దళితుల సమస్యలపై పోరాటం | ride on sc alligations | Sakshi
Sakshi News home page

దళితుల సమస్యలపై పోరాటం

Published Sun, Jul 17 2016 7:44 PM | Last Updated on Sat, Sep 15 2018 3:16 PM

మాట్లాడుతున్న కేవీపీఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.నాగయ్య - Sakshi

మాట్లాడుతున్న కేవీపీఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.నాగయ్య

  • దళిత ఆత్మగౌరవ ఉద్యమం
  • కేవీపీఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.నాగయ్య
  • కరీంనగర్‌ : దళితులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడేందుకు ‘దళిత ఆత్మగౌరవ ఉద్యమం’ చేపడుతున్నట్లు కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్‌) రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.నాగయ్య తెలిపారు. భగత్‌నగర్‌లోని మెడికల్‌ రిప్స్‌ భవనంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఇంకా దళితులను అస్ప­ృశ్యత, అంటరానితనం వెంటాడుతుందన్నారు. దళిత వాడలో అభివృద్ధి చెందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేషన్‌ రుణాల మంజూరులో జాప్యమవుతుందన్నారు.
    ప్రజాసాంస్క­ృతిక వేదిక రాష్ట్ర కన్వీనర్‌ జి.రాములు మాట్లాడుతూ ప్రజలను ప్రజాసాంస్కృతిక విప్లవం వైపు మళ్లించాలన్నారు.  కేవీపీఎస్‌ జిల్లా కార్యదర్శి టి.సురేష్, అధ్యక్షుడు కె.అశోక్, ఉపాధ్యక్షులు మర్రి వెంకటస్వామి, సంపత్, నరేందర్, కృష్ణ, నాయకులు కరుణాకర్, జిట్టు లింగామూర్తి పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement