giet
-
బ్యాటరీ సైకిల్‌పై సవారీ
35 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం ఆకట్టుకుంటున్న ఈ-పేంథర్, ఈ-డ్రాగన్ సైకిళ్లు రూపొందించిన గైట్ విద్యార్థులు రాజానగరం : ఆలోచనలకు పదును పెడితే అనేక అద్భుతాలను ఆవిష్కరించవచ్చని నిరూపిస్తున్నారు స్థానిక గైట్ కళాశాలకు చెందిన బీటెక్ విద్యార్థులు. ఆటోమొబైల్ ఇంజినీరింగ్ చేస్తున్న థర్డియర్, ఫైనల్ ఇయర్‌కు చెందిన ఏడుగురు విద్యార్థులు బ్యాటరీతో నడిచే సైకిళ్లను రూపొందించారు. ఈ సైకిళ్లకు ‘ఈ–పేంథర్, ఈ–డ్రాగాన్’ అని నామకరణం చేశారు. వీటికి సంబంధించిన వివరాలను హెచ్ఓడీ సుబ్రహ్మణ్యం శనివారం స్థానిక విలేకరులకు తెలిపారు. ఈ–పేంథర్ ఆటోమెబైల్ ఇంజినీరింగ్ చదువుతున్న బీటెక్ థర్డియర్ విద్యార్థులు హర్షవర్థన్‌రెడ్డి, కుమార్ వెంకటేష్, చంద్రశేఖర్ తాతాజీ పాత సైకిళ్లను తీసుకుని మెరుగులు దిద్దారు. బ్యాటరీ, మోటారును అమర్చిన సైకిల్‌కు ‘ఈ–పేంథర్’ అని పేరుపెట్టారు. దీని తయారీకి రూ.17 వేలు ఖర్చయింది. ఈ–డ్రాగాన్ బీటెక్ ఫైనలియర్‌కు చెందిన రాఘవ, మంజూష, మోహన్, సందీప్‌లు ఇదే తరహాలో బ్యాటరీతో నడిచే సైకిళ్లను రూపొందించారు. ‘ఈ–డ్రాగాన్’ పేరు పెట్టిన వీటి తయారీకి రూ.16 వేల వరకు ఖర్చు చేశారు. ప్రొఫెసర్ సందీ రాజశేఖర్ పర్యవేక్షణలో వీటిని తయారు చేశారు. బాలల నుంచి వృద్ధుల వరకూ ఈ వాహనాలను నడిపే వీలుంది. 35 కి.మీ. వేగంతో నడిచే ఈ వాహనాలకు ఉపయోగించే బ్యాటరీకి ఒకసారి చార్జింగ్ పెడితే 30 కి.మీ. వరకూ నడుస్తుంది. ఈ సైకిళ్లకు ఒక్కోదానికి 250 వాట్స్ మోటారు, కంప్యూటర్ యూపీఎస్‌లో వాడే బ్యాటరీలు నాలుగు (ఒక్కొక్కటి 12 వాట్స్) ఉపయోగించారు. ప్రాజెక్టు వర్కులో భాగంగా వీటిని తయారు చేశారని హెచ్ఓడీ తెలిపారు. -
గైట్కి ఉచిత బస్సు సదుపాయం
రాజానగరం : గైట్ కళాశాలలో శుక్రవారం జరగనున్న ఏపీ పాలిసెట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు తమ కళాశాల ద్వారా ఉచిత బస్సు సదుపాయం కల్పించామని గైట్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, పాలిసెట్ చీఫ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్. శ్రీనివాస్ తెలిపారు. రాజమహేంద్రవరంలోని ఆర్టీసీ బస్‌కాంప్లెక్స్ నుంచి శుక్రవారం ఉదయం 8.30 గంటలకు బస్సు బయలుదేరుతుందన్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్‌టికెట్ చూపించి, బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు. గైట్ కేంద్రంలో వెయ్యి మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారన్నారు. -
వచ్చే నెల 13 నుంచి ‘గైట్’లో ‘స్రష్ట2కె17’
వెలుగుబంద (రాజానగరం) : స్థానిక గైట్ కళాశాలలో ఫిబ్రవరి 13 నుంచి ‘స్రష్ట 2కె17’ పేరిట సాంకేతిక సింపోజియం నిర్వహించనున్నామని కళాశాల ఎండీ కె.శశికిరణ్‌వర్మ తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ని సోమవారం ఇక్కడ ఆవిష్కరించారు. రెండు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో ‘ఆర్టేనియం ప్లాట్‌ఫాం, ఇంటర్నెట్ మాడ్యువల్స్, క్లౌడ్ కంప్యూటింగ్’ అనే అంశాలపై శిక్షణ కార్యక్రమం జరుగుతుందన్నారు. 15న ఈ అంశాలపై పోటీ ఉంటుందన్నారు. అలాగే సాంకేతిక పత్రాలు, పోస్టర్ల సమర్పణ, ప్రాజెక్టు ఎక్స్పో, క్విజ్, ఫిల్మ్ మేకింగ్, ఫొటోగ్రఫీ, స్మార్ట్ ఈవెంట్స్ జరుగుతాయన్నారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు కె.లక్షీ్మశశికిరణ్, సీఈఓ డాక్టర్ డీఎల్ఎ¯ŒS రాజు, ప్రిన్సిపాల్స్, డైరెక్టర్లు పాల్గొన్నారు. -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
