వర్మీ కంపోస్టు, నాడెప్‌ యూనిట్లకు పోత్సాహం | varmicompost nadep collector arun | Sakshi
Sakshi News home page

వర్మీ కంపోస్టు, నాడెప్‌ యూనిట్లకు పోత్సాహం

Published Mon, Oct 10 2016 9:44 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM

వర్మీ కంపోస్టు, నాడెప్‌ యూనిట్లకు పోత్సాహం - Sakshi

వర్మీ కంపోస్టు, నాడెప్‌ యూనిట్లకు పోత్సాహం

కలెక్టర్‌ అరుణ్‌కుమార్‌
కాకినాడ సిటీ :  జిల్లాలో వర్మీ కంపోస్టు యూనిట్లతో బాటు నాడెప్‌ యూనిట్లను కూడా ప్రోత్సహించాలని కలెక్టర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌ సూచించారు. కలెక్టరేట్‌లో సోమవారం వివిధ శాఖల జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో వివిధ అంశాలపై సమీక్షించారు. జిల్లాలో ఈ సంవత్సరం 15 వేల వర్మీ కంపోస్టు యూనిట్ల ఏర్పాటు లక్ష్యం కాగా ఇప్పటివరకూ 300 ఏర్పాటు చేశారన్నారు. వానపాముల వినియోగం లేకుండా నూతనంగా రూపొందించిన నాడెప్‌ యూనిట్లలో చెత్త, పేడ, గడ్డి, ఆకులు, కొమ్మలు వంటి వ్యర్థ పదార్థాలను ఎరువుగా మార్చవచ్చన్నారు. రూ.10 వేలు ఖర్చయ్యే ఈ యూనిట్లను ఉపాధి హామీ పథకం ద్వారా ప్రోత్సహించాలని, రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఐదు నెలల్లో ఉపాధి హామీ, స్వచ్ఛభారత్‌ మిషన్‌ ద్వారా మొత్తం 60 వేల వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టవలసి ఉంటుందన్నారు.
ఏజెన్సీలో దోమతెరల పంపిణీకి ఆదేశం
ఏజెన్సీలో పంపిణీకి 1.03 లక్షల దోమ తెరలు సోమవారం జిల్లాకు వచ్చాయన్నారు. వీటిని మంగళవారం నుంచి ఏజెన్సీలో పంపిణీ చేయాలని ఆదేశించారు. కుటుంబంలోని సభ్యుల ఆధారంగా వివిధ సైజులలో దోమతెరలను పంపిణీ చేస్తారన్నారు. 
జెడ్పీ నిర్ణయాలపై స్పందించాలి 
ఇటీవల జెడ్పీ సర్వసభ్య సమావేశాలలో పలువురు సభ్యులు లేవనెత్తిన అంశాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ సూచించారు.వివిధ సంక్షేమ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు కార్పొరేషన్ల యూనిట్ల మంజూరు, గ్రౌండింగ్‌లపై శ్రద్ధ చూపాలన్నారు.
జిల్లా వెబ్‌సైట్‌లో డేష్‌ బోర్డు 
జిల్లా వెబ్‌సైట్‌లో జిల్లా డేష్‌బోర్డులో వివిధ శాఖల ప్రగతిని ఎప్పటికప్పుడు పరిశీలించవచ్చన్నారు. మీకోసం పోర్టల్‌లో పెండిం గ్‌లో ఉన్న ఫిర్యాదులపై తగు చర్యలను నిర్ణీత కాలంలో చేపట్టాలనిÜూచించారు. ఈ సమావేశంలో జేసీ ఎస్‌.సత్యనారాయణ, జేసీ–2 జె.రాధాకృష్ణమూర్తి, అధికారులు పాల్గొన్నారు. 
ధాన్యం రవాణాపై నిఘా
కాకినాడ సిటీ : ఒడిస్సా, ఛత్తీస్‌గఢ్, పశ్చిమబెంగాల్, బీహార్ల నుంచి రవాణా చేసి జిల్లాలో రైతుల నుంచి కొనుగోలు చేసినట్టు కొంతమంది మిల్లర్లు చూపుతున్న విధానంపై నిరంతర నిఘా అవసరమని కలెక్టర్‌  అరుణ్‌కుమార్‌ హెచ్చరించారు. కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలపై సమీక్షించా రు. వాణిజ్య పన్నుల శాఖ, వ్యవసాయ, మార్కెటింగ్‌ కమిటీల స హకారంతో ఇతర ప్రాంతాల నుంచి ధాన్యం రవాణా అక్రమాల ను అరికట్టాలన్నారు. చెక్‌పోస్ట్‌లను అప్రమత్తం చేసి, కోతలు మొ దలయ్యే ఈ నెలాఖరు నుంచి డిసెంబర్‌ వరకూ నిరంతర పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. అవసరమైతే అదనపు చెక్‌పోస్టులను ఏర్పాటు చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు పై ప్రాథమిక పరపతి సంఘాలు, డ్వాక్రా మహిళల ద్వారా ప్ర చారం చేయించాలని డీసీఓ, డీఆర్‌డిఏ అధికారులను ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement