గైట్‌కి ఉచిత బస్సు సదుపాయం
Published Fri, Apr 28 2017 12:34 AM | Last Updated on Tue, Sep 5 2017 9:50 AM
రాజానగరం :
గైట్ కళాశాలలో శుక్రవారం జరగనున్న ఏపీ పాలిసెట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు తమ కళాశాల ద్వారా ఉచిత బస్సు సదుపాయం కల్పించామని గైట్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, పాలిసెట్ చీఫ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్. శ్రీనివాస్ తెలిపారు. రాజమహేంద్రవరంలోని ఆర్టీసీ బస్‌కాంప్లెక్స్ నుంచి శుక్రవారం ఉదయం 8.30 గంటలకు బస్సు బయలుదేరుతుందన్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్‌టికెట్ చూపించి, బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు. గైట్ కేంద్రంలో వెయ్యి మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారన్నారు.
Advertisement
Advertisement