కలెక్టర్ అరుణ్‌కుమార్ వెలుగుబంద (రాజానగరం) : పర్యావరణ పరిరక్షణను అంతా బాధ్యతగా తీసుకుంటేనే సరైన ఫలితాలను అందుకోగలుగుతామని కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ అన్నారు. స్థానిక గైట్ కళాశాలలో 'స్వచ్చ భారత్ – స్వచ్చ ఆంధ్రప్రదేశ్'లో భాగంగా బుధవారం నిర్వహించిన 'మై బైక్' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నేడు ప్రపంచమంతా పచ్చని వాతావరణంతో కోరుకుంటుందని, మన దేశానికి ఎంతో అవసరమన్నారు. రాజమహేంద్రవరంలో సుమారు 15 వేల ఆటోలు తిరుగుతున్నాయని, వాటితోపాటు ఇతర వాహానాల నుంచి వెలువడే కాలుష్యంతో ప్రజలు అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉందన్నారు. సైకిలు వాడకంతో వాతావరణ కాలుష్యం తగ్గి పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చన్నారు. ప్రజలు సైకిలు వినియోగంపై మరింతగా చైతన్యవంతులు కావలన్నారు. ఇందులో గైట్ కళాశాల ముందుండం అభినందనీయమన్నారు. సైకిలు తొక్కడం వలన కాలుష్య రహిత సమాజం ఏర్పడుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారని ఎమ్మెల్యేలు పెందుర్తి వెంకటేష్, డాక్టర్ ఆకుల సత్యనారాయణ, గోరంట్ల బుచ్చియ్యచౌదరి, జ్యోతుల నెహ్రు, ఎమ్మెల్సీలు ఆదిరెడ్డి అప్పారావు, కె.కిరణ్‌వర్మ అన్నారు. తమ కళాశాల ప్రాంగణాన్ని పర్యవరణ హితంగా చేసేందుకు ఏడేళ్లుగా ప్రణాళికాబద్దంగా కృషి చేస్తున్నామని చైతన్య విద్యా సంస్థల చైర్మన్ కేవీవీ సత్యనారాయణరాజు అన్నారు. ఇప్పటికే ప్రాంగణంలో బ్యాటరీ కార్లు వినియోగిస్తున్నామని, సంప్రదాయేతర ఇందన వనరులైన సౌర్యశక్తి, పవన విద్యుత్‌తో ట్రాన్సమిషన్ కష్టాలు లేకుండా ఒక మోగావాట్టు సామర్థ్యంతో రెండు యూనిట్లు విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నామన్నారు. కళాశాల విద్యార్థుల కోసం 200 సైకిళ్లను అందుబాటులో ఉంచడంలోపాటు గైట్ కళాశాల ద్వారా మూడు గ్రామాలను దత్తత తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్ విజయరాజు, కళాశాల ఎండి కె. శశికిరణ్‌వర్మ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గన్ని కృష్ణ, చైతన్య విద్యా సంస్థల సీఈఓ డాక్టర్ డీఎల్ ఎన్ రాజు, డీవైఎం ఎ. నరేష్‌రాజు, ప్రిన్సిపాల్స్ డాక్టర్ డివి రామ్మూర్తి, డాక్టర్ ఎస్. సత్యనారాయణరాజు, డాక్టర్ ధనరాజ్, జీఎం డాక్టర్ పి. సుబ్బరాజు, డైరెక్టర్ పివి రామరాజు, తదితరులు పాల్గొన్నారు. -
సంకల్పంతో ముందడుగు వేయాలి
