వచ్చే నెల 13 నుంచి ‘గైట్’లో ‘స్రష్ట2కె17’
Published Mon, Jan 16 2017 9:24 PM | Last Updated on Tue, Sep 5 2017 1:21 AM
వెలుగుబంద (రాజానగరం) :
స్థానిక గైట్ కళాశాలలో ఫిబ్రవరి 13 నుంచి ‘స్రష్ట 2కె17’ పేరిట సాంకేతిక సింపోజియం నిర్వహించనున్నామని కళాశాల ఎండీ కె.శశికిరణ్‌వర్మ తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ని సోమవారం ఇక్కడ ఆవిష్కరించారు. రెండు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో ‘ఆర్టేనియం ప్లాట్‌ఫాం, ఇంటర్నెట్ మాడ్యువల్స్, క్లౌడ్ కంప్యూటింగ్’ అనే అంశాలపై శిక్షణ కార్యక్రమం జరుగుతుందన్నారు. 15న ఈ అంశాలపై పోటీ ఉంటుందన్నారు. అలాగే సాంకేతిక పత్రాలు, పోస్టర్ల సమర్పణ, ప్రాజెక్టు ఎక్స్‌పో, క్విజ్, ఫిల్మ్ మేకింగ్, ఫొటోగ్రఫీ, స్మార్ట్ ఈవెంట్స్ జరుగుతాయన్నారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు కె.లక్షీ్మశశికిరణ్, సీఈఓ డాక్టర్ డీఎల్‌ఎ¯ŒS రాజు, ప్రిన్సిపాల్స్, డైరెక్టర్లు పాల్గొన్నారు.
Advertisement
Advertisement