వచ్చ ఆంధ్రప్రదేశ్'లో భాగంగా బుధవారం నిర్వహించిన 'మై బైక్' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నేడు ప్రపంచమంతా పచ్చని వాతావరణంతో కోరుకుంటుందని, మన దేశానికి ఎంతో అవసరమన్నారు. రాజమహేంద్రవరంలో సుమారు 15 వేల ఆటోలు తిరుగుతున్నాయని, వాటితోపాటు ఇతర వాహానాల నుంచి వెలువడే కాలుష్యంతో ప్రజలు అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉందన్నారు. సైకిలు వాడకంతో వాతావరణ కాలుష్యం తగ్గి పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చన్నారు. ప్రజలు సైకిలు వినియోగంపై మరింతగా చైతన్యవంతులు కావలన్నారు. ఇందులో గైట్ కళాశాల ముందుండం అభినందనీయమన్నారు.
సైకిలు తొక్కడం వలన కాలుష్య రహిత సమాజం ఏర్పడుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారని ఎమ్మెల్యేలు పెందుర్తి వెంకటేష్, డాక్టర్ ఆకుల సత్యనారాయణ, గోరంట్ల బుచ్చియ్యచౌదరి, జ్యోతుల నెహ్రు, ఎమ్మెల్సీలు ఆదిరెడ్డి అప్పారావు, కె.కిరణ్‌వర్మ అన్నారు. తమ కళాశాల ప్రాంగణాన్ని పర్యవరణ హితంగా చేసేందుకు ఏడేళ్లుగా ప్రణాళికాబద్దంగా కృషి చేస్తున్నామని చైతన్య విద్యా సంస్థల చైర్మన్ కేవీవీ సత్యనారాయణరాజు అన్నారు. ఇప్పటికే ప్రాంగణంలో బ్యాటరీ కార్లు వినియోగిస్తున్నామని, సంప్రదాయేతర ఇందన వనరులైన సౌర్యశక్తి, పవన విద్యుత్‌తో ట్రాన్సమిషన్ కష్టాలు లేకుండా ఒక మోగావాట్టు సామర్థ్యంతో రెండు యూనిట్లు విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నామన్నారు. కళాశాల విద్యార్థుల కోసం 200 సైకిళ్లను అందుబాటులో ఉంచడంలోపాటు గైట్ కళాశాల ద్వారా మూడు గ్రామాలను దత్తత తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్ విజయరాజు, కళాశాల ఎండి కె. శశికిరణ్‌వర్మ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గన్ని కృష్ణ, చైతన్య విద్యా సంస్థల సీఈఓ డాక్టర్ డీఎల్ ఎన్ రాజు, డీవైఎం ఎ. నరేష్‌రాజు, ప్రిన్సిపాల్స్ డాక్టర్ డివి రామ్మూర్తి, డాక్టర్ ఎస్. సత్యనారాయణరాజు, డాక్టర్ ధనరాజ్, జీఎం డాక్టర్ పి. సుబ్బరాజు, డైరెక్టర్ పివి రామరాజు, తదితరులు పాల్గొన్నారు.
Advertisement