ప్రతి విద్యార్థి పారిశ్రామిక వేత్తగా ఎదగాలి జేఎన్టీయూకే వీసీ ఆచార్య వీఎస్ఎస్ కుమార్ గైట్‌లో ప్రారంభమైన సాంకేతిక ఉత్సవాలు వెలుగుబంద (రాజానగరం) : నేడు ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తున్న ప్రతి విద్యార్థి రేపు ఒక మంచి పారిశ్రామికవేత్త కావాలనే సంకల్పంతో ముందడుగు వేయాలని జేఎన్టీయూకే వైస్‌చాన్సలర్ ఆచార్య వీఎస్ఎస్ కుమార్ అన్నారు. బుధవారం స్థానిక గైట్ కళాశాలలో రెండు రోజులపాటు జరిగే సాంకేతిక ఉత్సవాలను ఆయన జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఇంజనీరింగ్ విద్య అనంతరం ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా పారిశ్రామికవేత్తలుగా తయారయ్యేందుకు కృషి చేయాలన్నారు. ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే ఇటువంటి సాంకేతిక ఉత్సవాల్లో పాల్గొనడం వలన పరిజ్ఞానాన్నివృద్ధి చేసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. భారతదేశం గర్వించదగిన మహోన్నత వ్యక్తి భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యని చైతన్య విద్యా సంస్థల చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ కేవీవీ సత్యనారాయణరాజు అన్నారు. దేశంలోను, రాష్ట్రంలోను అపారంగా ఉద్యోగావకాశాలు ఉన్నాయని, వాటిని యువ ఇంజనీర్లు సద్వినియోగం చేసుకోవాలన్నారు. నైపుణ్యం ఉన్నవాడికి ఉపాధికి కొదవ ఉండదన్నారు. అలాగే కొత్తవారితో పరిచయాల ద్వారా విజ్ఞాన్నాన్ని పెంపొందించుకునేందుకు, పరస్పరం పంచుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ కారణంగానే ఏటా ఇంజనీర్స్ డే సందర్భంగా తమ కళాశాలల్లో సాంకేతిక ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కళాశాలలో త్వరలో జాతీయ స్థాయిలో ఐటీఐ వర్క్‌షాపును నిర్వహించాలని ప్రిన్సిపాల్స్కి ఆయన సూచించారు. ఇంజనీరింగ్ విద్యార్థుల ఆలోచనల్లో ఒక ప్రత్యేకత ఉండాలని, విన్నూతమైన ఆలోచనలతో కొత్తఒరవడికి తీసుకువచ్చే ప్రయత్నం చేయాలని ఒడిస్సాకు చెందిన బిజూపట్నాయక్ యూనివర్సిటీ విశ్రాంత వీసీ, ఆర్ఎస్బీ మెటల్ టెక్ డైరెక్టర్ డాక్టర్ ఓంకార్‌నాథ్ మహంతి అన్నారు. ఇంజనీరింగ్ డే సందర్భంగా తమ కళాశాలలో ప్రస్తుతం 15వ మేథ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని సమావేశానికి అధ్యక్షత వహించిన చైతన్య విద్యా సంస్థల సీఈఓ డాక్టర్ డీఎల్ఎన్ రాజు అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందించనున్నామని ప్రిన్సిపాల్ డాక్టర్ డీవీ రామ్మూర్తి తెలిపారు. అలాగే ఫ్రీ పొల్యూషన్ చెకప్ క్యాంప్ నిర్వహించి వాహనచోదకుల నుంచి ప్రతిజ్ఞ పత్రాలను తీసుకుంటున్నామన్నారు. సర్ మోక్షగుండంకు నివాళులు ఇంజనీర్ల దినోత్సవం సందర్బంగా భారతరత్న, సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి తొలుత పూలమాలలు వేసి, నివాళులర్పించారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను ఘనంగా సన్మానించి, జ్ఞాపికలు అందజేశారు. గైట్ అటోమొబైల్ ఇంజినీరింగ్ విద్యార్థి తయారు చేసిన బైక్ ట్రాన్స్ఫార్మర్ రోబోను అతిథులు పరిశీలించి, ఆ విద్యార్థిని అభినందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ డాక్టర్ ఎస్. సూర్యనారాయణరాజు, డాక్టర్ కపిలేశ్వరమిశ్రా, వైస్‌ప్రిన్సిపాల్ జగన్నాధరాజు, డీన్ డాక్టర్ వరప్రసాదరావు, డైరెక్టర్స్ డాక్టర్ ఎల్ఎస్ గుప్త, డాక్టర్ పీఆర్‌కె రాజు, జీఎం డాక్టర్ పి.సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.